హైదరాబాద్: ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేసినా అతను పోలీసులకు ఏమాత్రం సహకరించడం లేదు. ఈరోజు(శుక్రవారం, నవంబర్ 21 వ తేదీ) ఐ బొమ్మ రవిని పోలీసులు విచారించారు. రెండో రోజు విచారణలో భాగంగా ఐ బొమ్మ రవి నుంచి పోలీసులకు పూర్తి సహకారం లభించలేదు. అయితే డబ్బు కోసమే బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేశానని చెప్పిన రవి.. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు వివరాలు మాత్రం ఇవ్వలేదు.
ఇదిలా ఉంచితే, రవికి చెందిన ఆరేళ్ల బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలన బ్యాంకు అధికారులకు పోలీసులకు లేఖ రాశారు. ఆ వివరాలు ఆధారంగా ఐ బొమ్మ రవి జరిపిన బ్యాంకు లావాదేవీల గురించి దర్యాప్తు చేయనున్నారు పోలీసులు. రేపు)శనివారం, నవంబర్ 22వ తేదీ) ఐ బొమ్మ రవిని మరోసారి విచారిణ చేయనున్నారు.


