యూట్యూబ్ సాంగ్స్‌తో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుని ఇప్పుడు హీరోయిన్ అయిపోయిన నాగదుర్గ.. త్వరలో 'ఇడుపు కాయితం'తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి శ్రీలత అనే సాంగ్ రాగా అది హిట్ అయింది. తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించడంతో పాటు 'గడప' అనే సాంగ్ వదిలారు.
(ఇదీ చదవండి: ప్రభాస్ బర్త్ డే.. దర్శకుడి భార్యకు ముద్దుపెట్టిన ఫొటో వైరల్)
ఈ డిసెంబరు 11న మూవీ రిలీజ్ కానుందని చెబుతూ 'గడప' సాంగ్ లాంచ్ చేసిన టీమ్.. హైదరాబాద్‌లో శుక్రవారం ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులోనే నాగదుర్గ తన గురించి, షూటింగ్ టైంలో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ గురించి చెప్పుకొచ్చింది.
నేను ముందే చెప్పినట్లు సినిమాల్లోకి అసలు రావాలనుకోలేదని, కానీ 'ఇడుపు కాయితం' స్టోరీ ఫుల్ నెరేషన్ విని, శ్రీలత క్యారెక్టర్ వేసుకున్నాక ఇది నా కోసమే ఉందని అనిపించింది. షూటింగ్ మొదలైన మొదట్లోనే నేను చిన్న పిల్లని బాగా చూసుకోండి అని చెప్పా. కానీ నన్ను దర్శి గారు(ప్రియదర్శి) చాలా ర్యాగింగ్ చేశారు. వాసు(బన్నీ వాసు) సార్‌కు చెప్తా అంటే, 'చెప్పుకోపో.. మీ పెద్దారెడ్డిని' అని అన్నారు. కాలేజీలో కూడా నన్నెవరూ ర్యాగింగ్ చేయలేదు. ఎందుకంటే మా డాడీ పోలీస్ కాబట్టి. కానీ ప్రియదర్శి ర్యాగింగ్ చేస్తున్నారు' అని నాగదుర్గ చెప్పుకొచ్చింది.
'గడప' సాంగ్ విషయానికొస్తే అచ్చమైన తెలంగాణ సాహిత్యానికి తోడు అత్తారింట్లో అడుగుపెట్టే కొత్త కోడలిని చూసి ఒకవేళ గడప పాట పాడితే ఎలా ఉంటుందో ఈ గీతంలో చూపించారు.
(ఇదీ చదవండి: శోభనం జరగనివ్వని 'తోకచుక్క'.. మలయాళ థ్రిల్లర్ 'ధూమకేతు' రివ్యూ(ఓటీటీ))


