Telangana CID
-
వారసుల కోసం.. రోగుల వేషం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా మెడికల్ కుంభకోణం వెలుగుచూసింది. నకిలీ మెడికల్ సరి్టఫికెట్లు చూపించి తాము ఇక పనిచేయలేమంటూ.. తమ వారసులకు ఉద్యోగాలు ఇప్పిద్దామనుకున్న ఇద్దరు వెటర్నరీ శాఖ ఉద్యోగుల గుట్టును అధికారులు రట్టు చేయటంతో ఈ స్కాం బయటపడింది. ఈ స్కాం లోతుపాతులను కనిపెట్టేందుకు పోలీసులు కూపీ లాగుతున్నారు. సిరిసిల్ల, కరీంనగర్‌తోపాటు ఇతర జిల్లాల్లోనూ అక్రమ వారసత్వ నియామకాల రాకెట్ సాగినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తూ వెటర్నరీ శాఖ అధికారునలు సీఐడీకి లేఖ రాశారు. దీంతో సీఐడీ కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం.ఎలా బయటపడిందంటే? వాస్తవానికి ఈ కుంభకోణాన్ని మార్చిలోనే గుర్తించారు. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, ఇల్లంతకుంట మండలాల నుంచి వెటర్నరీ శాఖకు చెందిన ఉద్యోగులు వేర్వేరుగా మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ రెండు కేసుల్లోనూ సమర్పించిన డాక్యుమెంట్లు ఒకేలా ఉండటం, ఇద్దరూ కాలేయ సంబంధిత సమస్యలనే కారణాలుగా చూపించడంతో అధికారులకు అనుమానం వచ్చి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే విచారణకు ఆదేశించారు. కరీంనగర్ కేంద్రంగా ఈ రాకెట్ పనిచేసిందని గుర్తించారు. మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు కరీంనగర్‌కు చెందిన రిటైర్డ్ తహసీల్దార్ బీరయ్యను సంప్రదించారు. ఆయన వారి నుంచి రూ.3 లక్షల చొప్పున తీసుకొని తనకు డి.ఎం.హెచ్.ఓ ఆఫీస్‌లో పరిచయం ఉన్న మొహమ్మద్ బాసిద్ హుస్సేన్, ల్యాబ్ టెక్నీషియన్ కొత్తపల్లి రాజేశం సాయంతో కరీంనగర్‌లోని ఒక ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రి ప్ప్రిస్కిప్షన్లతో నకిలీ మెడికల్ ఇన్వాలిడేషన్ సర్టిఫికెట్లు సృష్టించినట్లు గుర్తించారు. దీనిపై ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట పోలీసుస్టేషన్లలో వేర్వేరుగా కేసులు నమోదయ్యాయి.రంగంలోకి సీఐడీ.. ఇదే తరహాలో మెడికల్ అన్‌ఫిట్ కింద ఉమ్మడి జిల్లాలో 30 మంది వరకు ఉద్యోగాలు పొందినట్లు సమాచారం. ఈ రాకెట్ సిరిసిల్ల, కరీంనగర్‌కు మాత్రమే కాకుండా వెటర్నరీ విభాగంలో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిందని భావిస్తున్నారు. కుంభకోణం భారీగా కనిపిస్తుండటంతో స్థానిక పోలీసులతో దర్యాప్తు సాధ్యం కాదని భావించి సీఐడీకి లేఖ రాశారు. దీంతో సీఐడీ అధికారులు ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట పోలీసుస్టేషన్లలో నమోదైన ఎఫ్ఐఆర్లు, ప్రాథమికంగా ఉమ్మడి జిల్లాల నుంచి సమాచారం తెప్పించుకుని అధ్యయనం చేస్తున్నారు. త్వరలోనే దర్యాప్తు మొదలుపెట్టనున్నారని అధికార వర్గాల సమాచారం. -
ఆర్థిక నేరాల కట్టడికి చర్యలు
సాక్షి, హైదరాబాద్: నేరం జరిగిన తర్వాత దర్యాప్తు చేసి నిందితులను గుర్తించడమే కాదు.. నేరం జరగకుండా నిలువరించడం కూడా పోలీసుల ప్రథమ కర్తవ్యం. ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న ఆర్థిక నేరాల విషయంలోనూ ఇదే సూత్రాన్ని అవలంబిస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఎక్కడో కూర్చుని ఇక్కడి ప్రజల బ్యాంకు ఖాతాలు కొల్లగొట్టి.. వారి కష్టార్జితాన్ని ఎగరేసుకుపోతున్న సైబర్‌నేరగాళ్ల కట్టడికి ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. మల్టీలెవల్ మార్కెటింగ్, ఆన్లైన్లో మోసగించే వారిపై ఫోకస్‌పెట్టి.. ఆదిలోనే అలాంటి నేరాల కట్టడికి తెలంగాణ సీఐడీలో మరో నూతన యూనిట్‌ను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సైబర్‌నేరాల కట్టడికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను అదేవిధంగా డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల కట్టడికి టీజీ యాంటీనార్కోటిక్స్ బ్యూరోను ఏర్పాటు చేసినట్టే, ఆర్థిక నేరాలకు పాల్పడే వారిపై నిఘా పెట్టేందుకు తెలంగాణ సీఐడీలో అంతర్భాగంగా ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. మోసపూరిత ప్రకటనలు ఇచ్చేవారిపై నిఘా.. ఈ విభాగం ప్రధానంగా ఈ కామర్స్ సైట్స్, ఫేస్బుక్, ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్ సహా అన్ని సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో నకిలీ, మోసపూరిత వాణిజ్య ప్రకటనలు ఇచ్చేవారిపై నిఘా పెడుతుంది. మల్టీలెవల్ మార్కెటింగ్‌తో లాభాలు వస్తాయని, పార్ట్‌టైం జాబ్స్ ఇస్తామని.. పలు రకాల స్కీంలతో ప్రకటనలు ఇచ్చే వారిపై నకిలీ వివరాలతో ఏర్పాటు చేసుకున్న ఖాతాలతో డెకాయి ఆపరేషన్స్ చేస్తుంది. ఆన్లైన్లో వచ్చే ప్రకటనల్లో నంబర్లు, అడ్రస్‌లు, వ్యక్తుల గురించి ఆరా తీస్తుంది. ఇందులోని అధికారులు తాము కూడా ఒక వినియోగదారుడిగా అవతలి వ్యక్తులతో (మోసపూరిత ప్రకటనలు ఇచ్చిన వారితో) సంప్రదింపులు చేస్తూ, వారి వివరాలు కనుగొని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. అలా కాకుండా మోసాలకు పాల్పడే వారిని ఆదిలోనే గుర్తిస్తే.. అమాయక పౌరులు వారి వలలో పడి మోసపోకుండా ముందుగానే కట్టడి చేయవచ్చన్నదే ఈ నూతన వింగ్ ఏర్పాటు ఆలోచన వెనుక ప్రధాన ఉద్దేశం. ఇలా చేయడం ద్వారా ఆర్థిక మోసాల బారి నుంచి ప్రజలను కాపాడటంతోపాటు వారిని అప్రమత్తం చేయవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నూతన వింగ్ ఏర్పాటుతోపాటు, సాంకేతికంగా మంచి పరిజ్ఞానం ఉన్న సిబ్బందిని నియమించేలా పోలీస్ అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. -
Hyderabad: రూ.4 కోట్ల మోసగాడు.. 28 ఏళ్లకు చిక్కాడు
సాక్షి, హైదరాబాద్: ఓ ఆర్థిక మోసం కేసులో 28 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నేరస్తుడిని తెలంగాణ సీఐడీ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూర్ పోలీస్ స్టేషన్లో 1995 నమోదైన కేసులో నిందితుడిగా వీఎస్ క్షీర్‌సాగర్‌ను అరెస్టు చేసినట్టు సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్ తెలిపారు. బుధవారం ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో కేసు వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా, కొత్తూరు మండలం నందిగోన్ గ్రామ పరిధిలో 1995లో వానిసింగ్ కంపెనీ పేరిట ఓ స్టీల్ కంపెనీని స్థాపించారు. స్థానికులకు కంపెనీలో షేర్లపేరిట మొత్తం రూ.4.3 కోట్లు సదరు కంపెనీ నిర్వాహకులు వసూలు చేశారు. ఈ మొత్తంలో రూ.4 కోట్లను 1995లో ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్‌లో దాదర్ బ్రాంచ్‌లో బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేస్తున్న వీఎస్ క్షీర్సాగర్ కొట్టేశాడు. కంపెనీ దివాళా తీయడంతో ఎంతోమంది అమాయకులు డబ్బులు పోగొట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంటును ఎట్టకేలకు అమలు చేస్తూ నిందితుడిని ఇండోర్ పట్టణంలో అరెస్టు చేశారు. నిందితుడి అరెస్టులో కీలకంగా పనిచేసిన సీఐ డీ ఇన్స్పెక్టర్ ఎస్ వెంకటేశ్, ఎస్సై పి నాగార్జున, హెడ్ కానిస్టేబుల్ ఎం.గోపాల్‌లను సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ అభినందించారు. -
పెద్ద కేసా.. పెండింగే..
- పాత కేసులపైనే సీఐడీ సమీక్షలు - కీలక కేసులపై ఉదాసీనత - పెండింగ్‌లో 1,350 కేసులు - అధికారుల కొరత అంటున్న సీఐడీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖకు సీఐడీ విభాగం కీలకమైనది. ఎన్నో సంచలన కేసులు విచారించింది. ప్రభుత్వానికి ఏసీబీ ఓ చేతిలాంటిదైతే.. సీఐడీ మరో చేయి. అలాంటి సీఐడీ ఇప్పుడు నీరసపడింది. గడిచిన మూడేళ్లలో సంచలన కేసుల దర్యాప్తు ప్రారంభించిన ఈ విభాగం.. వాటిని తుదిదశకు చేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏళ్ల నాటి కేసులపై నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్న ఆ శాఖాధికారులు, కీలక కేసులపై మాత్రం ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. పాత కేసుల బూజు దులపడం అవసరమే అయినా కీలక కేసులను పెండింగ్‌లో పెట్టడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఏళ్లుగా ఉత్తర ప్రత్యుత్తరాలే.. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సీఐడీకి 1,350 పెండింగ్ కేసులు కేటాయించారు. వీటిలో ఎక్కువగా ఆర్థిక నేరాలున్నాయి. ఈ కేసుల్లో పలు విభాగాలకు ఏళ్లుగా ఉత్తర ప్రత్యుత్తరాలు తప్ప దర్యాప్తులో సాధించిన పురోగతి లేదు. పెండింగ్ కేసులపై వివరణ కోరగా సీఐడీలో తీవ్రమైన అధికారుల కొరత ఉందని, అందుకే దర్యాప్తు ముందుకు సాగడం లేదని ఆ విభాగం అధికారులు చెబుతున్నారు. ‘ఇళ్ల పథకం’ కేసు మూడేళ్లుగా.. గృహ నిర్మాణ శాఖలో భారీ అవినీతి జరిగిందని ఇందిరమ్మ ఇళ్ల పథకంపై రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో సీఐడీ విచారణ ప్రారంభించింది. మూడేళ్లు గడిచినా ఒక్క వ్యక్తిని గానీ, అధికారిని గానీ అరెస్టు కాదు కదా.. అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన దాఖలాల్లేవు. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) నిధుల్లో భారీగా పక్కదారి పట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వమే విచారణకు ఆదేశించింది. 2014 నవంబర్‌లో పట్టాలెక్కిన కేసు దర్యాప్తు ఇంకా తుదిదశకు చేరలేదు. ఇక ఎంసెట్–2 ప్రశ్నపత్రం లీకేజీలో బ్రోకర్లు, సూత్రధా రులను అరెస్టు చేసిన సీఐడీ.. కేసులో అధికారుల పాత్రపై పూర్తి విచారణ చేయలేకపోయింది. బోధన్ కమర్షియల్ ట్యాక్స్ స్కాంలో చిన్న చిన్న చేపలను వలవేసి పట్టిన సీఐడీ అధికారులు.. అసలు నిందితులను వదిలేశారని ఆరోపణలున్నాయి. ప్రధాన నిందితుడు శివరాజుతో కలసి లబ్ధి పొందిన డీలర్లు, రైస్ మిల్లర్లు, ఇతరత్రా ప్రముఖులను సీఐడీ విచారించలేకపోయిందని, ఇందుకు పై స్థాయి నుంచి ఒత్తిళ్లున్నాయన్న వార్తలు వినిపించాయి. ఇలా కీలక కేసుల్లో దర్యాప్తుపై కనీసం చార్జిషీట్‌కు కూడా వెళ్లలేని దుస్థితిలో సీఐడీ ఉందని ప్రచారం సాగుతోంది. -
అటెండర్, డ్రైవర్లే కంపెనీ డైరెక్టర్లుగా..
⇒ బోగస్ కంపెనీలతో షేర్లు మళ్లించిన స్టాక్ మర్చంట్ బ్రోకర్ ⇒ రవి డిస్టిలరీస్ యజమానికి రూ.70 కోట్ల మేర టోపీ ⇒ పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు..రాష్ట్ర సీఐడీకి అప్పగించిన సుప్రీంకోర్టు ⇒ 62 మంది నిందితుల గుర్తింపు.. ఏడుగురు అరెస్ట్ సాక్షి, హైదరాబాద్: ‘మీ కంపెనీ షేర్లను పబ్లిక్ ఇష్యూలోకి తీసుకురండి.. షేర్ మార్కెట్లో పెట్టి బ్యాంకుల్లో అప్పులు తీసుకోకుండా లాభాలు గడించండి..’అంటూ అనిల్ అగర్వాల్ అనే స్టాక్ మర్చంట్ బ్రోకర్ ఓ ప్రముఖ డిస్టిలరీస్ కంపెనీకి రూ.70 కోట్లు టోపీ పెట్టాడు. తన ఆఫీసులో పనిచేసే అటెండర్లు, అసిస్టెంట్లు, డ్రైవర్లను డైరెక్టర్లుగా పెట్టి 15 నుంచి 20 సూట్‌కేసు కంపెనీలు ఏర్పాటు చేశాడు. డిస్టిలరీస్ కంపెనీ షేర్ల డబ్బును ఆ కంపెనీల్లోకి మళ్లించేసి, దండుకున్నాడు. ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదుకావడంతో.. సుప్రీంకోర్టు దర్యాప్తు బాధ్యతను తెలంగాణ సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించిన అధికారులు 62 మందిని నిందితులుగా చేర్చి.. ఏడుగురిని అరెస్టు చేశారు. ఏం జరిగింది? పుదుచ్చేరికి చెందిన రవికుమార్ 2010లో హైదరాబాద్‌లోని నాచారంలో రవికుమార్ డిస్టిలరీస్ లిమిటెడ్ పేరిట డిస్టిలరీ (లిక్కర్ తయారీ) కంపెనీని ఏర్పాటు చేశారు. దేశ వ్యాప్తంగా తన బిజినెస్‌ను విస్తరించారు. అయి తే కొంతకాలం కింద రవికుమార్‌కు ముంబైకి చెందిన అనిల్ అగర్వాల్ అనే స్టాక్ మర్చంట్ బ్రోకర్ (స్టాక్ మార్కెట్లో ఆయా కంపెనీల షేర్ల ను నిర్వహించేవారు) పరిచయమయ్యాడు. వ్యాపారానికి డబ్బులు కావాలంటే బ్యాంకు రుణం తీసుకోవాల్సిన అవసరం లేదని.. కంపె నీ షేర్లను పబ్లిక్ ఇష్యూకు వెళ్లి విక్రయించ వచ్చని సలహా ఇచ్చాడు. స్టాక్ మార్కెట్ కార్యకలాపాలన్నీ తాను చూసుకుంటానని చెప్పాడు. రవికుమార్‌కు స్టాక్ మార్కెట్ వ్యవహారాలపై పెద్దగా అవగాహన లేకున్నా.. అనిల్‌ను నమ్మి కంపెనీ షేర్లను పబ్లిక్ ఇష్యూలో పెట్టాడు. మార్కెట్ బాగుండటంతో షేర్లు మంచి ధరకు విక్రయమయ్యాయి. దీన్ని అదునుగా చేసుకున్న అనిల్.. ప్రతిసారీ వచ్చి కలవడం కుదరడం లేదంటూ కంపెనీ ఖాళీ లెటర్ హెడ్స్‌పై రవికుమార్ నుంచి సంతకాలు తీసుకున్నాడు. వాటిని ఉపయోగించుకుని కంపెనీ షేర్లను అమ్ముకున్నాడు. 20 సూట్‌కేసు కంపెనీలు.. రవికుమార్ డిస్టిలరీస్ కంపెనీ స్టాక్ మార్కెట్లో నమోదైన మరుసటి ఏడాది నుంచే అనిల్ తన ప్రతాపం చూపించాడు. యాజమాన్యానికి తెలియకుండా ఏడాదిన్నరపాటు మెల్లమెల్లగా రూ.70 కోట్ల విలువైన షేర్లను అమ్ముకున్నాడు. ఆ డబ్బులను దారి మళ్లించి, వైట్ చేసుకునేందుకు అనిల్ తన బంధువులు, తన ఆఫీసులో పనిచేసే అటెండర్లు, డ్రైవర్లతో 20 సూట్‌కేసు కంపెనీలు సృష్టించాడు. ఇలా చెన్నైలోని రాధా సోమి సెక్యూరిటీ ప్రైవేట్ లిమిటెడ్, ముంబైలోని బీఎల్సీ ట్రేడింగ్ కంపెనీ, ఫ్యాక్ట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ తదితర కంపెనీల్లో షేర్లు కొన్నట్టు లెక్కపత్రాలు సృష్టించి, సొమ్ము కాజేశాడు. ఈ షేర్లు కొన్న డబ్బులు సంబంధిత కంపెనీల ఖాతాల్లోకి జమ అయి నెల తిరిగేలోపే మళ్లీ అనిల్ వద్దకు చేరినట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది. కేసులన్నీ రాష్ట్ర సీఐడీకి.. అనిల్ అగర్వాల్ మోసాలపై కంపెనీ ఎండీ రవికుమార్ 2011లో నాచారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతోపాటు ముంబైలో, కంపెనీ హెడ్‌క్వార్టర్స్‌గా ఉన్న పుదుచ్చేరి, చెన్నైల్లోనూ కేసులు నమోదయ్యాయి. దీంతో సుప్రీంకోర్టు అన్ని కేసులను రాష్ట్ర సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ 62 మంది నిందితులను గుర్తించింది. ఈకేసులో ప్రధాన నిందితుడైన అనిల్ అగర్వాల్ కోర్టు నుంచి నాట్ టు అరెస్ట్ ఉత్తర్వులు తెచ్చుకోవడంతో నోటీసులిచ్చి విచారిస్తున్నట్టు తెలిసింది. చెన్నైకి చెందిన భగవతీ ప్రసాద్ జన్జన్వాలా, భాస్కరన్ సత్యప్రకాశ్, ముంబైకి ముఖేష్ పృథ్వీరామ్ చౌహాన్, ప్రపుల్ సదానంద రాణే, కోల్‌కతాకు చెందిన సర్వేశ్వర్ పరీదా, పుష్పల్చంద్ర, రాజేంద్రకుమార్ రీటాలను అధికారులు అరెస్టు చేశారు. -
'లీక్ బాధ్యులను కఠినంగా శిక్షించాలి'
యాదగిరిగుట్ట : తెలంగాణ ఎంసెట్-2 లీకేజీ సంబంధించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు చేసిన తప్పుకు మిగిలిన విద్యార్థులను బాధ్యులను చేసేలా ఎంసెట్‌ను రద్దు చేయడం తగదన్నారు. దోషులను కఠినంగా శిక్షించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ సీఐడీ వివరాలు
-
ఎంసెట్ పేపర్ లీక్ చేసింది నిషాద్: సీఐడీ
-
ఎంసెట్ పేపర్ లీక్ చేసింది నిషాద్: సీఐడీ
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 ప్రశ్నపత్రంను ప్రింటింగ్ ప్రెస్ నుంచి షేక్ నిషాద్ లీక్ చేశాడని సీఐడీ అధికారులు నిర్ధారించారు. ముంబైలో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. నిషాద్ లో పాటు అతడి అనుచరుడు గుడ్డూను కూడా సీఐడీ అధికారులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారంతో సంబంధంతో ఉందని అనుమానిస్తున్న రిజోనెన్స్ వి మెడికల్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు వెంకట్రావును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేశారు. ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో రూ. 50 కోట్లు చేతులు మారినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి రూ.75 లక్షలు తీసుకున్నట్టు తెలుస్తోంది. 72 మంది విద్యార్థులకు ప్రశ్నాపత్రం లీక్ చేసినట్టు సీఐడీ అధికారులు ఆధారాలు సంపాదించారు. ఈ లీకేజీకి ప్రధాన సూత్రధారుడైన బ్రోకర్ రాజగోపాల్ రెడ్డితో పాటు ముఠా సభ్యులు రమేశ్, తిరుమల్, విష్ణును ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కాగా, ఎంసెట్-2 పరీక్షను రద్దు చేయొద్దని పరీక్ష రాసిన విద్యార్థులు కోరుతున్నారు. -
ఎంసెట్ -2 రద్దు..!
