యంగ్ ఇండియా పాఠశాలలు దేశానికే ఆదర్శం
షాద్‌నగర్: రాష్ట్రంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా పాఠశాలలు దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సోమ వారం ఆయన మాట్లాడుతూ..పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలను ప్రతి నియోజకవర్గంలో నిర్మిస్తోందని తెలిపారు. షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గులో సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. రూ.150 కోట్ల తో అత్యాధు నిక హంగులతో ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు.
లూయిస్ బ్రెయిలీకి
ఘన నివాళి
షాద్‌నగర్: అంధుల జీవితాల్లో లూయిస్ బ్రెయిలీ వెలుగులు నింపారని ఎన్పీఆర్డీ సంఘం జిల్లా అద్యక్షుడు ఆశన్నగారి భుజంగరెడ్డి అన్నారు. లూయిస్ బ్రెయిలీ జయంతిని సోమవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బ్రెయి లీ లిపి ద్వారా దృష్టి లోపం ఉన్న వారికి విద్య లో, ఉద్యోగాల్లో సమాజంలో స్వతంత్రంగా ఎదగడానికి మార్గం ఏర్పడిందని అన్నారు. ప్రతి పాఠశాల, ప్రతి గ్రంథాలయంలో బ్రెయి లీ పుస్తకాలు అందుబాటులో ఉంచాలని కోరా రు. వికలాంగులు దయతో కాదు హక్కులతో జీవించాలని, సమాజంలో అన్ని వర్గాలకు కల్పించే విధంగా సమాన అవకాశాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మయ్య, యాదయ్య, చెన్నయ్య, శ్రీకాంత్, శంకర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
డివిజన్ కార్యాలయాలు ఒకేచోట ఏర్పాటు చేయాలి
ఆమనగల్లు: మండల కేంద్రంలో అన్ని డివి జన్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కల్వకుర్తి ఎ మ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. అసెంబ్లీలో సోమవారం ఆయన మాట్లాడుతూ..జిల్లాల పునర్వి భజనలో భాగంగా కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని మూడు మండలాలను నాగర్‌కర్నూల్ జి ల్లాలో, నాలుగు మండలాలను రంగారెడ్డి జిల్లాలో చేర్చారని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో చేర్చిన వాటి లో మూడు మండలాలు ఒకవైపు ఒక మండలం మరోవైపు ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి మండలాలకు ఆర్డీఓ కార్యాలయం కందుకూరులో, ఆర్టీఓ కార్యాలయం షాద్‌నగర్‌లో, ఎస్‌టీఓ, ఎస్‌ఆర్‌ఓ కార్యాలయాలు మహేశ్వరంలో ఉన్నాయని వివరించారు. మాడ్గుల మండలాన్ని ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలో ఉంచారన్నారు. ప్రజల సౌలభ్యం కోసం అన్ని డివిజన్ కార్యాలయాలను ఆమనగల్లు మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలని కోరారు.
మహిళా యోజన పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
తుక్కుగూడ: ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా మైనార్టీ, సంక్షేమ అధికారి కె.నవీన్ కుమార్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ముస్లిం, సిక్కు, బౌద్ధ, జైన్‌లకు చెందిన మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక పురోగతి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఈ పథకం కింద బైకులు, ఈ–బైకు లు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల వారు రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారు రూ.2 లక్షల ఆదాయం కలిగి ఉండాలన్నారు. 21 నుంచి 55 సంవత్సరాలు కలిగి ఉన్న వారు అర్హులని చెప్పారు. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఓబీఎంఎంఎస్ సైట్‌లో ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు ఫారం ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని హార్డ్ కాపీలను ఎంపీడీఓ లేదా మున్సిపల్, జోనల్ కమిషనర్ కార్యాలయాల్లో అందజేయాలని ఆయన సూచించారు.
యంగ్ ఇండియా పాఠశాలలు దేశానికే ఆదర్శం
యంగ్ ఇండియా పాఠశాలలు దేశానికే ఆదర్శం


