సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి
త్రిదండి చిన జీయర్ స్వామి
షాద్‌నగర్‌రూరల్: ప్రపంచ శాంతికి సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని త్రిదండి చిన జీయర్ స్వామి అన్నారు. బుధవారం ఆయన ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని దేవునిపల్లిలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుర్వ లలితమల్లేశ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. పత్య్రేక పూజల అనంతరం చిన జీయర్ స్వామి మాట్లాడుతూ.. ప్రపంచంలో భారతదేశం ఏకై క హిందూ దేశమని.. మనదేశంలో సనాతన ధర్మానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. భగవంతుడి సేవ లో తరించిన వారికి ముక్తి లభిస్తుందన్నారు. ఏజన్మలో చేసుకున్న పుణ్యఫలమో మీ గ్రామం దేవుని (దేవునిపల్లి) పేరుతో ఉందన్నారు. అనంతరం ఆయన గ్రామస్తులకు ఆశీర్వచనాలు అందజేశారు.
అన్నింటికి వేదమే మూలం
కొందుర్గు: సృష్టిలో ప్రక్రియలన్నింటికీ మూలం వేదాలేనని త్రిదండి చిన జీయర్ స్వామి అన్నారు. జిల్లేడ్ చౌదరిగూడ మండలం తూంపల్లి వేదగిరిగుట్ట రజతోత్సవాల కార్యక్రమంలో భాగంగా సనాతన వేదయజ్ఞ మహారథయాత్ర ప్రారంబోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతిలో ప్రతీ చర్య ఒక యజ్ఞం అన్నారు. అన్నింటికి మూలం ఓంకారం అన్నారు.
మహిళలకు అగ్రస్థానం
వైదిక ధర్మం సమాజంలో మహిళలకు అగ్రస్థానం ఇచ్చిందన్నారు. పూర్వం మహిళలకు ఆలయ ప్రవే శం ఉండేదికాదని.. స్వామి రామానుజులు మహిళలకు ఆలయ ప్రవేశం కల్పించారన్నారు. ఈ కార్యక్రమానికి షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి హాజరై మాట్లాడా రు.ఈ కార్యక్రమంలో వేదగిరి వ్యవస్థాపకుడు మర్రి కృష్ణారెడ్డి, సర్పంచ్ రామచంద్రయ్య పాల్గొన్నారు.


