'అవతార్3' ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది.. ‍ట్రైలర్‌పై ప్రకటన | Avatar 3: Fire And Ash Movie Trailer Announcement Update, Interesting Details Inside | Sakshi
Sakshi News home page

'అవతార్3' ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది.. ‍ట్రైలర్‌పై ప్రకటన

Jul 22 2025 8:01 AM | Updated on Jul 22 2025 9:39 AM

Avatar 3 Movie Trailer Update Details

హాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ (James Cameron) తెరకెక్కించిన విజువల్‌ వండర్‌ 'అవతార్'.. ప్రపంచ సినీ చరిత్రలో ఈ సినిమా ఒక సంచలనం. మొదటి భాగంలో పండోర అనే  గ్రహాన్ని క్రియేట్‌ చేసి అందులోని ప్రకృతి అందాలను కళ్లుచెదిరే విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేశారు దర్శకుడు. ఆ తర్వాత పార్ట్‌2 ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’తో మెప్పించారు. తాజాగా దీని మూడో భాగం 'అవతార్‌- ఫైర్‌ అండ్‌ యాష్‌' గురించి అదిరిపోయే అప్‌డేట్‌ను మేకర్స్‌ ప్రకటించారు.

అవతార్‌ ప్రాంఛైజ్‌ చిత్రాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో మూడో భాగం 'అవతార్‌- ఫైర్‌ అండ్‌ యాష్‌' ఫస్ట్‌ లుక్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఆపై జులై 25న మొదటి ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 2026 డిసెంబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా దాదాపు160 భాషల్లో 'అవతార్‌ 3' విడుదల కానుంది. 

పార్ట్‌2 అయిన 'అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌'లో  'కేట్‌ విన్స్‌లెట్‌' చేసిన రోనాల్‌ పాత్రను అవతార్‌ 3లో మరింత పొడిగించామని మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని చెప్పారు. అందుకోసం ఆమె చాలా కష్టపడి శిక్షణ తీసుకున్నట్లు కూడా తెలిపారు. అవతార్‌ ఫ్రాంచైజీలో భాగంగా రానున్న 'అవతార్‌ 4' 2029లో, 'అవతార్‌ 5' డిసెంబరు 2031లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలోనే తెలిపింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement