breaking news
immadi ravi
-
బొమ్మ వెనుక ప్రహ్లాద్?
-
ఐబొమ్మ కేసు.. ఇమ్మడి రవికి బిగ్ షాక్
సాక్షి, హైదరాబాద్: సినీ పైరసీ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్మడి రవికి బిగ్ షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి క్రిమినల్ కోర్టు గురువారం తిరస్కరించింది. పోలీస్ కస్టడీ కారణంగా రవి బెయిల్ పిటిషన్ విచారణ ఆలస్యమవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈలోపు.. మూడో దఫా కస్టడీ విషయంలో సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి అప్పీల్‌కు వెళ్లడంతో ఆ విచారణ మరింత ఆలస్యం కావొచ్చని రవి ఆందోళన చెందాడు. అయితే.. ఆ అప్పీల్‌ను విచారిస్తూనే ఇటు రవి బెయిల్ పిటిషన్‌నూ కోర్టు పరిశీలించింది. చివరకు కేసుల తీవ్రత దృష్ట్యా రవి బెయిల్‌కు అనర్హుడని తేల్చేసింది. అదే సమయంలో.. కస్టడీపై రివిజన్ విచారణ చేపట్టిన కోర్టు రేపు తీర్పు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ వైజాగ్‌వాసి అయిన ఇమ్మడి రవి.. ఐబొమ్మ, బప్పం అనే వెబ్సైట్లతో సినీ పైరసీకి పాల్పడ్డాడు. ఇటు పైరసీతో పాటు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసి కోట్లకు పడగలెత్తాడు. ఇందుకు కరేబియన్ దీవులను ఎంచుకుని అక్కడి నుంచి సర్వర్లు, థర్డ్ పార్టీ ద్వారా వ్యవహారం నడిపించాడు. మూడు విడతలుగా 8 రోజులపాటు జరిపిన విచారణలో రవి నుంచి పోలీసులు కీలక సమాచారాన్నే రాబట్టారు. సినిమాను బొమ్మగా పిలుస్తారు కాబట్టే ఐబొమ్మ అని పేరు పెట్టానని.. బలపం కాస్త బప్పం అయ్యిందని.. ఇలా ఆసక్తికర సంగతులను వెల్లడించాడు. అలాగే.. స్క్రీన్ రికార్డింగ్ ద్వారా ఓటీటీ కంటెంట్‌ను సైతం పైరసీ చేయగలిగానని తెలిపాడు. కస్టడీ విచారణలో సైబర్ పోలీసులకే రవి అత్యాధునిక టెక్నాలజీ పాఠాలను నేర్పించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. అయితే కీలకమైన ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో రవి నుంచి సమాచారం రాబట్టాల్సి ఉంది. అందుకే పోలీసులు కస్టడీని ఎక్కువ రోజుల కోరుతున్నారు. సీసీఎస్ పోలీసుల కస్టడీ అప్పీల్ గనుక రిజెక్ట్ అయితే మూడు కేసులకుగానూ(ఒక కేసులో కస్టడీని కోర్టు కొట్టేసింది) మూడు రోజులపాటే రవిని పోలీసుల విచారించాల్సి ఉంటుంది. -
ఐబొమ్మ రవి బెయిల్ పై ఉత్కంఠ
-
బెయిల్ ఇవ్వకండి ప్లీజ్.. మరోసారి పోలీస్ కస్టడీకి
-
ఐబొమ్మ కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: సినీ పైరసీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు ఇమ్మడి రవిని కస్టడీకి తీసుకోకుండానే.. మరోసారి నాంపల్లి కోర్టును సైబర్ క్రైమ్ పోలీసులు ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల ఇవాళ్టి నుంచి మూడు రోజలపాటు రవిని విచారణ జరపాల్సి ఉంది.. అయితే.. చంచల్‌గూడ్ జైలు నుంచి రవిని ఇంకా అదుపులోకి తీసుకోలేదని సమాచారం. కోర్టు ఇచ్చిన మూడు రోజుల సమయం సరిపోదని సీసీఎస్ పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే మరింత టైం కావాలని కోరుతూ అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించారు. మరికాసేపట్లో ఈ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లతో సినీ పైరసీకి పాల్పడినట్లు వైజాగ్‌కు చెందిన ఇమ్మడి రవిపై ప్రధాన అభియోగం నమోదైంది. ఈ క్రమంలో మరో నాలుగు కేసులూ నమోదు అయ్యాయి. అయితే రెండు విడతలుగా ఇప్పటికే రవిని 8 రోజులపాటు విచారణ జరిపారు సీసీఎస్ పోలీసులు. ఈ క్రమంలో.. నాలుగు కేసులకు సంబంధించి కస్టడీకి అనుమతించాలని పిటిషన్ వేశారు. అయితే.. ఇందులో ఒక కేసును తోసిపుచ్చిన కోర్టు.. మిగిలిన మూడు కేసులకు ఒక్కో రోజు చొప్పున మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. శనివారం నుంచి రవిని విచారించాలని ఆదేశించింది. గత విచారణలో రవి నుంచి సైబర్‌క్రైమ్ పోలీసులు కీలక సమాచారాన్నే సేకరించారు. అయితే కీలకమైన లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టాల్సి ఉంది. అందుకే మూడో విడత కస్టడీని అత్యంత కీలకంగా భావిస్తున్నారు. నిందితుడికి నిరీక్షణ తప్పదా?ఇమ్మడి రవి బెయిల్ పిటిషన్ విచారణ కస్టోడియల్ ఎంక్వైరీ కారణంగానే ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల కస్టడీకి ఆదేశించిన సమయంలోనే నాంపల్లి కోర్టు బెయిల్ పిటిషన్ విచారణపై స్పష్టత ఇచ్చింది. సోమవారం ఎట్టి పరిస్థితుల్లో(మూడు రోజుల విచారణ ముగుస్తుంది కాబట్టి) విచారణ జరుపుతామని నిందితుడి తరఫు లాయర్‌కు స్పష్టం చేసింది. అయితే సైబర్ క్రైమ్ పోలీసుల కీలక నిర్ణయంతో ఈ పిటిషన్ విచారణ ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదు. ఒకవేళ అదే జరిగితే.. నిందితుడు రవికి షాక్ అనే చెప్పొచ్చు. -
iBomma Case: ఇమ్మడి రవికి ఊరట దక్కేనా?
సినీ పైరసీ కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రధాన నిందితుడు, ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరగనుంది.ఐబొమ్మ, బప్పం పేరుతో వెబ్సైట్లు నడిపిస్తూ సినీ పైరసీకి పాల్పడ్డాడంటూ ఇమ్మడి (ఐబొమ్మ) రవిపై ప్రధాన అభియోగం ఉంది. సైబర్ నేరాల నేపథ్యంలో మరికొన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. అయితే రవికి బెయిల్ కోరుతూ సీనియర్ లాయర్ సీవీ శ్రీనాథ్ కోర్టును ఆశ్రయించారు. అయితే అప్పటికే సీసీఎస్ పోలీసులు కస్టడీ కోరడంతో బెయిల్ విచారణ వాయిదా పడింది.ఈగ్యాప్‌లో.. రెండు విడతలుగా ఎనిమిది రోజులపాటు రవిని పోలీసులు ప్రశ్నించారు. విచారణలో అతని నుంచి కీలక సమాచారం రాబట్టడంతో పాటు ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలనూ సేకరించినట్లు తెలుస్తోంది. అయితే రవి లాయర్ మాత్రం బెయిల్ కచ్చితంగా వస్తుందని అంటున్నారు.రవి బెయిల్ అభ్యర్థనకు ఇప్పటికే పోలీసులు నాంపల్లి కోర్టులో కౌంటర్ దాఖలు చేయడంతో.. బెయిలా? జైలా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకవేళ బెయిల్ రిజెక్ట్ అయితే గనుక అదనపు విచారణ కోసం పోలీసులు మరోసారి కోర్టులో పిటిషన్ వేసే అవకాశమూ లేకపోలేదు. మరోవైపు.. అతనిపై నమోదు అయిన మరో మూడు కేసుల్లో రేపటిలోగా కోర్టు ముందు హాజరు పరచాల్సి ఉంది. దీంతో ఇవాళే రవిని హాజరు పర్చవచ్చని తెలుస్తోంది.ఇదీ చదవండి: విశాఖలో బొమ్మ.. అందుకే ఆ పేరు పెట్టా! -
ఐ బొమ్మ రవి కేసులో బిగ్ ట్విస్ట్ మెయిల్స్ లో కీలక ఆధారాలు
-
అందుకే ఐబొమ్మ అని పేరు పెట్టా: ఇమ్మడి రవి
సాక్షి, హైదరాబాద్: సినీ పైరసీ కేసులో ఇమ్మడి రవి రెండవ విడత పోలీసు కస్టడీ ముగిసింది. మూడు రోజులపాటు జరిగిన నిందితుడి మెయిల్స్ నుంచి కీలక సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించారు. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లలో మొత్తం 21 వేల సినిమాలు అప్లోడ్ అయినట్లు గుర్తించారు. అంతేకాదు.. ఫైరసీకి సంబంధించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి రవి సైబర్ పోలీసులకు వివరించినట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో రవి తెలిపిన వివరాలు.. విశాఖలో సినిమాను బొమ్మ అనేవాళ్లం. ఐ బొమ్మ అంటే ఇంటర్నెట్ బొమ్మ. ఇంటర్నెట్లో బొమ్మ చూపిస్తున్నాం కదా.. అందుకే అలా పేరు పెట్టా. అలాగే మరో వెబ్సైట్ బప్పంగా మొదట అనుకున్న పేరు అది కాదు. బలపం అని పేరు పెడదామని అనుకున్నాం. కానీ, డొమైన్ నేమ్‌లో ఎల్(L) అనే అక్షరంతో సాంకేతిక సమస్యలు వచ్చాయి. అందుకే బప్పం అని పెట్టాల్సి వచ్చింది. పైరసీ వెబ్‌సైట్స్ నుంచే సినిమాలు రికార్డు చేశాం. ఓటీటీల్లో వచ్చే కంటెంట్‌ను సైతం రికార్డింగ్ చేయగలిగాం. అలా రికార్డింగ్ చేసిన సినిమా ఆడియో.. వీడియో క్వాలిటీ పెంచేందుకు కరేబియన్ దీవుల్లో ఔట్ సోర్సింగ్ వాళ్లతో ఒప్పందం చేసుకున్నాం. అలాగే తాను అప్లోడ్ చేసిన సినిమాలను టెలిగ్రామ్ చానెల్స్ నుంచి సేకరించినవే అని రవి ఒప్పుకున్నాడు.ఇక.. రవి మెయిల్స్‌లో స్పామ్, హైడ్ ఫైల్స్‌లోనే డాటా మొత్తం దాటి ఉన్నట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. అలాగే ప్రహ్లద్ అనే వ్యక్తి గురించి వివరాలు సేకరించారు. తాము ఎన్జిల ఆన్లైన్ ద్వారానే కనెక్ట్ అయ్యామని రవి తెలిపాడు. అయితే ఆ లింకును సైబర్ క్రైమ్ పోలీసులకు చూపించగా అంతలోపే లింక్ రివోక్ అయ్యాయి. దీంతో వాటిని సైబర్ క్రైమ్ పోలీసులు పరిశీలిస్తున్నారు. రెండో విడత కస్టడీ మొదటిరోజు విచారణలో.. ఎన్జీల నెట్వర్క్, ఆర్థిక వ్యవహారాలపై కీలక లీడ్‌ను పోలీసులు సంపాదించారు. ఐపీ మాస్క్ చేసి అనధికారిక వెబ్ సైట్స్ నిర్వహిస్తున్నా ముఠాలపై ఆరా తీశారు. రెండో రోజు విచారణలో మాత్రం రవి సరిగ్గా నోరు విప్పలేదు. పైగా.. బయటకు రాగానే మంచి పనులు చేస్తానంటూ పోలీసులతో అన్నట్లు సమాచారం. మొత్తంగా.. మూడు రోజులపాటు సాగిన రెండో విడత కస్టడీ నేటితో పూర్తైంది. దీంతో రవిని నాంపల్లి కోర్టుకు హాజరుపరిచి.. అక్కడి నుంచి చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరోసారి కస్టడీ కోరతారా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. సినీ పైరసీ కేసులో ఐపీ మాస్క్ లింక్స్ పై త్వరలోనే పోలీసులు కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. -
