– ఐదుగురు విదేశీయుల అరెస్ట్
హైదరాబాద్ : గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురు విదేశీయులను అరెస్ట్ చేసిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శివ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం..న్యూ హాఫీజ్‌పేట సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఎస్‌ఓటీ, మియాపూర్ పోలీసులు సంయుక్తంగా సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు. అక్కడ తనిఖీ చేయగా విదేశీ మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
లైబేరియా దేశంలోని మొన్రోవియా సిటీకి చెందిన డేరియస్ (28) అనే యువకుడు విద్యాభ్యాసం నిమిత్తం నగరానికి వచ్చి సుభాష్ చంద్రబోస్‌నగర్‌లో ఉంటూ ఓ కళాశాలలో చదువుకుంటున్నాడు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో విద్యనభ్యసిస్తున్నాడు. ఇతను కెన్యా, ఉగాండా దేశాలకు చెందిన నలుగురు మహిళలతో వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. డేరియస్‌తో పాటు నలుగురు విదేశీ మహిళలను అరెస్ట్ చేసి మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారి వద్ద రూ.4 వేల నగదు, సెల్‌ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. నలుగురు మహిళలను రెస్క్యూ హోంకు తరలించగా డేరియస్‌ను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.


