సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా కృష్ణ
నందిగామ: సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా నందిగామ సర్పంచ్ కొమ్ము కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్తూరు మండల కేంద్రంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సర్పంచ్‌ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన్న యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా కల్వకుర్తికి చెందిన సంధ్యారాణి, కార్యనిర్వహక అధ్యక్షుడిగా రవీందర్ రెడ్డి, ఉపాధ్యాక్షులుగా ప్రవీణ్, పొగాకు రాంగోపాల్, కార్యదర్శిగా వెంకటేశ్ యాదవ్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా మాధవిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు భూమన్న యాదవ్ తెలిపారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు జగన్, శ్రీరాములు, రవీందర్, శ్రీశైలం యా దవ్, దయానంద్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఉపాధ్యక్షులుగా వెంకటయ్య, లక్ష్మణ్
కేశంపేట/శంకర్‌పల్లి: సర్పంచ్‌ల సంఘం జిల్లా ఉపాధ్యాక్షులుగా కేశంపేట మండలం లింగధన సర్పంచ్ నాగిళ్ల వెంకటయ్య, శంకర్‌పల్లి మండలం ఇరుకుంట తండా సర్పంచ్ పాత్లోత్ లక్ష్మణ్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చక్కటి వెంకటేశ్ హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో వారికి నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించిన కమిటీకి, సర్పంచ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోప్లారం, మొకిల సర్పంచ్‌లు నరేందర్‌రెడ్డి, శేఖర్ పాల్గొన్నారు.
సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా కృష్ణ
సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా కృష్ణ


