రెండు గడ్డివాములు దగ్ధం
ఆమనగల్లు: మేడిగడ్డతండాకు చెందిన నేనావత్ సోమ్ల, నేనావత్ మల్లయ్య నాయక్‌కు చెందిన రెండు గడ్డివాములు మంగళవారం ప్రమాదవశాత్తు దగ్ధమయ్యాయి. ఈ సంఘటనను గుర్తించిన గ్రామస్తులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పారు. ఈ సంఘటనలో దాదాపు రూ.60వేలు విలువైన పశుగ్రాసం దగ్ధమైందని రైతులు వాపోయారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కండె హరిప్రసాద్, బీజేపీ నాయకులు కర్నాటి విక్రంరెడ్డి, నర్సింహ, చెన్నకేశవులు, రవిరాథోడ్, నందు తదితరులు బాధితులను పరామర్శించారు.
యువకుడు అదృశ్యం
పహాడీషరీఫ్: యువకుడు అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. జల్‌పల్లి వాదే ముస్తఫా బస్తీకి చెందిన మహ్మద్ గౌస్ కుమారుడు మహ్మద్ సల్మాన్(24) తుక్కుగూడలోని పాన్‌షాప్‌లో పని చేస్తుంటాడు. రోజు మాదిరిగానే ఈ నెల 5వ తేదీన ఉదయం షాప్‌నకు వెళుతున్నానని చెప్పి వెళ్లిన సల్మాన్ రాత్రయి నా ఇంటికి రాలేదు. ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళనకు గురైన కు టుంబ సభ్యులు సాధ్యమైన అన్నిప్రాంతాల్లో వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో సోమవారం రాత్రి తల్లి సాజెదా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో గాని 87126 62367 నంబర్‌లో గాని సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.
అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ లభ్యం
కేశంపేట: అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ మంగళవారం లభ్యమైంది. సీఐ నరహరి తెలిపిన ప్రకారం.. సోమవారం నిర్ధవెళ్లికి చెందిన కావలి మహేశ్ ఇంట్లో తల్లి, భార్యతో గొడవపడి మనస్తాపంతో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికినా ఆచూకీ లభ్యంకాకపోవడంతో భార్య మహేశ్వరి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదృశ్యమైన మహేశ్ శ్రీశైలం ఆలయానికి వెళ్లినట్టు అక్కడి నుంచి కుటుంబ సభ్యులకు మంగళవారం సమాచారం ఇచ్చాడు.
10న సర్పంచ్‌ల సంఘం చైతన్య సదస్సు
పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి
చేవెళ్ల: సర్పంచ్‌ల సంఘం చైతన్య సదస్సును విజయవంతం చేయాలని పంచాయతీ రాజ్ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మధుసూదన్‌గుప్తా ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్‌లతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 10న జెడ్పీ కార్యాలయం వద్ద పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాల సర్పంచ్‌లతో సర్పంచ్‌ల సంఘం జిల్లా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నా, గ్రామాలు అభివృద్ధి సాధించాలన్నా ప్రభుత్వం నుంచి నిధుల విడుదల ప్రధానమన్నారు. జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధిక మొత్తంలో నిధులు వెళ్తుంటాయని అ నిధుల్లో మన జిల్లా అభివృద్ధికి సర్పంచ్‌లకు ప్రత్యేక నిధి కేటాయించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సంఘంలోకి సర్పంచులు అందరూ ఆహ్వానితులేనని చెప్పారు. ఈ చైతన్య సదస్సులో సర్పంచ్‌లకు అవగాహన కల్పించి జిల్లా కమిటీని ఎన్నుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు బండారు ఆగిరెడ్డి, సర్పంచ్‌లు జి.ప్రభాకర్‌రెడ్డి, రాంచంద్రయ్యగౌడ్, రామస్వామి, నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రెండు గడ్డివాములు దగ్ధం
రెండు గడ్డివాములు దగ్ధం
రెండు గడ్డివాములు దగ్ధం


