సాక్షి హైదరాబాద్,ఈ నెల 25న రాష్ట్ర మంత్రివర్గం కీలక సమావేశం నిర్వహించబోతుంది. వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్న నేపథ్యంలో ఈ భేటీలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వాటితో పాటు ఇతర విషయాలు మంత్రి వర్గ భేటీలో చర్చకు రానున్నాయి.
రాష్ట్ర క్యాబినెట్ ఈ నెల 25 ప్రత్యేక సమావేశం నిర్వహించబోతుంది. ఈ మంత్రి వర్గ భేటీలో చర్చకు రానున్న అంశాలు
1. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
2. విద్యుత్ సంస్థలు
3. గ్రామపంచాయతీ ఎన్నికలు, పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు
4. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటులతో పాటు ఇతర అంశాలపై నిర్ణయం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ భేటీ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.


