సజ్జనార్‌ ఫైరింగ్ ప్రాక్టీస్.. థ్రిల్లింగ్‌ అంటూ ట్వీట్ | Cp Sajjanar Attends Firing Practice Session In Telangana Police Academy | Sakshi
Sakshi News home page

సజ్జనార్‌ ఫైరింగ్ ప్రాక్టీస్.. థ్రిల్లింగ్‌ అంటూ ట్వీట్

Nov 6 2025 6:20 PM | Updated on Nov 6 2025 8:08 PM

Cp Sajjanar Attends Firing Practice Session In Telangana Police Academy

సాక్షి, హైదరాబాద్‌: సీపీ వీసీ సజ్జనార్‌ ఆసక్తికర విషయాలు తన సోషల్‌ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఇవాళ(నవంబర్‌ 6, గురువారం) తెలంగాణ పోలీస్‌ అకాడ‌మీకి వెళ్లిన స‌జ్జ‌నార్.. సిటీ పోలీసు బృందంతో క‌లిసి ఆయ‌న పిస్ట‌ల్‌తో పైరింగ్‌ ప్రాక్టీస్ చేశారు. ఫైరింగ్ ప్రాక్టీస్ సెషన్‌లో హైదరాబాద్ సిటీ పోలీస్ బృందంతో చేరానంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

షూటింగ్ రేంజ్‌లోకి తిరిగి రావడం.. ల‌క్ష్యం గురి త‌ప్ప‌కుండా ఛేదించడం ఎప్పుడూ గొప్ప అనుభూతిని ఇస్తుందన్నారు. బుల్‌సీకి గురిపెట్టి కొట్ట‌డం థ్రిల్లింగ్‌గా కూడా ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ను ఆయన త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement