టాలీవుడ్‌కు ఐ బొమ్మ వార్నింగ్.. సోషల్ మీడియాలో వైరల్! | iBomma Strong Warning To Telugu Film Industry Goes Viral - Sakshi
Sakshi News home page

IBomma Warning: ఐ బొమ్మ వార్నింగ్‌ ఇవ్వడమేంటి?.. వైరలవుతున్న పోస్ట్!

Published Thu, Sep 7 2023 9:24 PM | Last Updated on Fri, Sep 8 2023 11:39 AM

I Bomma Warning Note To Tollywood Film Makers Goes Viral In Social Media - Sakshi

టాలీవుడ్ ప్రేక్షకులకు ఐ బొమ్మ గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే ఓటీటీలో రిలీజైన సినిమాలను ఎలాంటి ఖర్చు లేకుండా అభిమానులకు అందుబాటులోకి తీసుకొచ్చే వెబ్‌సైట్‌ ఇదే. సినీ ప్రియులకు రూపాయి ఖర్చు లేకుండా వినోదాన్ని అందిస్తోంది. అంతలా ఆదరణ దక్కించుకున్న ఐ బొమ్మపై ఇప్పటివరకు చాలాసార్లు రూమర్స్ వచ్చాయి. గతంలో ఈ వెబ్‌సైట్‌ పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కానీ అలాంటిదేం జరగలేదు. అయితే తాజాగా ఐ బొమ్మకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

(ఇది చదవండి: బాహుబలి తర్వాత అందుకే చేయలేదు: అనుష్క శెట్టి ఆసక్తికర కామెంట్స్!)

తాజాగా ఐ బొమ్మ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. టాలీవుడ్‌ నిర్మాతలకు వార్నింగ్‌ ఇస్తూ నోట్ విడుదల చేసింది. మా మీద మీరు ఫోకస్ పెడితే.. మేం ఎక్కడ ఏం చేయాలో అక్కడ చేస్తామంటూ హెచ్చరిక చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికైనా మా వెబ్‌సైటు మీద ఫోకస్ చేయడం ఆపండి.. లేదంటే మేము మీ మీద ఫోకస్ చేయాల్సింవస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుత ఈ పోస్ట్ టాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు సినీ ప్రముఖులు ఎవరూ కూడా స్పందించలేదు. 

అయితే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ నోట్‌ టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరీ ఈ నోట్‌ను నిజంగానే ఆ సంస్థ విడుదల చేసిందా లేక కావాలని ఎవరైనా ఆ పేరుతో ఇలా అసత్యం ప్రచారం చేస్తున్నారా? అన్న అనుమానాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఓ పైరసీ సైట్‌ ఇలా నిర్మాతలకు వార్నింగ్‌ ఇవ్వడమేంటని చర్చించుకుంటున్నారు. 

(ఇది చదవండి: మాజీ భార్యతో జతకట్టిన అమిర్‌ ఖాన్.. దాదాపు 12 ఏళ్ల తర్వాత!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement