తుర్కయంజాల్‌ను సర్కిల్‌గా ప్రకటించాలి
తుర్కయంజాల్: ఎల్‌బీనగర్ సర్కిల్‌కు ఆనుకుని ఉన్న తుర్కయంజాల్‌ను సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న శంషాబాద్ జోన్‌లో చేర్చడం సరైన నిర్ణయం కాదని, ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ అన్నారు. ఆ పార్టీ తుర్కయంజాల్ అధ్యక్షుడు ఎలిమినేటి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో గురువారం సాగర్ రహదారిపై నిర్వహించిన ధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాను మూడు ముక్కలుగా చేసి, హైదరాబాద్‌లో కలపాలనే ఆలోచనను వెంటనే మానుకోవాలని హితవు పలికారు. అధికారుల అవగాహన లోపం, అధికార పార్టీ నాయకుల నిర్లక్ష్యం కారణంగా 20 వేల ఓట్లతో తుర్కయంజాల్, 60వేలకు పైగా ఓట్లున్న తొర్రూర్‌ను ఒక డివిజన్‌గా చేసి ఆదిబట్ల సర్కిల్‌లో కలపడంతో ప్రజలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తప్పును సరిదిద్దుకుని తుర్కయంజాల్‌ను సర్కిల్‌గా ప్రకటించడంతో పాటు, ఎల్‌బీనగర్ జోన్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ధర్నాతో ఉదయం వేళ రద్దీగా ఉండే సాగర్ రహదారిపై కిలోమీటరుకు పైగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారులకు సర్దిచెప్పి ట్రాఫిక్‌ను సరిచేశారు. కార్యక్రమంలో రైతు సహకార సంఘం మాజీ వైస్ చైర్మన్ కొత్త రాంరెడ్డి, మాజీ కౌన్సిలర్ కరాడి శ్రీలత అనిల్, నాయకులు తూళ్ల నర్సింహ గౌడ్, కొండ్రు పురుషోత్తం, నోముల కార్తీక్ గౌడ్, మల్లెల ప్రేమ్ సాయి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో సాగర్ రహదారిపై ధర్నా