-
తెలంగాణ సీఐడీకి అగ్రిగోల్డ్ నిందితులు
విచారణకు మహబూబ్‌నగర్ కోర్టు అనుమతి సాక్షి, హైదరాబాద్: చిరుద్యోగులకు, సామాన్యులకు అధిక వడ్డీ ఆశచూపి కుచ్చుటోపీ పెట్టిన అగ్రిగోల్డ్ సంస్థ నిందితులను తెలంగాణ సీఐడీ కస్టడీలోకి తీసుకోనుంది. ఈ సంస్థలో డిపాజిట్లు చేసినవారికి సొమ్ములు చెల్లించకుండా చేతులెత్తేయడంతో ఏపీతోపాటు, రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో రెండు కేసులు నమోదయ్యాయి. అగ్రిగోల్డ్ నిందితులను ఏపీ సీఐడీ అరెస్టు చేయగా, అక్కడి ప్రభుత్వం ఆ సంస్థ ఆస్తులను సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో కూడా కేసులు నమోదవడంతో రాష్ట్ర సీఐడీని కూడా ఈ కేసు దర్యాప్తు చేయాలని వారంకిందట హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ కోర్టులో రాష్ట్ర పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అగ్రి నిందితులను పీటీ వారెంట్ మీద మూడు రోజులపాటు విచారించాలని సీఐడీ పోలీసులు కోరగా న్యాయస్థానం అంగీకరించింది. ఈ క్రమంలో అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావు, మేనేజింగ్ డెరైక్టర్ శేష నారాయణరావులను విచారించాలని సీఐడీ నిర్ణయించింది. ప్రస్తుతం ఏపీలోని ఏలూరు జైల్లో ఉన్న వారిద్దరినీ తీసుకొచ్చేందుకు సీఐడీ ప్రత్యేక బృందం మంగళవారమే బయలు దేరింది. బుధవారం నుంచి మూడు రోజులపాటు వారిని సీఐడీ అధికారులు విచారించనున్నారు. -
ఎగవేతదారులను అరెస్టు చేయండి
♦ అప్పుడే అన్ని విషయాలూ వెలుగులోకి వస్తాయి ♦ అక్షయ గోల్డ్ కేసులో తెలంగాణ సీఐడీకి హైకోర్టు సూచన సాక్షి, హైదరాబాద్: అక్షయగోల్డ్ డిపాజిట్ల ఎగవేతదారులను అరెస్ట్ చేసే విషయంలో చర్యలెందుకు చేపట్టలేదని హైకోర్టు తెలంగాణ సీఐడీ అధికారులను ప్రశ్నించింది. అక్షయ గోల్డ్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయకుండా మిమ్మల్ని ఎవరూ ఆపలేరంటూ సీఐడీని ఉద్దేశించి వ్యా ఖ్యానించింది. అరెస్ట్ చేస్తే అన్ని విషయాలూ వెలుగులోకి వస్తాయని, అగ్రిగోల్డ్ కేసులోనూ ఇదే జరిగిందని గుర్తు చేసింది. అక్షయగోల్డ్తో సంబంధం ఉన్న వారెవరైనా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే, దానిని వ్యతిరేకించడంతో పాటు, ఈ మొత్తం వ్యవహారాన్ని తాము పర్యవేక్షిస్తున్న విషయాన్ని సంబంధిత న్యాయస్థానాల దృష్టికి తీసుకురావాలని ఏపీ, తెలంగాణ సీఐడీ అధికారులకు తేల్చి చెప్పింది. కేసుకు సంబంధించిన వివరాలన్నింటినీ తమ ముందుంచాలని ఇరు రాష్ట్రాల సీఐడీ అధికారులకు సూచించింది. డిపాజిట్లను తిరిగి చెల్లించేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ ఓ కార్యాచరణ ప్రణాళికను తమ ముందుంచాలని అక్షయగోల్డ్ యాజమాన్యాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. చర్యలెందుకు తీసుకోలేదు? తమ నుంచి అక్షయగోల్డ్ యాజమాన్యం రూ.600 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసి, తిరిగి చెల్లించకుండా ఎగవేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ అక్షయ గోల్డ్ వినియోగదారుల, ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తెలుగు రామ మద్దయ్య, మరికొందరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. అక్షయగోల్డ్ వ్యవహారంలో వ్యవహారంలో ఇప్పటివరకు ఎంత మందిని అరెస్ట్ చేశారని ప్రశ్నించింది. దీనికి ఏపీ సీఐడీ తరఫున ఏఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ సమాధానమిస్తూ... 