iBOMMA కేసు అప్ డేట్.. వాళ్ళను పట్టుకోవడం అంత ఈజీ కాదు..
-
ఐబొమ్మ కేసు: ఆధారాలు అడిగి అడ్డంగా దొరికాడు!
సాక్షి, హైదరాబాద్: నగరంలోనే ఉంటూ దాదాపు ఆరేళ్ల పాటు ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లను నడిపించిన ఇమంది రవి ఆచూకీ నాటకీయంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీ సులకు చిక్కింది. గేమింగ్ యాప్స్ కంపెనీలతో ముడిపడి ఉన్న ఓ అమెరికన్ కంపెనీ నుంచి దర్యాప్తు అధికారులు వివ రాలు కోరుతూ మెయిల్ పెట్టారు. దాని యజమాని అయిన ఇమంది రవికే ఆ మెయిల్ చేరగా... సమాధానం ఇస్తూ అతడు ఆధారాలు కోరడంతో మొదలైన అనుమానం అత గాడి అరెస్టు వరకు వెళ్లింది. ఈ వివరాలను అదనపు సీపీ (నేరాలు) ఎం.శ్రీనివాసులు మంగళవారం మీడియాకు వెల్లడించారు.వారికి వచ్చే ట్రాఫిక్‌ను బట్టే చెల్లింపులు...ఐబొమ్మ (iBomma)) వెబ్సైట్ డొమైన్‌ను రవి ఎన్ జెలా అనే సంస్థలో రిజిస్టర్ చేశాడు. ఆ సమయంలో తన గుర్తింపుకార్డు, ఈ–మెయిల్ ఐడీలు ఇవ్వడంతో పాటు తన క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపులు జరిపాడు. ఐబొమ్మ వెబ్‌సైట్‌ను హోస్ట్ చేయడం కోసం ఐపీ వాల్యూమ్ అనే సంస్థతో ఒప్పందం చేసుకున్నాడు. కొన్నాళ్లకు గేమింగ్, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో ఒప్పందాలు చేసుకుని తన సైట్స్ ద్వారా వారి యాప్స్‌కు రీడైరెక్ట్ అయ్యేలా ప్రోగ్రామింగ్ మార్చాడు. ఈ గేమింగ్/బెట్టింగ్ యాప్స్ రవి వెబ్సైట్ ద్వారా తమకు వచ్చే ట్రాఫిక్ (వినియోగదారులు) ఆధారంగా చెల్లింపులు చేసే వాళ్లు. ఈ చెల్లింపులు తొలుత గేమింగ్ కంపెనీ నుంచి యాడ్ క్యాష్, యాడ్ స్టెరా అనే కంపెనీలకు వెళ్లేవి. వాటి నుంచి రవికి చెందిన యాడ్ బుల్ అనే సంస్థ ద్వారా రవి ఖాతాల్లోకి వచ్చేవి. ఇక్కడి వరకు అంతా యూఎస్‌డీటీగా పిలిచే డిజిటల్ కరెన్సీ రూపంలో జరిగినా.. దీన్ని భారత కరెన్సీలోకి మార్చి రవి డ్రా చేసుకునే వాడు.డొమైన్ రిజిస్ట్రీ ఇచ్చిన సమాచారంతో...యూఎస్డీటీని సాధారణ కరెన్సీగా మార్చడం కోసం రవి గెటింగ్ అప్ పేరుతో అమెరికాలోనూ ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. ఐబొమ్మ ద్వారా రీడైరెక్ట్ అవుతున్న గేమింగ్/బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులను సంప్రదించిన సైబర్ క్రైమ్ పోలీసులు చెల్లింపుల విధానానికి సంబంధించిన వివరాలు సేకరించారు. ఇలా గెటింగ్ అప్ కంపెనీ పేరు బయటకు వచ్చింది. ఇది రవికి చెందినదని తెలియని సైబర్ క్రైమ్ అధికారులు దీని నుంచి నగదు ఎక్కడికి వెళ్తోందో తెలుసు కోవాలని భావించి అధికారిక మెయిల్ ఐడీకి ఈ–మెయిల్ పంపారు. దీన్ని అందుకున్న రవి... పోలీసుల్ని తప్పుదారి పట్టించే ఉద్దేశంతో నేరం నిరూపించే బలమైన ఆధారాలు చూపాలంటూ సమాధానం ఇచ్చాడు. సాధారణంగా అమెరి కన్ కంపెనీలు ఆ దేశ పోలీసు, కోర్టు లేదా ఎం–లెట్‌గా పిలిచే ఒప్పందం ద్వారా సంప్రదించాలని అంటాయి.భిన్నంగా స్పందించడంతో ఆరాగెటింగ్ అప్ సంస్థ భిన్నంగా స్పందించడంతో సైబర్ క్రైమ్ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో ఈ కంపెనీ పూర్వాపరాలు, డొమైన్ వివరాలు తదితరాలు సేకరించగా... అవి రవికే చెందిన ఈఆర్ ఇన్ఫోటెక్‌కు దారి తీశాయి. ఇలా తొలిసారి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిగా గుర్తించిన పోలీసులు అతడి వివరాలు ఆరా తీయడం మొదలెట్టారు. ఈలోపు పోలీసుల ద్వారా తన సైట్స్ పేరు బయటకు రావడంతో దేశం వదిలేసి విదేశాలకు పారిపోయాడు. అప్పటికే అతడి ఫోన్ నంబర్ సహా ఇతర వివరాలు సేకరించిన అధికారులు సాంకేతిక నిఘా ఉంచారు. ఇలా అతడి రాకను గుర్తించి అరెస్టు చేశారు. ఐబొమ్మ వెబ్సైట్లో సినిమా పోస్టర్ తయారీకి రవికి నిఖిల్ అనే స్నేహితుడు సహకరించినట్లు తేలింది. అతడినీ విచారించిన పోలీసులు పాత్ర రూఢీ అయితే అరెస్టు చేయాలని నిర్ణయించారు. రవిలో కష్టపడే తత్వం లేదని, మిగిలిన కేసుల్లోనూ అతడిని అరెస్టు చేసి కస్టడీకి కోరతామని పోలీసులు తెలిపారు. -
నాంపల్లి కోర్టుకు ఐబొమ్మ రవి
-
ఇమ్మడి రవి ఒక్కడే ఐబొమ్మతో..
సాక్షి హైదరాబాద్: సినీ పైరసీ కేసులో అరెస్టైన ఇమ్మడి రవి (అలియాస్ ఐ బొమ్మ రవి) పోలీసు కస్టడీ ఈ రోజుతో ముగిసింది. దీంతో నిందితుడిని నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టి తిరిగి జైలుకు తరలించారు. అయితే కస్టడీలో అతని నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఐబొమ్మ రవి ఒక్కడే పైరసీ చేశాడని.. అలా రూ. 100 కోట్లకు పైగా సంపాదించాడని నిర్ధారించుకున్నారు. ఇందులో రూ.30 కోట్లకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను ఇప్పటికే సేకరించారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా బేరమాడి మరీ సినిమాలు కొనుగోలు చేశాడు. మూవీపై క్లిక్ చేయగానే.. 15 యాడ్స్‌కు డైరెక్ట్ లింక్ అయ్యేలా ఏర్పాటు చేశాడని గుర్తించారు.రవికి బెయిల్ రావొచ్చు.. రవిపై చాలా సెక్షన్లతో కేసులు పెట్టారని.. అందులో రెండు మాత్రమే వర్తిస్తాయని అంటున్నారు అడ్వొకేట్ సీవీ శ్రీనాథ్. రవి బెయిల్ వ్యవహారంపై ఆయన సాక్షితో మాట్లాడారు. ‘‘మా క్లయింట్ రవి ఐదు రోజుల కస్టడీ ముగిసింది. కోర్టులో హాజరుపరిచి చంచల్గూడా జైలుకు తరలించారు. 27వ తేదీన తిరిగి తమ ఎదుట హాజరుపర్చాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. బెయిల్ పిటిషన్ రిమాండ్ అయిన రెండో రోజే వేశాం. కస్టడీ విధించాక వేశాం కాబట్టే ఆలస్యమైంది. రేపు పీపీ కౌంటర్ వేశాక బెయిల్ మూమెంట్ ఉంటుంది. అతనిపై రెండు సెక్షన్ లు మాత్రమే అప్లికేబుల్ అవుతాయి. మిగతా కేసులపై కోర్టులో కొట్లాడుతాం. బెయిల్ వస్తుందని భావిస్తున్నాం. అన్నీ ట్రయల్స్‌లో చూసుకుంటాం అని రవి లాయర్ శ్రీనాథ్ తెలిపారు.రవి ఐదు రోజుల కస్టడీలో వెబ్ సైట్, డొమైన్ నెట్వర్స్, ఐపీమాస్క్ తదితర అంశాలపై ఆరాతీసినట్లు సమాచారం. రవితో కలిసి అతని స్నేహితుడు ఇద్దరు కలిసి టైక్నికల్ ఆపరేషన్స్, డేటా హైడింగ్, సర్వర్ యాక్సెస్ తదితర అంశాల్లో పాల్గొన్నట్లు తేల్చుకున్నారు. రూ.20 కోట్ల బదిలీ వివరాలను బ్యాంకు అధికారుల ద్వారా తెప్పించుకున్న పోలీసులు ఆ నగదు విషయంపై ఆరా తీశారు.1xbet అనే బెట్టింగ్ యాప్‌తో పాటు ఇతర యాప్‌ల ద్వారా రవి భారీగా డబ్బులు సంపాదించినట్లు ఇప్పటికే పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ డబ్బులను క్రిఫ్టో కరెన్సీ ద్వారా నిఖిల్ అనే తన స్నేహితుడికి పంపినట్లు గుర్తించారు. కాగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు అన్ని తానొక్కడినే చేశాను తన వెనుక ఎవరూ లేరు అని రవి సమాధానం చెప్పినట్లు సమాచారం. రవిపై ఇతర సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లలోనూ ఐదు కేసులు నమోదయ్యాయి మిగతా కేసుల్లోనూ సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో ఐబొమ్మ రవిని సైబర్ పోలీసులు మరోసారి విచారించే అవకాశమూ లేకపోలేదు. కాగా రేపు హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఐబొమ్మ రవి కేసులో ప్రెస్‌మీట్ ద్వారా మిగతా వివరాలను వివరించే అవకాశం ఉంది. -
పోలీసులకు చుక్కలు చూపిస్తున్న iBOMMA రవి
-
iBOMMA One రవిది కాదు..! కస్టడీలో వెలుగులోకి కీలక విషయాలు
-
సర్వర్ లేదు..క్లౌడ్ సర్వీసే..
