
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అక్రమాల కేసులో ఐదుగురు నిందితులకు మల్కాజ్‌గిరి కోర్టు మరో 14 రోజుల పాటు రిమాండ్‌ను పొడిగించింది. నిందితుల్లో నలుగురిని చర్లపల్లి జైలుకు తరలించగా.. కవితను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. ఐదుగురు నిందితులు మల్కాజ్‌గిరి కోర్టులో మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా.. ఈ పిటిషన్‌పై వాదనలు రేపు వింటామని కోర్టు తెలిపింది.
కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ (ఐపీఎల్) యాజమాన్యాన్ని బెదిరించి.. అదనపు ప్రయోజనాలు పొందాలని చూసిన కేసులో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు జైలుపాలైన విషయం తెలిసిందే. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐడీ.. అధ్యక్షుడితో పాటు కోశాధికారి శ్రీనివాస్ రావు, సీఈఓ సునీల్ కంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితలను అరెస్టు చేసింది.