టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
నందిగామ: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి ఏఐజేఏసీటీఓ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం కొత్తూరు మండల కేంద్రంలో పలువురు ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు రఘుపాల్ మాట్లాడుతూ.. సర్వీస్‌లో ఉన్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, జాతీయ పెన్షన్ పథకం రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేసి, పాఠశాలల విలీనం, మూసివేతలకు వ్యతిరేకంగా ఆల్‌ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్స్ ఆర్గనైజేషన్స్(ఏఐజెఏసీటీఓ) ఇచ్చిన పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఏఐజేఏసీటీఓ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పొరాటాలకు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు రఘుపాల్