సాక్షి, హైదరాబాద్: ‘ఐబొమ్మ’నిర్వాహకుడు ఇమంది రవి పోలీసు కస్టడీ సోమవారంతో ముగియనుంది. ఇతడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం నుంచి విచారిస్తున్నారు. పైరసీతో పాటు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌కు సహకరించాడన్నది ఇతడిపై ఉన్న ప్రధాన ఆరోపణలు. కాగా ఈ మొత్తం వ్యవహారంలో రవి వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంతో పాటు ‘ఐబొమ్మ’, సంబంధిత సైట్ల సర్వర్లపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో కొన్ని కీలక అంశాలు గుర్తించారు. ఇతర పైరసీ వెబ్సైట్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఆధారంగా చేసుకుని స్క్రీన్ రికార్డింగ్ ద్వారా ఆరేళ్లల్లో 21 వేల సినిమాలు సేకరించి వెబ్సైట్లలో ఉంచిన రవి.. దీనికి సంబంధించి ప్రత్యేకంగా సర్వర్ ఏదీ ఏర్పాటు చేయలేదని పోలీసులు గుర్తించారు. క్లౌడ్ సర్వీస్ సేవలను సర్వర్‌గా వినియోగించుకున్నాడని తేల్చారు. బ్యాకప్ కోసం మరో క్లౌడ్ సర్వీస్‌ను వాడినట్లు గుర్తించారు. వెబ్ డిజైనర్‌గా చెప్పుకుంటూ.. మూసాపేటలోని అపార్ట్మెంట్లో నివసించినప్పుడు అతి తక్కువ మందితోనే సంప్రదింపులు జరిపేవాడు. తన గురించిన వివరాలు పెద్దగా వెల్లడించకుండా.. వెబ్ డిజైనింగ్ సంస్థలో పని చేస్తున్నానని, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో సేవలు అందిస్తుంటానని చెప్పాడు. వెబ్ డిజైనింగ్ కోసమే తరచూ ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు వెళ్లివస్తుంటానంటూ చెప్పేవాడు. రవి కొన్నేళ్ల క్రితం మహారాష్ట్ర చిరునామాతో, తన ఫొటోను వినియోగించి పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు తీసుకున్నాడు. ఇందులో తన పేరును ప్రహ్లాద్‌కుమార్ వెల్లెలగా పేర్కొన్నాడు. అందరి దృష్టినీ ఆకర్షించేందుకే.. తన ఈ–మెయిల్ ఐడీలకు సంబంధించిన పాస్వర్డ్స్ చెప్పడానికి రవి నిరాకరించాడు. దీంతో ఎథికల్ హ్యాకర్ల సాయంతో వాటిని ఓపెన్ చేసిన పోలీసులు ఈ సర్వర్‌తో పాటు బ్యాకప్‌కు సంబంధించిన పూర్తి వివరాలు గుర్తించారు. ఓ నటుడితోపాటు తెలుగు పరిశ్రమకు సవాల్ చేయడం వెనుక ఆంతర్యం పైనా పోలీసులు ప్రశ్నించారు. తన వెబ్సైట్ మరికొందరి దృష్టికి వెళ్లేలా చేయాలనే ఆ పని చేసినట్లు రవి బయటపెట్టాడు. ఇటీవల కాలంలో ఐబొమ్మ వన్‌తో పాటు మరో పేరుతో తెరపైకి వచి్చన వెబ్సైట్లకు, రవికి ఎలాంటి సంబంధం లేదని తేలింది. ఈ రెండు ఓపెన్ చేసిన వారిని గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి గాలిస్తున్నారు. రవిని దర్యాప్తు అధికారులు సోమవారం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటారు. రవిపై సైబర్ క్రైమ్ ఠాణాలో మరో నాలుగు కేసులు ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్ ద్వారా అరెస్టు చేసి, కస్టడీలోకి తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. రవి నెట్‌వర్క్‌లో మరె వరూ లేరని స్పష్టం కావడంతో అతడి ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టి ముందుకు వెళ్లనున్నారు. 25 బ్యాంకు ఖాతాలు ఉండటంతో పాటు బిట్ కాయిన్ల రూపంలోనూ భారీ లావా దేవీలు నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. -
ఐ బొమ్మ రవికి ఏమి శిక్ష పడబోతుందో తెలుసా? షాక్ అయ్యే విషయాలు!
-
ఐబొమ్మ రవి విలనా? హీరోనా?
పైరసీ అనేది చట్టరిత్యా నేరం. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సినిమాను తెరకెక్కించే నిర్మాతలకు ఓ రకంగా అది మరణ శాసనం. అలాంటి పైరసీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్ అయితే అందరూ సంతోషించాలి. పోలీసులను అభినందించాలి. కానీ ఇమ్మడి రవి అలియాస్ ‘ఐబొమ్మ’ రవి విషయంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది. పోలీసులను ద్వేషిస్తూ.. రవికి మద్దతుగా లక్షలాది మంది నిలుస్తున్నారు. ‘రవి మా రాబిన్‌హుడ్’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇమ్మడి రవికి సోషల్ మీడియాలో అంత మద్దతు ఎందుకు? ఒక నిందితుడికి మద్దతుగా లక్షలాది మంది గళం విప్పడం వెనక కారణం ఏంటి? స్టార్స్ ఏమంటున్నారు? సామాన్యులు ఏమంటున్నారు?చట్టం ప్రకారం రవి( iBomma Ravi) చేసింది నేరం. కొత్త సినిమాను పైరసీ చేయడమే కాకుండా.. హెచ్డీ ప్రింట్‌ని సామాన్యులకు ఉచితంగా అందించాడు. అయితే ఇదోదే సంఘ సేవ అయితే కాదు. ఫ్రీగా సినిమా చూపిస్తూనే.. వెనకాల ప్రమాదకరమైన బెట్టింగ్ యాప్స్, గేమింగ్ సైట్లను ప్రమోట్ చేసి కోట్లు సంపాదించాడని పోలిసులు చెబుతున్నారు. అంతేకాదు వ్యక్తిగత డేటాని కూడా దొంగిలించాడని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ చెప్పారు. ఇలాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అరెస్టు అయితే, సోషల్ మీడియాలో అతనిపై పాజిటివ్ పోస్టులు పెట్టడం అనేది ఆందోళనకరమైన విషయమే. అయితే తాము ఎందుకు రవికి మద్దతు తెలపాల్సి వస్తుందో కూడా కొంతమంది నెటిజన్స్ చెబుతున్నారు. మొత్తంగా చూస్తే..రెండు బలమైన కారణాల వల్లే రవికి సామాన్యుల మద్దతు లభిస్తుందనే విషయం తెలుస్తోంది.సామాన్యుడిని దూరం చేశారు!సినిమా అనేది ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉండే ఓ వినోదం. కానీ ఇప్పుడు కొందరికి మాత్రమే అన్నట్లుగా మారిపోయింది. సామాన్యులు థియేటర్స్‌కి రావాలంటే భయపడిపోతున్నారు. టికెట్ల రేట్లను అంతలా పెంచేశారు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఓ సినిమా చూడాలంటే దాదాపు రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు ఈజీగా ఖర్చు అవుతుంది. పాప్ కార్న్‌తో పాటు కూల్‌డ్రింక్స్ రేట్లు కూడా భారీగానే ఉంటుంది. పైగా భారీ బడ్జెట్ సినిమా అంటూ టికెట్ల రేట్లను భారీగా పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. స్పెషల్ షో, ప్రీమియర్ షో అంటూ ఫ్యాన్స్ జేబులు ఖాళీ చేస్తున్నారు. ఈ ఆర్థిక భారాన్ని తట్టుకోలేని సామాన్యుడికి ‘ఐబొమ్మ’ అనే పైరసీ వెబ్సైట్ ఉచిత వినోద సాధనంగా మారింది. రూ. 30 ఉండే పాప్ కార్న్‌ని రూ. 700 వరకు అమ్ముతుంటే సినిమా ఎలా చూస్తామని నెటిజన్స్ ట్వీట్ చేస్తున్నారు.క్వాలిటీ కంటెంట్.. ఓ వ్యక్తి సినిమాకు వచ్చేదే ఎంటర్టైన్మెంట్ కోసం. అన్ని మర్చిపోయి హాయిగా రెండున్నర గంటల పాటు ఎంజాయ్ చేయడానికి థియేటర్స్‌కి వస్తారు. కానీ కొన్ని సినిమాలు మాత్రం పెట్టిన డబ్బులకు న్యాయం చేయలేకపోతున్నాయి. రిలీజ్ ముందు వరకు భారీ హైప్ క్రియేట్ చేసుకొని..టికెట్ల రేట్లు పెంచుకుంటున్నారు. తీరా థియేటర్స్‌కి వచ్చిన ప్రేక్షకుడికి తలపోటు తెప్పించి బయటకు పంపిస్తున్నారు. ఇది కూడా ఓ రకంగా పైరసీని ప్రోత్సహించడానికి కారణం అవుతుంది. నాసిరకం సినిమాలకు వందల రూపాయలు ఖర్చు చేసి థియేటర్స్‌కి వెళ్లడం కంటే.. ఇంట్లో కూర్చోని ఫోన్లో చూడడం బెటర్ అనే భావనకు ప్రేక్షకులు వచ్చారు. రిలీజైన గంటల్లోనే తన ఫోన్లోకి సినిమా వచ్చేస్తే.. సామాన్య ప్రేక్షకుడికి అంతకన్నా కావాలిసిందేముంది? ఇదే ఇప్పుడు సామాన్యుల దృష్టిలో రవిని హీరోగా చేసింది. సినీ ప్రముఖులు ఏమంటున్నారు?