
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి ఎదురు తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా గాయం కారణంగా ఈ ఏడాది సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌ల మొత్తానికి దూరమయ్యాడు. ఆడమ్ జంపా మోకాలి గాయంతో బాధపడుతున్నాడు.
గాయం నుంచి కోలుకునేందుకు జంపా తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో జంపా స్దానాన్ని కర్ణాటక ప్లేయర్ స్మరన్ రవిచంద్రన్‌తో ఎస్ఆర్‌హెచ్ భర్తీ చేసింది. రూ. 30ల లక్షల కనీస ధరకు రవిచంద్రన్‌ని సన్‌రైజర్స్ సొంతం చేసుకుంది. అతడి రిప్లేస్‌మెంట్‌ను ఐపీఎల్ ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఆమోదించింది.
21 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్ గతేడాది కర్ణాటక తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. మొత్తం మూడు ఫార్మాట్‌లలోనూ అద్బుతంగా రాణిస్తున్నాడు. కర్ణాటక తరఫున స్మరన్ 7 ఫస్ట్-క్లాస్, 10 లిస్ట్ A, 6 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2024-25 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ (SMAT) సీజన్‌లో స్మరన్ అసాధారణ ప్రదర్శన చేశాడు.
ఈ కర్ణాటక ఆటగాడు 6 మ్యాచ్‌ల్లో 34 సగటుతో 170 పరుగులు చేశాడు. స్మరన్‌కు అద్బుతమైన పవర్ హిట్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. అయితే ఈ ఏడాది మార్చిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్మరన్‌ను ట్రయల్స్‌కు పిలిచింది. ఎవరైనా గాయపడితే అతడిని జట్టులోకి తీసుకోవాలని ఆర్సీబీ భావించింది. కానీ అంతలోనే రవిచంద్రన్‌ను ఎస్ఆర్‌హెచ్ సొంతం చేసుకుంది.
చదవండి: IPL 2025: అక్షర్ పటేల్‌కు భారీ షాక్.. రూ.12 లక్షల జరిమానా