ఓటీటీలో భారీ యాక్షన్‌ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్‌ | The Accountant 2 Movie OTT Streaming Now | Sakshi
Sakshi News home page

ఓటీటీలో భారీ యాక్షన్‌ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్‌

Jun 5 2025 8:05 PM | Updated on Jun 5 2025 9:17 PM

The Accountant 2 Movie OTT Streaming Now

హాలీవుడ్‌ భారీ యాక్షన్‌ మూవీ 'ది అకౌంటెంట్ 2' ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులో కూడా స్ట్రీమింగ్‌ అవుతుంది. 2016లో విడుదలైన అకౌంటెంట్ మూవీకి సిక్వెల్‌గా పార్ట్‌ 2 చిత్రాన్ని దర్శకుడు గావిన్ ఓ'కానర్ తెరకెక్కించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బాక్సాఫీస్‌ వద్ద రూ. 850 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. ఆపై ఎమ్‌డీబీలో 7 రేటింగ్‌ సాధించింది. బెన్ అఫ్లెక్, జోన్ బెర్నాల్‌, సింథియా అడ్డై-రాబిన్సన్,  J. K. సిమన్స్ వంటి హాలీవుడ్‌ స్టార్స్‌ నటించారు.

అకౌంటెంట్ 2 మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో జూన్‌ 5నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదలైంది. భారీ యాక్షన్‌ సినిమాలను ఇష్టపడేవారికి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుందని చెప్పవచ్చు. ఇంగ్లీష్‌ వర్షన్‌తో తెలుగు సబ్‌టైటిల్స్‌లో కూడా చూడవచ్చు.  అత్యంత భారీ బడ్జెట్‌తో అమెజాన్ MGM స్టూడియోస్ (యునైటెడ్ స్టేట్స్), వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement