క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యం
శ్రీశైలం జాతీయ రహదారిపై..
తుక్కుగూడ: డివిజన్ కేంద్రంలో సీఎంకప్ టార్చి రిలేను గురువారం జిల్లా క్రీడాధికారి వెంకటేశ్వర్ రావు ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి శ్రీశైలం జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఈఓ కస్నా నాయక్, హెచ్‌ఎం భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టార్చ్ రిలేకు స్వాగతం
అబ్దుల్లాపూర్‌మెట్: సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైన చీఫ్ మినిస్టర్ కప్ టార్చ్ రిలే హయత్‌నగర్ మండలం మీదుగా పెద్దఅంబర్‌పేటలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్దకు రాగానే ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుదర్శన్ రెడ్డి, ఎంఈఓ జగదీశ్వర్ పాల్గొన్నారు.


