breaking news
high tech
-
హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు
వరంగల్ క్రైం: సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయ్యింది. పోస్టల్ కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం టాస్క్‌ఫోర్స్, సుబేదారి పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించి∙వ్యభిచారం గృహం నిర్వహిస్తున్న ఓ మహిళ, నలుగురు విటులను అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. ఏసీపీ కథనం ప్రకారం..హనుమకొండ జిల్లా వేలేరు మండలం శోడషపల్లి గ్రామానికి చెందిన తిమ్మాపురం లలిత సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పోస్టల్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను తీసుకొచ్చి రహస్యంగా సంవత్సర కాలంగా వ్యభిచారం నిర్వహిస్తోంది. దీనిపై విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి నిర్వాహకురాలు లలితతోపాటు విటులు జనగామకు చెందిన బంతిని అశోక్, బుక్క కరుణాకర్, ఘన్పూర్ మండలం మీదికొండకు చెందిన వడ్లకొండ రమేశ్, కాజీపేట విష్ణుపురికి చెందిన బొల్లి శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి బాధిత మహిళలను కాపాడినట్లు తెలిపా రు. వీరి నుంచి ఐదు సెల్ఫోన్లు, రూ.2,450 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి విచారణ కోసం నిందితులను సుబేదారి పోలీసులకు అప్పగించినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ తెలిపారు. -
లాడ్జీలో హైటెక్ వ్యభిచారం.. 12 మంది మహిళల అరెస్టు
కొరుక్కుపేట: మంబాయి తరహాలో తిరుపూర్‌లో హైటెక్ వ్యభిచారం సాగుతోంది. దీంతో ముందస్తు సమాచారం మేరకు పోలీసులు ప్రక్కా ప్రణాళికతో లాడ్జీలల్లో ఉన్న 12 మందిమహిళలను రక్షించి, ఇద్దరి వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘనట తిరుపూర్‌లో కలకలం రేపింది. వివరాలు.. తమిళనాడులోని తిరుపూర్ సెంట్రల్ బస్ స్టేషన్ వెనుక ఉన్న లాడ్జీలో ఉత్తరాది రాష్ట్రానికి చెందిన మహిళలను వేధింపులకు గురిచేస్తున్నట్లు సౌత్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో సంబంధిత లాడ్జిలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో లాడ్జీల్లోని గదుల్లో 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను చూసి పోలీసులు అవాక్కయ్యారు . ఇందులో 12 మంది మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది. ఆ తర్వాత పోలీసులు మొత్తం 12 మందిని రక్షించి షెల్టర్‌కు అప్పగించారు. ఇక లాడ్జీ యజమాని సంపత్ కుమార్ వ్యభిచారానికి అనుమతి ఇచ్చినట్లు తేలడంతో అతడితో పాటు మేనేజర్ నీలా కందన్ (44)పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా వ్యభిచారం నిర్వహిస్తున్న 12 మంది మహిళలు ఉత్తరాది రాష్ట్రానికి చెందిన వారే కావడం గమనార్హం. -
బాబు గారి సింగ్‌పూర్
