సాక్షి, హైదరాబాద్: ఐబొమ్మ ఇమ్మడి రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోకి తెలంగాణ సీఐడీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే సీసీఎస్ పోలీసులు ఈ కేసును విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే..
ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుల విచారణ జరుపుతున్న సీఐడీ.. రవి కేసులోనూ ఆ కోణంలో దర్యాప్తును జరపనుందని తెలుస్తోంది. ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్లలో సినిమాలు పైరసీ చేశాడు. సినిమాలు పైరసీ చేస్తూనే మరోవైపు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశాడు రవి. తద్వారా వందల కోట్ల లాభం పొందినట్లు ఇప్పటికే విచారణలో తేలింది.
తాజాగా ఇమ్మడి రవి వివరాలు సేకరించిన తెలంగాణ సీఐడీ.. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో దర్యాప్తును ముమ్మరం చేయాలని భావిస్తోంది. ఐబొమ్మ ద్వారా ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్, బెట్టింగ్ సైట్స్ నాలుగింటిని రవి ప్రమోట్ చేశాడని సీసీఎస్ ఇప్పటికే నిర్ధారించుకుంది. దీంతో సీసీఎస్‌తో పాటే రవి ఆర్థిక వివరాలను సీఐడీ సేకరిస్తున్నట్లు సమాచారం.


