చేవెళ్ల: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బీజాపూర్ హైవేపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఒకరు మృతి చెందగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం కనకమామిడి పరిధిలోని తాజ్ డ్రైవ్ ఇన్ సమీపంలో శుక్రవారం ఉదయం రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం కారణంగా రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే.. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.