రవి అరెస్ట్ పట్ల సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రవిని రాబిన్ హుడ్ అంటూ పొగడడాన్ని ఆర్జీవీ తప్పుబట్టాడు. టికెట్లు పెరిగాయాని పైరసీ తీసి అందరికి చూపిస్తానంటే.. ఈ లెక్కన బంగారం దుకాణాన్ని దోచుకొని అందరికి ఉచితం ఎందుకు పంచట్లేదు? BMW కార్లను కొట్టేసి మురికి వాడల్లో ఉన్నవాళ్లకి ఇవొచ్చు కదా అని లాజిక్‌తో ప్రశ్నించాడు. అంతేకాదు పైరసీ చేసినవాడిని కాదు పైరసీ చూసిన వాళ్లను కూడా అరెస్ట్ చేయడమే దీనికి సరైన పరిష్కారం అని సలహా ఇచ్చాడు. ఇక సినీ నిర్మాత సి. కల్యాణ్ అయితే పైరసీని చేసిన రవికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేశాడు. నకిలీ విత్తనాలు, నకిలీ మందులు ఎలా హానికరమో, పైరసీ సినిమాలు అదే స్థాయిలో హానికరం అని నిర్మాత సురేశ్ బాబు అన్నారు. ఒక సినిమా వెనుక ఎంతో మంది కష్టం ఉటుందని, ఇల్లీగల్‌గా ముమ్మాటికే తప్పే అని అని దిల్ రాజు అన్నారు. ఏదీ ఉచితంగా రాదు. సినిమాలు ఉచితంగా చూస్తున్నామని ప్రజలు అనుకుంటున్నారు. వెబ్సైట్ల నిర్వాహకులకు డబ్బును ప్రజలే ఇస్తున్నారు. పర్సనల్ డాటాను విక్రయించడం ద్వారా ఇస్తున్నారు. పేరు, ఫోన్ నంబరు, ఆధార్ నంబరు ఇవ్వడం ద్వారా వాటిని నేరగాళ్లకు అమ్ముకుంటున్నారు’’ అని అన్నారు రాజమౌళి. మొత్తానికి సామాన్యులకు రవి హీరోగా కనిపిస్తే.. సినీ స్టార్స్‌కి మాత్రం విలన్‌గా కనిస్తాడు. కొంతమంది మాత్రం రవి చేసింది తప్పని అంటూనే.. రేట్ల విషయంలో సినిమా పరిశ్రమ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. -
ఐబొమ్మ రవి ‘కొత్త సినిమా చూపిస్తున్నాడా?’
సాక్షి,హైదరాబాద్: టాలీవుడ్ సినిమాల పైరసీ అడ్డుకట్ట పోలీసులకు మరింత సవాలుగా మారింది. ఐబొమ్మ,బప్పంటీవీ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు తర్వాతే ఇబ్బడి ముబ్బడిగా కొత్తకొత్త పైరసీ వెబ్సైట్లు పుట్టుకొస్తున్నాయి. విడుదలైన మరుసటి రోజే కొత్త సినిమాలు సదరు పైరసీ వెబ్సైట్లో దర్శనమిస్తున్నాయి. గత శుక్రవారం విడుదలైన కొత్త సినిమాలు సైతం పైరసీసైట్లో అప్లోడ్ చేయడంపై సినీ దర్శక,నిర్మాతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రెండ్రోజుల కిందట ప్రేమంటే,12ఏ రైల్వే కాలనీ,రాజు వెడ్స్ రాంబాయి సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ఆ సినిమాలే ఇప్పుడు పైరసీ వెబ్సైటలో అప్లోడ్ చేసి ఉన్నాయి. థియేటర్లో కెమెరా ద్వారా రికార్డ్ చేసి వెబ్ సైట్లో అప్లోడ్ చేసినట్లు సైబర్ క్రైమ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇమ్మడి రవి అరెస్టుతో సినిమా పైరసీ ముఠాకు పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా నిర్వాహకులు వాటిని బేఖాతరు చేస్తూ..ఇబ్బడి ముబ్బడిగా పైరసీ వెబ్సైట్లు తయారు చేసి వాటిల్లో కొత్త సినిమాల్ని పైరసీ చేస్తుండగా.. సంబంధిత పైరసీ వెబ్సైట్ల లిస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పైరసీ వెబ్సైట్లపై పోలీసుల తదుపరి చర్యలు ఏం తీసుకుంటారనేది తెలియాల్సి ఉండగా.. అరెస్టు అనంతరం ఇమ్మడి రవి నియమించిన వ్యక్తులే కొత్త సినిమాలను పైరసీ చేస్తున్నారన్న కోణంలో దర్యాప్తు చేయనున్నట్లు సమాచారం. నిన్నమొన్నటి వరకు పైరసీ నడిపించేది ఒక్కరే అనుకున్నా.. ఇప్పుడు పదుల సంఖ్యలో వెబ్సైట్లు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుండడంపై రవి వేర్వేరు దేశాల నుంచి పైరసీ దందా నడిపిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే సినిమాల పైరసీ వ్యవహారంలో ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. విచారణలో పోలీసులకు ఐబొమ్మ రవి సహకరించడం లేదని సమాచారం. అయితే, ఐబొమ్మ రవి అరెస్టయినా కొత్త సినిమాలు పైరసీ జరుగుతున్నట్లు తేలింది.