గోడు పట్టదా..!
అవస్థలు పడుతున్నాం పరిష్కారం కావడం లేదు కలెక్టరేట్‌కు వచ్చినా ఫలితం లేదు అర్జీదారుల ఆవేదన
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణి కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోండి..అర్జీలు పెండింగ్‌లో లేకుండా ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించండి.. అని కలెక్టర్ ప్రతి సోమవారం నిర్వహించే కార్యక్రమంలో సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. జిల్లా నలుమూలల నుంచి వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల నుంచి మొదలు ఎంతోమంది బాధితులు తమ గోడు చెప్పుకోవడానికి కలెక్టరేట్‌కు వస్తున్నారు. కాగితాల మీద రాతలే తప్ప తమ పనులు పరిష్కారం కావడం లేదని బాధితులు పేర్కొంటున్నారు. అక్కడికి వెళ్తే ఇక్కడికి.. ఇక్కడికి వెళ్తే అక్కడికి తిప్పి పంపుతున్నారని.. ప్రజావాణికి పొద్దున వస్తే సాయంత్రం దాకా క్యూ లైన్‌లో నిలబడి కాళ్లు గుంజుతున్నాయని, అయినా ఓపిక పట్టి ఫిర్యాదు చేసినా ఫలితం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘అయ్యా మా గోడు పట్టించుకోండి’ అని వాపోతున్నారు.
దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించాలి
ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మరింత శ్రద్ధ కనబరచాలని అన్నారు. ప్రజావాణి కార్యక్రమం కేవలం సమస్యలు విని, దరఖాస్తులు స్వీకరించే విధంగా కాకుండా పరిష్కారాల వేదికగా నిలిచేలా ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించారు. ఈ వారం 45 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. కాగా, ప్రజావాణిని ప్రాజెక్ట్ రాష్ట్ర కోఆర్డినేటర్ రాకేష్ రెడ్డి పరిశీలించారు. దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టొద్దని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని పేర్కొన్నారు.
ఏళ్ల తరబడి తిరుగుతున్నాం
గోడు పట్టదా..!


