సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు.. నాలుగో రోజు కొనసాగుతున్నాయి. మరికాసేపట్లో.. తెలంగాణ యూనివర్సిటీల సవరణ బిల్లు–2026ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టనున్నారు. బిల్లుపై చర్చతో పాటు ఆమోదం తెలపనుంది సభ.
పాల్వాయి హరీష్, బీజేపీ ఎమ్మెల్యే కామెంట్స్..
డీఆర్‌డీఏ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు
అధికారుల అవినీతి పై నేను ఎక్కని గడుప లేదు
అన్ని స్థాయిల్లో అధికారులకు అవినీతి పై ఫిర్యాదు చేసాం
ప్రభుత్వం డీఆర్‌డీఏ అధికారుల పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా
తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు–2026ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అలాగే.. తెలంగాణ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ పెండింగ్ వార్షిక నివేదికలను రిలీజ్ చేయనుంది.
2015-16 నుంచి 2018-19 వరకు ఆడిట్ నివేదికలు టేబుల్ చేయనుంది ప్రభుత్వం. దీంతో పాటు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్(హిల్టన్) పాలసీపై షార్ట్ డిస్కషన్ జరిగే అవకాశం కనిపిస్తోంది.


