సాక్షి, హైదరాబాద్: చంచల్‌గూడ జైల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఖైదీలుగా ఉన్న ఇద్దరు రౌడీషీటర్ల మధ్య ఘర్షణ జరిగింది. రౌడీషీటర్ జాబ్రిపై మరో రౌడీషీటర్ దస్తగిరి దాడి చేశాడు. ఖైదీల ఘర్షణలో ములాఖాత్ రూమ్‌లోని అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘర్షణలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
వారిని జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. జాబ్రి, దస్తగిరిల మధ్య ఉన్న పాత కక్షల నేపథ్యంలో జైల్లో దాడి చేసుకున్నట్లు సమాచారం. రౌడీ షీటర్ జాబ్రి ఓ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే, ఈ ఘటనను జైలు అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.


