హైదరాబాద్: ఇండస్ట్రీయల్ పాలసీపై కాంగ్రెస్ ప్రభుత్వం గురించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు మంత్రి శ్రీధర్‌బాబు. ఈ పాలసీపై పనిగట్టుకుని కేటీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ ఆలోచనలో మార్పు రావడం లేదన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక అరాచకాలకు పాల్పడిందని శ్రీధర్‌బాబు దుయ‍్యబట్టారు.
సెక్రటరియేట్ నుంచి మీడియాతో మాట్లాడిన శ్రీధర్ బాబు..‘ లీజ్ భూములను ఫ్రీ హోల్డ్ చేయాలని గత ప్రభుత్వంలో జీవోలు తెచ్చారు. ఫ్రీ హోల్డ్ భూములకు ఇన్ఫాక్ట్ ఫీజు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చే ప్రయత్నం చేస్తోంది. కేటీఆర్ చెప్పే 30శాతం భూమి విలువ కాదు... కేవలం కన్వర్శన్ ఫీజు మాత్రమే. ఫ్రీ హోల్డ్‌కు లీజు భూములకు సంబంధం లేకుండా కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో తెచ్చిన జీవోలను ఇప్పుడు అమలు చేస్తున్నాము.
అడ్డగోలుగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయి... సత్యదూరమైన బీఆర్‌ఎస్‌కే సొంతం. కన్వర్షన్‌కు భూమికి లింక్ పెట్టి రాజకీయం చేస్తున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అనేక భూములు కన్వర్షన్ చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా బీఆర్‌ఎస్ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. పరిశ్రమలు కావాలి అనుకునే వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. కేటీఆర్ చెప్పిన పేర్ల కలిగిన వాళ్లు ప్రభుత్వంలో లేరు’ అని స్పష్టం చేశారు.


