ప్రతీ బోరు సర్వే చేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతీ బోరు సర్వే చేయాలి

Jan 8 2026 9:32 AM | Updated on Jan 8 2026 9:32 AM

ప్రతీ

ప్రతీ బోరు సర్వే చేయాలి

ప్రతీ బోరు సర్వే చేయాలి ‘108’ పరిశీలన ప్రపంచ శాంతికి పాటుపడుతాం పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వ చేయూత

ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ చీఫ్‌ ప్లానింగ్‌ అధికారి సౌమ్య

కొందుర్గు: మండల పరిధిలోని వ్యవసాయ బోర్లను సర్వేచేసి రిపోర్ట్‌ ఇవ్వాలని ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ చీఫ్‌ ప్లానింగ్‌ అధికారి సౌమ్య సూచించారు. బుధవారం కొందుర్గు తహసీల్దార్‌ కార్యాలయంలో జీపీఓల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అన్ని గ్రామాల్లో వ్యవసాయ బోర్ల వివరాలను తెలుసుకున్నారు. 2017 లెక్కల ప్రకారం 2,741 బోరుబావులున్నాయని.. ఇప్పటికి కేవలం 1,015 బోర్లు మాత్రమే సర్వే చేశారన్నారు. మిగిలిన బోర్లన్నీ వెంటనే సర్వేచేసి రిపోర్టు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ఆజంఅలీ, ఏపీఓ నర్సింగ్‌రావు పాల్గొన్నారు.

మొయినాబాద్‌రూరల్‌: మొయినాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని 108 అంబులెన్స్‌ వాహనాన్ని రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఈఎంఈ రాజాబాబు తనిఖీ చేశారు. బుధవారం మున్సిపల్‌ కేంద్రంలో ఉన్న వాహనం కండిషన్‌, ఎక్విప్‌మెంట్స్‌, మెడిసిన్స్‌ను తదితరాలను పరిశీలించారు.

హుడాకాంప్లెక్స్‌: ఇస్కఫ్‌ జిల్లా మొదటి మహాసభను సరూర్‌నగర్‌ మండలం శంకర్‌నగర్‌ కాలనీ కమిటీ హాల్‌లో బుధవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇస్కఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.గోపాల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ శాంతిని కోరుతూ సంఘం ముందుకెళ్తుందని, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ నిరంతరం శాంతి కోసం పనిచేస్తుందన్నారు. ఈ నెల 11న బేగంపేట టూరి జం ప్లాజాలో నిర్వహించనున్న రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చా రు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రంగారెడ్డి జిల్లా నూతన కమిటీ ఎన్నుకున్నా రు. గౌరవాధ్యక్షుడిగా జిల్లాల కృష్ణ, అధ్యక్షుడిగా మహబూబ్‌, ప్రధాన కార్యదర్శిగా సక్రు నాయక్‌, కోశాధికారిగా వెంకట్రాంరెడ్డి, ఉపాధ్యక్షులుగా కరీం, ఏఎల్‌.నరసింహ, సంపత్‌, అసిస్టెంట్‌ సెక్రెటరీగా కమలమ్మ, సీహెచ్‌ శంకర్‌ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

అనంతగిరి: సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ ఆఫీసర్‌ నవీన్‌కుమార్‌ బసురి అన్నారు. బుధవారం డీఆర్డీఏ కార్యాలయంలో పీఎంఎఫ్‌ఎంఈ పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ పథకంపై విస్తృతంగా ప్రచారం చేపట్టి లబ్ధిదారుల కు ప్రయోజనం చేకూరేలా చూడాలని ఆదేశించారు. అనంతరం డీఆర్డీఏ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి వివరించారు. వ్యక్తిగత యూనిట్లకు 35 శాతం రాయితీతో గరిష్టంగా రూ.10 లక్షల వరకు సబ్సి డీ అందుబాటులో ఉందన్నారు. ఎఫ్‌పీఓలు, స్వయం సహాయక సంఘాలు, ప్రొడ్యూసర్‌ గ్రూపు లు గరిష్టంగా రూ.3 కోట్ల వరకు రాయితీ పొందవచ్చని తెలిపారు. యంత్రాల కొనుగోలుతోపాటు బ్రాండింగ్‌, ప్యాకేజింగ్‌, లేబెలింగ్‌ మా ర్కెటింగ్‌ లింకేజీల కోసం ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు జిల్లా పరిశ్రమల కేంద్రం లేదా జిల్లా రిసోర్స్‌ పర్సన్‌ ఫణిభూషణ్‌ను లేదా సెల్‌ నంబర్‌ 7780119648లో సంప్రదించాలన్నారు.

ప్రతీ బోరు సర్వే చేయాలి 1
1/2

ప్రతీ బోరు సర్వే చేయాలి

ప్రతీ బోరు సర్వే చేయాలి 2
2/2

ప్రతీ బోరు సర్వే చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement