ఆసిఫాబాద్: మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత బడే చొక్కారావు ఆసిఫాబాద్‌లో పోలీసులకు పట్టుబడ్డారు. ఆయనతో పాటు సిర్పూర్‌లో మరో 15మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడ్డవారిలో 9మంది మహిళలు కాగా ఆరుగురు పురుషులు ఉన్నారు. అదుపులోకి తీసుకున్న మావోయిస్టులను పోలీసులు హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. మావోయుస్టులపై కేంద్రం కన్నెర్రజేసింది. 2026 మార్చి 31లోపు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తానని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించడంతో సాయుదబలగాలు వారిపై విరుచుకపడుతున్నాయి.
అయితే ఇప్పటికే పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు వదిలారు. అంతేకాకుండా ఆపార్టీ కీలక నేతలు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ పార్టీకి చెందిన కీలక నేత బడే చొక్కారావు పోలీసులకు చిక్కడంతో ఆపార్టీకి దెబ్బమీద దెబ్బ తాకినట్లయింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