19 కేసుల్లో 28 మంది నిందితులున్నారని, ఇందులో 10మందిని అరెస్ట్ చేయగా, వారు బెయిల్ పొందారని, మిగిలినవారు ముందస్తు బెయిల్ పొందారని, ఇదంతా 2012లోనే జరిగిందని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. న్యాయస్థానాలు బెయిళ్లు ఇస్తుం టే ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించింది. బెయిళ్ల రద్దు కోసం ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. సదరు బెయిల్ మంజూరు ఉత్తర్వులను తమ ముందుంచాలంది. సహకరిస్తే కఠిన చర్యలు మోసం చేయడం ఎలాగో అగ్రిగోల్డ్‌లో నేర్చుకున్న తరువాత దాని నుంచి బయటకు వచ్చి అక్షయగోల్డ్ పెట్టినట్లు ఉన్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అక్షయగోల్డ్ యజమాన్యా న్ని ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేయలేదు కాబట్టి, ఆ పని మీరెందుకు చేయరని తెలంగాణ సీఐడీ అధికారులను ప్రశ్నించింది. దీనికి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్ స్పందిస్తూ... తెలంగాణలోనూ అక్షయగోల్డ్‌పై 8కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకోకుంటే దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తామని ధర్మాసనం తేల్చి చెప్పింది. అక్షయగోల్డ్ యాజమాన్యానికి ఎవరైనా సహకరిస్తున్నట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. -
విభజనకు సీఐడీ కార్యాలయం రెడీ
ప్రస్తుత డీజీపీ కార్యాలయంలోకి తెలంగాణ సీఐడీ విభాగం ఏసీ గార్డ్స్‌లోని సైబర్ క్రైమ్ భవనంలోకి ఏపీ సీఐడీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలీసు శాఖలో విభజన ప్రక్రియ జోరందుకుంది. రాష్ట్రంలో కీలకమైన నేర దర్యాప్తు సంస్థ (సీఐడీ)ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు విభజించే పని వేగవంతమైంది. అలాగే రెండు రాష్ట్రాలకు అధికారులు, సిబ్బంది, రికార్డుల విభజనకు అవసరమైన చర్యలను ఆ విభాగం అధిపతి టి.కృష్ణప్రసాద్ సోమవారం పూర్తి చేశారు. రాష్ట్ర పోలీస్ హెడ్‌క్వార్టర్స్ విభజనకు సంబంధించి ఇప్పటికే ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ సీఐడీ కార్యాలయంగా ప్రస్తుత డీజీపీ కార్యాలయంలోని మూడో అంతస్తును నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ సీఐడీ హెడ్‌క్వార్టర్స్‌ను ప్రస్తుతం ఏసీ గార్డ్స్‌లోని సీఐడీ సైబర్‌క్రైమ్‌తోపాటు మరికొన్ని విభాగాలు కొనసాగుతున్న భవనంలో ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ భవనం చిన్నగా ఉండటంతో దాని సమీపంలోనే మరో భవనాన్ని తాత్కాలికంగా తీసుకోవాలని నిర్ణయించారు. మరోవైపు మౌలికసదుపాయాలు, రికార్డులు, కంప్యూటర్లు, టేబుళ్లు, కుర్చీలతో పాటు అధికారులు, సిబ్బందిని కూడా పంపిణీ చేసే ప్రక్రియకు కృష్ణప్రసాద్ తుది మెరుగులు దిద్దారు. వీటిని ఆమోదానికి డీజీపీ ద్వారా గవర్నర్ నరసింహన్‌కు పంపినట్టు తెలిసింది.