సమస్యలు తీరవే! | - | Sakshi
Sakshi News home page

సమస్యలు తీరవే!

Jan 7 2026 10:00 AM | Updated on Jan 7 2026 10:00 AM

సమస్యలు తీరవే!

సమస్యలు తీరవే!

వనరులున్నా..

తాండూరు మున్సిపాలిటీలో పాలకులు మారుతున్నా సమస్యలు మాత్రం తొలగడం లేదు. వాణిజ్య పరంగా పరిణితి సాధించిన ప్రాంతంలో మౌలిక సదుపాయాలు సైతం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

తాండూరు: వ్యవసాయం.. సిమెంట్‌ పరిశ్రమలు.. నాపరాతి వ్యాపారంలో అంతర్జాతీయ స్థాయిలో తాండూరు ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ పండే కంది పప్పునకు భౌగోళిక గుర్తింపు(జీఐ) సైతం లభించింది. వ్యాపార, వాణిజ్య కేంద్రంగా తాండూరు పట్టణం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోంది. 16 శతాబ్దంలో కాగ్నానది తీరం వద్ద వెలసిందని చరిత్రకారులు అంటున్నారు. తాండూరు నిజాం పాలన ముగిసిన తొలి నాళ్లలోనే మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. నాటి నుంచి మున్సిపాలిటీ విస్తరిస్తూ వస్తోంది. తాండూరు మున్సిపల్‌ కేంద్రంగా నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వ్యాపారాలు కొనసాగుతున్నాయి. తాండూరు, బషీరాబాద్‌ మండలాల్లో నాపరాతి నిక్షేపాలు, పెద్దేముల్‌లో సుద్ద(తెల్ల మట్టి,) ఎర్రమట్టి నిక్షేపాలు ఉన్నాయి. సరిహద్దులో ఐదు సిమెంట్‌ కర్మాగారాలు ఉన్నాయి. 17 శతాబ్దంలో అక్కన్న మాదన్నలు కాగ్నానది తీరంలో చిన్న కోటను ఏర్పాటు చేసుకున్నట్లు ఆనవాళ్లున్నాయి.

1953లో తొలి మున్సిపాలిటీ

తాండూరు మున్సిపాలిటీగా 1953లో ఆవిర్భవించింది. తొలి మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముదెళ్లి నారాయణరావు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. గుల్బర్గా జిల్లా నుంచి తాండూరు విడిపోయి ఆంధ్రప్రదేశ్‌లో కలిసింది. అప్పుడు హైదరాబాద్‌ జిల్లాలో ఉన్న ఏకై క పురపాలక సంఘం తాండూరు ఒక్కటే. తరువాత 1978లో హైదరాబాద్‌ జిల్లాను రెండుగా విభజించారు. 1978లో ఏర్పాటు చేసిన రంగారెడ్డి జిల్లాలో కూడా ఏకై క మున్సిపాలిటీ తాండూరు మాత్రమే. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రంగారెడ్డి జిల్లా విభజనతో వికారాబాద్‌ జిల్లాలోకి తాండూరు చేరింది. మున్సిపల్‌లో 36 వార్డులు ఉన్నాయి. మున్సిపల్‌ విస్తరణలో భాగంగా పట్టణ శివారులోని ఎన్‌టీఆర్‌ కాలనీ, రాజీవ్‌ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, కాగ్నానది తీరం వద్ద ఉన్న రెడ్డి కాలనీలు 2019లో విలీనం అయ్యాయి. ప్రస్తుతం తాండూరు మున్సిపాలిటీలో ప్రజలకు కనీస సౌకర్యాలను అందడం లేదనే విమర్శలు వినిపిస్తోన్నాయి. ప్రస్తుతం మున్సిపాలిటీలో 77,110 ఓటర్లు ఉండగా అందులో పురుషులు 37,547 మంది, మహిళలు 39,558 మంది, ఇతరులు ఐదుగురు ఉన్నారు.

పట్టణంలో ప్రధాన సమస్యలు

● తాండూరు పట్టణంలో ఉన్న నాపరాతి పరిశ్రమలను పారిశ్రామిక వాడకు తరలించకపోవడంతో వాతావరణ కాలుష్యం అధికంగా ఉంది.

● పట్టణంలో ఉన్న లారీ పార్కింగ్‌ లేకపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది. భారీ వాహనాల కారణంగా ప్రజలకు ఇబ్బంది. పార్కింగ్‌ కోసం కేటాయించిన స్థలంలో అభివృద్ధి నిలిచిపోయింది.

● పట్టణంలోకి వాహనాలు రాకుండా దారి మళ్లించేందుకు బైపాస్‌ రోడ్డుకు నిధులు మంజూరు అయినా ఇప్పటివరకు పూర్తి చేయలేదు.

● మున్సిపల్‌లో అండన్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ లేక పోవడంతో పారిశుద్ధ్య వ్యవస్థ అధ్వానంగా మారింది.

● కూరగాయల మార్కెట్‌ లేకపోవడంతో రోడ్లపైనే విక్రయాలు సాగుతున్నాయి.

● జనాభా సాంద్రతను బట్టి పట్టణంలో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు లేక పోవడం.

● మున్సిపల్‌ పరిధిలో ఉన్న పార్కుల నిర్వహణ సరిగా లేక పోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి.

● పట్టణంలో ఉన్న మినీ స్టేడియం గతంలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి కేటాయించారు. దీంతో క్రీడా ప్రాంగణం లేక యువత ఆటలకు దూరమవుతున్నారు.

● చిలుకవాగు ప్రక్షాళన పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.

● మున్సిపల్‌ పరిధిలోని వార్డుల్లో అంతర్గత రోడ్లు, మురుగు కాల్వలు లేక ప్రజల ఇబ్బందులు పడుతున్నారు.

● శివారు ప్రాంతాలలోని కాలనీలలో పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్లు వ్యవస్థ లేదు.

● తాండూరు–పాత తాండూరు మార్గంలోని రైల్వే బ్రిడ్జి నిర్మాణం నత్తనడకన సాగుతున్నాయి.

ఖనిజ సంపదతో తాండూరులో

వాణిజ్యం జోరు

మౌలిక సదుపాయాలు లేక

ప్రజల అవస్థలు

పప్పు ధాన్యసిరి కేంద్రంగా ఖ్యాతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement