ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్‌గా సుజాత
ఇబ్రహీంపట్నం: స్థానిక ఆర్టీసీ డిపో మేనేజర్‌గా సుజాత శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆ స్థానంలో ఉన్న వెంకటనర్సప్ప ఉప్పల్ ఆర్టీసీ స్టోర్ ఆఫీసర్‌గా బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా డిపోలో కొత్తగా వచ్చిన సుజాతకు స్వాగతం పలుకుతూ, బదిలీపై వెళుతున్న వెంకటనర్సప్పకు వీడ్కోలు పలుకుతూ సన్మాన కార్యక్రమాన్ని సిబ్బంది నిర్వహించారు.
డివైడర్‌ను ఢీ కొట్టి..
షూటింగ్ బస్సు బోల్తా
హయత్‌నగర్: డివైడర్‌ను ఢీ కొట్టిన ఓ షూటింగ్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున హయత్‌నగర్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బిగ్ పిక్చర్స్‌కు చెందిన షూటింగ్ బస్ విశాఖపట్నం నుంచి మణికొండకు వెళ్తుంది. ఈ క్రమంలో పెద్దఅంబర్‌పేట్ వద్ద జాతీయ రహదారి ఫ్లైఓవర్ ఎక్కే క్రమంలో డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్ విజయ్‌భాస్కర్‌రెడ్డి, సహాయకుడు పుట్టా బీసన్న మాత్రమే ఉన్నారు. డ్రైవర్ చేతికి స్వల్ప గాయమైంది పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా బస్సును పక్కుకు తప్పించారు. కేసు దర్యాప్తులో ఉంది.
బకాయి చెల్లిస్తే ఏడాదిపాటు రెంట్ ఫ్రీ
కొందుర్గు: తనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అద్దె బకాయి రూ.6.20లక్షలు చెల్లిస్తే ఏడాది పాటు రెంటు తీసుకోనని భవన యజమాని కోనేరు శ్రీనివాస్ అన్నారు. జిల్లేడ్ చౌదరిగూడ ఎంపీడీఓ కార్యాలయం కొంతకాలంగా గ్రామానికి చెందిన కోనేరు శ్రీనివాస్‌కు చెందిన భవనంలో కొనసాగుతోంది. ఆయనకు ప్రభుత్వం నుంచి రూ.6.20లక్షలు అద్దె బకాయి రావాల్సి ఉంది. ఈ సందర్భంగా శుక్రవారం అఖిల పక్ష నాయకులు తీర్మానం చేసి ఆ ప్రతిని డిప్యూటీ సీఈఓకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్, కావలి రాజు, చంద్రబాబు గౌడ్, హఫీజ్, ఆంజనేయులు, నర్సింగ్‌రావు, వెంకటేశ్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్‌గా సుజాత
ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్‌గా సుజాత


