సహకార సంఘాలతో ఆర్థికాభివృద్ధి
షాద్‌నగర్‌రూరల్: సహకార సంఘాలతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యమని సహకార భారతి రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని శ్రీ రామలింగేశ్వర సహకార సమితి కార్యాలయంలో గురువారం నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లను సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. శ్రీరామలింగేశ్వర స్వామి సహకార సంఘాల ద్వారా గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గ్రామంలో యువతకు వృత్తి నైపుణ్యతపై శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. ఎవరిపై ఆధార పడకుండా స్వతహాగా వ్యాపారాలు నిర్వహించుకునేలా ప్రోత్సహించాలన్నారు. ముల్కనూరు గ్రామీణ సహకార బ్యాంకు అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ.. సహకార సమితి పరిధిలోని 42 సంఘాలకు గాను 18 సర్పంచ్‌లు, 16 ఉప సర్పంచ్‌లు, 110 వార్డు సభ్యులుగా ఎన్నిక కావడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామాల్లో 20 ఏళ్లుగా పొదుపు సహకార సంఘాలను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. సేవా భారతి క్షేత్ర సేవా ప్రముఖ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సహకార సంఘాల ద్వార నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జగన్‌మోహన్‌రెడ్డి, రమేష్‌గుప్తా శ్రీనివాస్, లక్ష్మయ్య, రాంరెడ్డి, శేఖర్ యాదవ్, శ్రీశైలం యాదవ్, తిరుపతయ్య, మధుసూదన్‌గౌడ్, సుమంత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సహకార భారతి రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్‌రెడ్డి


