వృద్ధుడు అదృశ్యం
మొయినాబాద్‌రూరల్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన వృద్ధుడు కనిపించకుండా పోయాడు. ఈ ఘటన మున్సిపల్ పరిధిలోని పెద్దమంగళారంలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన రాములు(75) ఈ నెల 7న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో ఆయన భార్య ఈశ్వరమ్మ చుట్టుపక్కల, బంధువుల వద్ద వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. దీంతో శుక్రవారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ లభిస్తే 72888 62866 నంబర్‌లో సమాచారం అందించాలని కోరారు.


