Avatar 3: అవతార్‌ 3 కాన్సెప్ట్‌ అదుర్స్‌.. అంచనాలను పెంచేసిన దర్శకుడు!

James Cameron Reveal Avatar 3 Concept - Sakshi

‘అవతార్‌’లో పండోరా గ్రహాన్ని సృష్టించి, ప్రకృతి అందాలను తెరపై సరికొత్తగా చూపించి అందరిని ఆశ్చర్యపరిచాడు జేమ్స్‌ కామెరూన్‌. దాదాపు 13 ఏళ్ల తర్వాత దానికి కొనసాగింపుగా ‘అవతార్‌ అవతార్‌-ది వే ఆఫ్ వాటర్’(అవతార్‌-2)ను తెరకెక్కించాడు. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టింది. సముద్ర గర్భంలో ఓ అందమైన ప్రపంచం ఉందని ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు తెలియజేశాడు.

పార్ట్‌ 1లో అడవి అందాను చూపిస్తే.. పార్ట్‌ 2లో సముద్రం లోపల మరో సుందరమైన ప్రపంచం ఉందని తెలియజేశాడు. దీంతో అవతార్‌ 3పై అందరికి ఆసక్తి నెలకొంది. పార్ట్‌ 3 నేపథ్యం ఏంటి? కొత్తగా ఏం చూపించబోతున్నారనే ఉత్సకత ప్రేక్షకుల్లో మరింత పెరిగింది. తాజాగా అవతార్‌ 3 కాన్సెప్ట్‌ ఏంటో దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ వెల్లడించాడు. నిప్పు నేపథ్యంలో అవతార్‌ 3 కొనసాగుతుందట.

ఇటీవల క్రిటిక్‌ చాయిస్‌ అవార్డ్‌ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే.  ఇందులో  అవతార్‌ 2కి ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్‌ మూవీ అవార్డు లభించింది. తాజాగా జరిగిన ఈ కార్యక్రమంలో జేమ్స్‌ కామెరూన్‌ పాల్గొని, అవార్డును స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  అవతార్‌ 3 ఎలా ఉండబోతుందో వివరించాడు. ‘అగ్ని ఒక చిహ్నం..ప్రయోజకారి. అవతార్‌ 3లో ఇదే ప్రధాన ఇతివృత్తంగా ఉంటుంది. దీంతో పాటు మరో రెండో సంస్కృతులను కూడా పరిచయం చేస్తా. ఒమక్టయా, మెట్కైనా తెగలను మీరు కలుస్తారు. ఇదంతా పండోరా గ్రహంలోనే జరుగుతుంది. ఇంతకు మించి ఏమి చెప్పలేను’అని జేమ్స్‌ కామెరూన్‌ అన్నారు.

అవతార్‌2తో పాటే అవతార్‌ 3 షూటింగ్‌ని కూడా పూర్తి చేశాడు జేమ్స్‌ కామెరూన్‌. విజువల్‌ఎఫెక్ట్స్‌ పని మాత్రం మిగిలి ఉంది. వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పండోరా గ్రహంలోని ఏడాది ప్రదేశంలో ఈ సినిమా సాగుతుందని హాలీవుడ్‌ టాక్‌. అక్కడ ఉండే సంపదను దోచుకోవడానికి మనుషులు ప్రయత్నిస్తే.. వారిని జేక్‌ సెల్లీ ఫ్యామిలీ ఎలా అడ్డుకుంది అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారట.  మరి ఈ చిత్రం ఎన్ని రికార్డులను క్రియేట్‌ చేస్తుందో చూడాలి. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top