హైటెక్ పేరు తో హైదరాబాద్ గుల్ల చేసిన చంద్రబాబు హైదరాబాద్... ఈ పేరెత్తితే చాలు.. చంద్రబాబు పూనకంతో ఊగిపోతారు. టక్కున హైటెక్ మంత్రం అందుకుంటారు. అభివృద్ధికి చిరునామా, అంతర్జాతీయ ఖ్యాతికి కేరాఫ్ తానేనంటూ ఊదర గొడతారు. మాట్లాడితే మారిషస్... లేదంటే సింగ్‌పూర్, ఈ రెంటి మీది నుంచి ఏమాత్రం దిగరు. ఐటీకి ఆద్యుడినని.. అలియాస్నూ తానేనని అంటారు... అస్తమానం హైటెక్ సిటీ భవనం వైపు వేలు చూపించి... అదే హైదరాబాద్ అభివృద్ధి అంటారు. ‘ఫ్లై ఓవర్’లు ఎక్కేస్తారు.. గాల్లోనే తిరిగేస్తారు. మరి తూట్లు పడ్డ ఫై ఓవర్ల సంగతేమిటంటే... అది మాత్రం నన్నడగొద్దు... అంతా ‘తమ్ముళ్ల’ మాయాజాలం అంటూ తప్పించుకుంటారు. సెల్ ఫోన్ కనిపిస్తే చాలు... ‘తమ్ముళ్లూ! అది నేనే తెచ్చా’నంటూ తెగ బిల్డప్ ఇస్తారు. హైదరాబాద్‌ను నిర్మించిన కులీ కుతుబ్‌షా కూడా అన్నింటా తనకన్నా తక్కువేనంటారు.తొమ్మిదేళ్ల పాలనలో షాయర్ లాంటి షహర్‌ను కుదేలు చేశారు బాబు. ఆల్విన్‌కు అల్విదా చెప్పించారు. ప్రపంచ బ్యాంకు ఏజెంటుగా దాని ప్రణాళికలను పక్కాగా అమలు చేశారు. నష్టాల సాకుతో ప్రభుత్వ పరిశ్రమలను అయినవారికి అప్పగింత పెట్టారు. అత్తరు పరిమళాలతో గుబాళించే నగరాన్ని ‘మూసీ’ కంపుతో మురికిమయం చేశారు. ఇరానీ చాయ్ కమ్మదనంతో తెల్లారే బతుకుల్లో కన్నీళ్లు మిగిల్చారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లను చూపించి అదే అభివృద్ధి అంటూ ఊదరగొట్టారు. గరీబ్ గల్లీలు, బస్తీల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. నందనవనాల నిర్మాణం పేరుతో బస్తీలను ఖాళీ చేయించి పేదలను అనాథల్ని చేశారు. క్లింటన్‌కు ఎర్రతివాచీ పరిచి, రాత్రికి రాత్రే బిచ్చ గాళ్లను తరిమించి ఆకలితో చంపేశారు. హైదరాబాద్‌ను పేద, మధ్య తరగతి ప్రజలు లేని మార్కెట్‌గా మార్చేందుకు శతవిధాలా ప్రయత్నించారు. చార్ సౌ సాల్ షహర్ చరిత్రకు చరమగీతం పాడారు... ఇవన్నీ వదిలేసి... నవ్విపోదురుగాక నాకేటి సిగ్గంటూ మళ్లీ అధికారమిస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానంటున్నారు. సీమాంధ్రను సింగపూర్‌లా మార్చేస్తానంటున్నారు. హైటెక్ పేరుతో హైదరాబాద్‌ను గుల్ల చేసిన చంద్రబాబు 1. అభివృద్ధి పేర అడుగడుగునా విధ్వంసం 2. మొదట బాబు లీకులు.. ఆపై బినామీ ‘జయభేరి’ కారుచౌక కొనుగోళ్లు 3. ‘సెలెక్టెడ్ ఏరియా డెవలప్మెంట్’తో సొమ్ము చేసుకున్న బాబు బినామీలు 4. ఫ్లై ఓవర్ల పేరుతో అనుయాయులకు నిర్మాణ కాంట్రాక్టులు 5. భూ సేకరణ పేరుతో భారీ దందా.. బావమరిది బాలకృష్ణ, ఆయన భార్య వసుంధరలతో కారుచౌకగా నానక్‌రామ్‌గూడలో భూముల కొనుగోళ్లు 6. సీడీఏ పరిధి నుంచి కొండాపూర్‌కు మినహాయింపు.. భార్య భువనేశ్వరి, బినామీ సంస్థ జయభేరి, బంధుమిత్రుల కోసమేనంటూ విమర్శలు 7. ఎల్అండ్టీకి సైబర్ టవర్స్ .. గిఫ్ట్‌గా బాబుకు ఎన్టీఆర్ భవన్ 8. గుక్కెడు తాగునీటికి కూడా దూరమైన నగర వాసులు 9. ఐటీ అభివృద్ధంటూ జనం కళ్లకు గంతలు.. తొమ్మిదేళ్లలో సైబర్ టవర్స కూడా దాటని ఐటీ రంగం.. ఉద్యోగాల కోసం కాళ్లరిగేలా తిరిగిన నిరుద్యోగులు 10 పరిశ్రమల మూసివేతతో రోడ్డున పడ్డ వేలాది కుటుంబాలు ఆల్విన్‌తో పాటు అనేక సంస్థలకు బాబు హయాంలోనే మంగళం 11 మూసీని మురుగు కూపంగా మార్చేసిన ఘనుడు.. పరిశ్రమలకు విచ్చలవిడి అనుమతులు.. విషతుల్యమైన కాలుష్యంతో పెను ముప్పు 12. పాతబస్తీ గోసను ఏనాడు పట్టించుకోని చంద్రబాబు 13. కరెంటు బిల్లులు కట్టకుంటే నేరుగా జైలుకే 14 రోగుల నుంచి కూడా యూజర్ చార్జీలు వసూలు 15. బిచ్చగాళ్లనూ నగరం నుంచి తరిమేసిన హైటెక్ పాలన ఐటీ.. ‘టవర్స’ దాటితే ఒట్టు ఐటీ.. అంటే అదేదో తనే సృష్టించినట్టు.. ప్రపంచంలో ఎక్కడా లేనట్టు.. పోజులు కొట్టే చంద్రబాబు హయాంలో నిజానికి ఐటీ అభివృద్ధి శూన్యం. సైబర్ టవర్స్ నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో తొలుత అందులోకి వచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీలు సైతం తర్వాత సైబర్ టవర్స్‌కు టాటా చెప్పేశాయి. బాబుగారు ఇంత గొప్పగా చెప్పుకునే ఐటీ వల్ల అప్పట్లో వచ్చిన ఉద్యోగాలు ఐదువేలేనంటే నమ్మడానికి కష్టంగా ఉన్నా అదే నిజం. ఇక ఆయన తొమ్మిదేళ్ల పాలనలో ఐటీ అభివృద్ధి సైబర్టవర్స్ గడపదాటితే ఒట్టు. జలాసురుడు.. ఒకనాడు గోల్కొండ కోటకు తాగునీరు అందించిన దుర్గం చెరువు.... నేడు చిన్న తటాకాన్ని తలపి స్తుంది.. 200 ఎకరాల విస్తీర్ణం నుంచి 80 ఎకరాలకు కుదించుకుపోయింది. ఇదొక్కటే కాదు....1995 నుంచి 2004 మధ్యకాలంలో యథేచ్ఛ ఆక్రమణలతో చెరువులన్నీ సహజ స్వరూపాన్ని కోల్పోగా, దాదాపు 104 చెరువులు పూర్తిగా మాయమైపోయాయి... ఇవి హెచ్ఎండీఏ అధికారి సర్వేలో వెల్లడైన వాస్తవాలు. చంద్రబాబు జమానాలో హైదరాబాద్‌లో నిరాటంకంగా సాగిన జలవనరుల విధ్వంసాలకు శిథిల సాక్ష్యాలు. విధ్వంసకారుడు.. హైటెక్ సిటీ నిర్మాణం కోసం పురాతన శిలలు ముక్కలైపోయాయి. తొమ్మిదేళ్ల పాలనలో హైదరాబాద్‌లో జరిగిన చారిత్రక విధ్వంసం అంతా ఇంతా కాదు. మస్కతి డెయిరీకి ప్రాచీన మల్వాల ప్యాలెస్ ధారాదత్తమైపోయింది. అందమైన ముష్క్ మహల్ నామరూపాల్లేకుండా పోయింది.. ఇలాంటివెన్నో. చరిత్రలో గుర్తుండిపోయే ఈ చారిత్రక విషాదానికి మౌన సాక్షి హైదరాబాద్ నగరం. వారసత్వ కట్టడాలపై విరుచుకుపడిన ఆ ముష్కరులు ఆంగ్లేయులు కారు.. తాలిబన్లు అంతకన్నా కాదు. ఈ దండయాత్రకు నాయకత్వం వహించిన సేనాని చంద్రబాబే. ఫ్లై ఓవర్స.. ఫర్ కాంట్రాక్టర్స ఫ్లై ఓవర్లు అనగానే నగర ప్రజలు తెగ సంతోష పడిపోయారు. ట్రాఫిక్ కష్టాలకు ఫుల్స్టాప్ పడుతుందని మురిసిపోయారు. కానీ వారి ఆశలు అడియాసలే అయ్యాయి. అగ్గిపెట్టెల్లాంటి ఫ్లైఓవర్లతో ట్రాఫిక్ కష్టాలు తీరకపోగా ట్రా‘ఫికర్’ మరింత పెరిగింది. ఆరు లేన్లతో నిర్మించాల్సిన వాటిని అడ్డగోలుగా నిర్మించి ప్రజల కష్టాలను రెట్టింపు చేశారు. భవిష్యత్ అవసరాలు తీర్చాల్సిన ఇవి ప్రస్తుత అవసరాలకే పనికిరాకుండా పోయాయి. అయితే బాబును నమ్ముకున్న కాంట్రాక్టర్లు మాత్రం బాగా లాభపడ్డారు.