తీన్మార్ డ్యాన్స్‌తో అదరగొట్టిన నాగదుర్గ | Nagadurga Teenmaar Dance Idupu Kayitham Movie | Sakshi
Sakshi News home page

Naga Durga: కొత్త పెళ్లికూతురిలా నాగదుర్గ సూపర్ డ్యాన్స్

Nov 8 2026 11:20 AM | Updated on Nov 8 2026 11:20 AM

Nagadurga Teenmaar Dance Idupu Kayitham Movie

నాగదుర్గ పేరు చెప్పగానే యూట్యూబ్‌లో ఫోక్ సాంగ్సే గుర్తొస్తాయి. తనదైన డ్యాన్సులతో అదరగొట్టేసింది. ప్రస్తుతం హీరోయిన్‌గా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈమె నుంచి రాబోతున్న లేటెస్ట్ తెలుగు మూవీ 'ఇడుపు కాయితం'. వచ్చే నెల 11న థియేటర్లలో రిలీజ్ కానుంది. దీపావళి సందర్భంగా ఈ చిత్రబృందం విషెస్ చెబుతూ కొత్త వీడియో సాంగ్ వదిలారు.

(ఇదీ చదవండి: పర్సనల్ వీడియో వైరల్.. నటి సురేఖావాణి సీరియస్)

'బరాత్ బీట్' పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియోలో కొత్త పెళ్లి కూతురిలా నాగదుర్గ.. తీన్మార్ డ్యాన్స్ అదరగొట్టేసింది. స్టెప్పులు అదిరిపోయాయి. ప్రియదర్శి హీరోగా చేసిన ఈ సినిమాతో వంశీరెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బన్నీ వాసు, తబిత సుకుమార్ నిర్మాతలు.

(ఇదీ చదవండి: నిశ్చితార్థం జరిగిన రెండేళ్లకు పెళ్లి చేసుకున్న హీరోయిన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement