మా జోలికొస్తే పోలీసులకు ఐ‘బొమ్మ’ చూపిస్తాం! | iBomma Piracy Case: Hyderabad Police Get Direct Challenge from Website Operators | Sakshi
Sakshi News home page

మా జోలికొస్తే పోలీసులకు ఐ‘బొమ్మ’ చూపిస్తాం!

Oct 1 2025 12:47 PM | Updated on Oct 1 2025 1:00 PM

ibomma Warn Note Viral Fact Check Police Reaction

పైరేటెడ్‌ వెబ్‌సైట్‌ ఐ బొమ్మ వ్యవహారం(iBomma) ఇప్పుడు తీవ్రతరం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు సినీ నిర్మాతలను, హీరోలను బెదిరిస్తూ వచ్చిన ఈ సైట్ నిర్వాహకులు.. ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ పోలీసులకే(Hyderabad Police) సవాల్ విసిరారు. తమపై దృష్టి సారిస్తే ప్రతిచర్య తప్పదంటూ ఓ నోట్‌ విడుదల చేసి మరీ హెచ్చరించడం సంచలనం సృష్టిస్తోంది.

ఇటీవల ఐబొమ్మ సహా 65 పైరసీ వెబ్‌సైట్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన పోలీసులు, దర్యాప్తు చేపట్టి ఒక పైరసీ ముఠాను ఛేదించి ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ైరసీ కారణంగా కేవలం 2024లోనే తెలుగు చిత్ర పరిశ్రమకు సుమారు ₹3,700 కోట్ల భారీ నష్టం వాటిల్లిందన్నారు.  ఐబొమ్మ వంటి సైట్లను ఎంతటి సాంకేతికత వాడినా వదిలిపెట్టేది లేదని, అంతర్జాతీయ సంస్థల సహకారంతో వారిని పట్టుకుంటామని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో..

ఐబొమ్మ పేరిట విడుదలై వైరల్‌ అవుతున్న నోట్‌ యధాతథంగా ఇలా ఉంది..  ‘‘ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్స్ అమ్మిన తరువాత మీరు ఎం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ OTT రెవిన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు.
1) హీరో లకు అంత రెమ్యూనిరేషన్ అవసరమా? అది మీ కొడుకు అయినా ఎవరు అయినా...
2) సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది వున్నారు. వాళ్ళు ఎం అయిపోతారు అని కబుర్లు చెప్పకండి.. వాళ్ళకి మీరు ఇచ్చేఅమౌంట్ ఏ కూలి పని చేసిన వస్తాయి కానీ మీ హీరోకి హీరోయిన్ కి వస్తాయా.
3) సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం రెమ్యూరురేషన్స్ మరియు విదేశాలలో షూటింగ్ లకు మరియు ట్రిప్స్ కి ఖర్చుపెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చుపెడుతున్నారు ? ఇండియా లో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది. కదా ? అక్కడ వాళ్ళకి ఉపాధి కలుగుతుంది కదా.
4) అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికావెర్టీ కి దానిని మా మీద రుద్ది ఎక్కువకి అమ్ముతున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ ని కలెక్ట్ చేసుకోవటానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు. చివరికి మధ్యతరగతివాడే బాధపడుతున్నాడు.
మా వెబ్సైటు మీద ఫోకస్ చేయటం ఆపండి లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది.
ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్లు మీద మీ ద్రుష్టి పెట్టండి. ఇబొమ్మ అన్నది సిగేరేట్ నుంచి e -సిగిరెట్ కు యూజర్స్ ని మళ్లించే ప్రక్రియ. మీ యాక్షన్ కి నా రియాక్షన్ ఉంటుంది.

ఈ మిడిల్ లో - వేరే ఏ హీరో కూడా (example: Vijay) టార్గెట్ అవ్వటం ఇష్టం లేదు, మేము స్వతహాగా వెబ్సైటు నుంచి తొలిగిస్తున్నాం, ఇప్పుడు ఇమ్మీడియేట్ డిలీట్ చేస్తే మీకు బయపడి లేదా మీరు తీయించినట్టు వుంటది అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తరువాత తీసివేయాలని అనుకుంటున్నాం..

ఇబొమ్మ వాళ్ళు ఇండియా లో తీసివేసిన తరువాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కోరము, దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా షేర్ చేయటం లేదు. మేము ibomma.net వళ్ళంత అంత మంచివాళ్లం కాదు. బురదలో రాయి వేయకండి... అది కూడా పెంట మీద అసలు చేయకండి.
మేము ఏ దేశం లో వున్నా భారత దేశం, అందులో తెలుగు వానికోసం ఆలోచిస్తాము.
(చావుకు భయపడని వాడు దేనికి భయపడడు - There's nothing more dangerous than a man who has nothing to loose.).

సీవీ ఆనంద్‌ స్థానంలో ఇప్పుడు వీసీ సజ్జనార్‌(VC Sajjnar) హైదరాబాద్‌ సీపీగా బాధ్యతలు స్వీకరించారు. వచ్చి రాగానే.. పైరసీ, సైబర్ నేరాలను ఉపేక్షించేంది లేదని హెచ్చరించారు.  ఈ తరుణంలో ఏకంగా పోలీసులకే సవాల్ విసురుతున్న నేపథ్యంలో, ఈ వ్యవహారాన్ని ఆయన ఎంత సీరియస్‌గా తీసుకుని ముందుకు వెళ్తారో వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement