చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి | HISTORY BY KING KOHLI, Most fifty plus scores vs SENA in International cricket | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి

Nov 4 2026 3:08 PM | Updated on Nov 4 2026 3:08 PM

HISTORY BY KING KOHLI, Most fifty plus scores vs SENA in International cricket

source: X

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లి మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో అర్ద శతకం (51 బంతుల్లో 74;  13 ఫోర్లు, సిక్సర్‌) సాధించడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) దేశాలపై అత్యధిక ప్లస్‌ స్కోర్లు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు.

సచిన్‌ తన కెరీర్‌లో SENA దేశాలపై 133 అర్ధ శతకాలు సాధించగా.. విరాట్‌ 134 సార్లు 50కి పైగా స్కోర్లు సాధించాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య ఆక్లాండ్‌ వేదికగా తొలి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలుపు అంచుల్లో ఉంది. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన భారత్‌ న్యూజిలాండ్‌ను 185 పరుగులకే (0.2 ఓవర్లలో) కుప్పకూల్చింది. 

అర్షదీప్‌ సింగ్‌ 4, గుర్నూర్‌ బ్రార్‌ 3, అన్షుల్‌ కంబోజ్‌ 2 వికెట్లతో చెలరేగారు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో టిమ్‌ సీఫర్ట్‌ (38), డారిల్‌ మిచెల్‌ (28), గ్లెన్‌ ఫిలిప్స్‌ (30), జేకబ్‌ డఫీ (15 నాటౌట్‌) రెండంకెల స్కోర్లు చేయగా.. 11వ నంబర్‌ ఆటగాడు బ్లెయిర్‌ టిక్నర్‌ (34) ఆఖర్లో సుడిగాలి ఇన్నింగ్స్‌ ఆడాడు.

అనంతరం​ భారత్‌ లక్ష్య ఛేదనలో సమయంలో వరుణుడు ఆటంకం కలిగించడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం టార్గెట్‌ను మార్చారు. లక్ష్యాన్ని 32 ఓవర్లలో 143 పరుగులకు కుదించారు. 22 ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ 5 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసి, లక్ష్యానికి 5 పరుగుల దూరంలో ఉంది. కేఎల్‌ రాహుల్‌ (2), నమన్‌ ధిర్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. 

ఇదీ చదవండి: ‍స్టార్క్‌ నంబర్‌ వన్‌.. ఏడో స్థానానికి శ్రేయస్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement