 
													సాక్షి, హైదరాబాద్: రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో సిటీ పోలీసులు ఏక్తారన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సినీ నటుడు చిరంజీవి.. జెండా ఊపి ప్రారంభించారు. 2k రన్‌లో డీజీపీ శివధర్‌రెడ్డి సీపీ సజ్జనార్ పాల్గొన్నారు.
సర్ధార్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఎల్‌బీ స్టేడియం బాబు జగ్జీవన్ రాం విగ్రహం నుంచి అసెంబ్లీ ముందున్న సర్ధార్ పటేల్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