సోషల్‌మీడియాలో భారీ ఫాలోయింగ్ చట్టప్రకారం ఇమ్మడి రవి చేసింది నేరం. కానీ, సోషల్‌మీడియాలో మాత్రం అతడికి విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. అతడి అరెస్టు విషయం తెలిసినప్పటి నుంచి పుంఖానుపంఖాలుగా గ్రూపులు ఏర్పాడుతున్నాయి. వివిధ వెబ్సైట్లలో రవి అరెస్టు వార్తను చూసిన అతడి అభిమానులు కామెంట్లలో తమ మద్దతు తెలుపుతున్నారు. ‘ఐబొమ్మ పోరాట సమితి’, ‘అమీర్‌పేట కుర్రాళ్లు’, ‘రవి ఫ్యాన్ క్లబ్’ పేర్లతో గ్రూపులు కనిపిస్తున్నాయి. ‘సినిమా విడుదల సందర్భంలో రేట్లు పెంచేస్తూ ప్రభుత్వమే జీఓలు ఇస్తుంది. అలా పేద వాడికి దూరమైన సినిమాను విడుదలైన కొన్ని గంటల్లోనే రవి ఉచితంగా అందిస్తున్నాడు. అది తప్పెలా అవుతుంది?’ అని, ‘ఇప్పుడిక అమీర్‌పేట కుర్రాళ్లు, మిడిల్ క్లాస్ స్టూడెంట్ల పరిస్థితి ఏమిటో?’ అని కామెంట్లు కనిపిస్తున్నాయి. -
ఐబొమ్మ రవి కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: ఐబొమ్మ ఇమ్మడి రవి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోకి తెలంగాణ సీఐడీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే సీసీఎస్ పోలీసులు ఈ కేసును విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసుల విచారణ జరుపుతున్న సీఐడీ.. రవి కేసులోనూ ఆ కోణంలో దర్యాప్తును జరపనుందని తెలుస్తోంది. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లలో సినిమాలు పైరసీ చేశాడు. సినిమాలు పైరసీ చేస్తూనే మరోవైపు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశాడు రవి. తద్వారా వందల కోట్ల లాభం పొందినట్లు ఇప్పటికే విచారణలో తేలింది. తాజాగా ఇమ్మడి రవి వివరాలు సేకరించిన తెలంగాణ సీఐడీ.. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో దర్యాప్తును ముమ్మరం చేయాలని భావిస్తోంది. ఐబొమ్మ ద్వారా ఆన్లైన్ గేమింగ్ యాప్స్, బెట్టింగ్ సైట్స్ నాలుగింటిని రవి ప్రమోట్ చేశాడని సీసీఎస్ ఇప్పటికే నిర్ధారించుకుంది. దీంతో సీసీఎస్‌తో పాటే రవి ఆర్థిక వివరాలను సీఐడీ సేకరిస్తున్నట్లు సమాచారం. -
iBomma Ravi: లీకులు లేకుండా టాప్ సీక్రెట్‌గా..
సాక్షి, హైదరాబాద్: ఐబొమ్మ రవి కేసులో కస్టడీ విచారణ మూడో రోజుకి చేరింది. అత్యంత గోప్యంగా, ఎలాంటి లీకులు లేకుండా సైబర్ క్రైమ్ పోలీసులు అతని నుంచి వివరాలు రాబడుతున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా ఉన్నత స్థాయి అధికారులే స్వయంగా ఈ విచారణను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. పైరసీ కేసులో నిందితుడు ఇమ్మడి రవికి సంబంధించిన ఆరు అకౌంట్ల వివరాల కోసం బ్యాంకు అధికారులకు సీసీఎస్ లేఖ రాసింది. ఇప్పటికే డబ్భుల కోసమే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్లు ఒప్పుకున్న రవి.. 1xbet యాప్ నిర్వాహకుల వివరాలు చెప్పేందుకు మాత్రం నిరాకరించాడు. అలాగే.. మూవీ రూల్జ్ అనే వెబ్సైట్ నుంచి పెద్ద ఎత్తున సినిమాలు కొనుగోలు చేశానని.. అందుగానూ క్రిప్టో కరెన్సీ ద్వారా మూవీ రూల్జ్‌కి డబ్బులు చెల్లించానని రవి పోలీసులకు తెలిపాడు. దర్యాప్తులో రవి తమిళ, హిందీ వెబ్సైట్ల ద్వారా సినిమాలను కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌ను బెట్టింగ్ యాప్స్‌కి గేట్ వే చేసి.. ఆ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బులతోనే రవి సినిమాలు కొనుగోలు చేసినట్లు తేలింది. ఫ్యూవర్స్ పెంచుకోవడానికి క్వాలిటీ కంటెంట్‌ని పోస్ట్ చేసేవాడని.. కరేబియన్ దీవుల్లో ఆఫీస్ ఏర్పాటు చేసి ఏకంగా 20 మంది యువకుల్ని రవి నియమించినట్లు తెలుస్తోంది. అయితే రెండ్రోజులపాటు జరిగిన విచారణలో రవి నుంచి కొద్దిపాటి సమాచారాన్నే మాత్రమే సేకరించినట్లు తెలుస్తోంది. దీంతో రవి నెట్ వర్క్ పై లోతైన విచారణ జరుపుతున్నారు. రవికి సినిమాలు సప్లై చేస్తున్న, సహకరిస్తున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. ఏజెంట్లు, గేమింగ్ యాప్‌ల నిర్వాహకులతో రవికి ఉన్న లింకులపై ఆరా తీస్తున్నారు. -
iBomma రవి చేసింది పైరసీ కాదు? సినిమా ఇండస్ట్రీ వాళ్లే పెద్ద క్రిమినల్స్


