మట్టి తరలిస్తున్న టిప్పర్ సీజ్
కేశంపేట: అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్‌ను పోలీసులు సీజ్ చేశారు. సీఐ నరహరి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని పుట్టోనిగూడ శివారు నుంచి సోమవారం రాత్రి ఓ టిప్పర్‌లో మట్టి తరలిస్తున్నారు. పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు మట్టితరలింపునకు సంబంధించి అనుమతి పత్రాలు అడగ్గా ఎటువంటి పత్రాలు లేవని చెప్పాడు. దీంతో వాహనాన్ని పీఎస్‌కు తరలించారు. కొత్తూరు మండల పరిధిలోని సిద్దాపూర్ నుంచి మంగళిగూడ శివారులోకి అక్రమంగా మట్టిని తరలిస్తుండగా పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులు వాహణాన్ని ఠాణాకు తరలించారు. పెట్రోలింగ్ పోలీసుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ నరహరి తెలిపారు.


