నిధుల కేటాయింపు
ఇటీవలి బడ్జెట్‌లోనే కేపీ లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్‌లో నిధుల కేటాయింపునకు ఉపముఖ్యమంత్రి నుంచి హామీ తీసుకున్నాం. గతంలో దివంగత సీఎం వైఎస్‌ఆర్ తన విజ్ఞప్తి మేరకే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పరిధిలో వికారాబాద్ జిల్లాను చేర్చారు. కానీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం దాన్ని అటకెక్కించింది. ఈ ప్రాజెక్టుల విషయంలో సీఎం, ప్రభుత్వ పెద్దలు, సంబంధిత మంత్రితో నిరంతర సంప్రదింపులు, చర్చలు జరుపుతున్నాం. పాలమూరు–ఎత్తిపోతల, ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులను నిర్మించి రైతులకు నీరందిస్తాం. – రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే, పరిగి
●


