సాక్షి, టాస్క్ ఫోర్స్: చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌నాయుడు జన్మదినానికి చిత్తూరు మండలంలో రికార్డింగ్ డ్యాన్సులు వేసిన వీడియోలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో వీటిని పలువురు ట్రోల్ చేస్తున్నారు.
తొలుత పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనని ప్రకటించిన ఎమ్మెల్యే.. రూ.కోట్లు ఖర్చుచేసి రహస్యంగా వేడుకలు చేసుకున్నారు. నరిగపల్లెలోని ఓ టీడీపీ నేత ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జన్మదినాన రికార్డింగ్ డ్యాన్సులు, అశ్లీల నృత్యాలు నిర్వహించినట్లు వీడియోల్లో తెలుస్తోంది. అభివృద్ధి పనులంటే ఇవేనా అంటూ పలువురు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశ్నిస్తున్నారు.


