breaking news
recording dances
-
టీడీపీ అంటే తెలుగుదేశం డర్టీ పాలన: వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అంటే తెలుగుదేశం డర్టీ పాలన అని రుజువైంది అంటూ మండిపడ్డారు వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. మహిళలు సిగ్గుతో తలదించుకునే విధంగా సంక్రాంతికి సంబరాలు జరిగాయని ఆరోపించారు. అసాంఘిక కార్యకలాపాలకు పోలీసులను కాపలాగా పెట్టారని కూటమి సర్కార్‌పై నిప్పులు చెరిగారు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘డ్వాక్రా మహిళలకు చంద్రబాబు టోకరా వేశారు. డ్వాక్రా సంఘాలను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. 16,600 కోట్ల రుణాలను బ్యాంకులు తగ్గించేశాయి. మహిళలకు సున్నా వడ్డీకి రుణాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. మహిళలకు 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వాలి. సున్నా వడ్డీ కింద ఇవ్వాల్సిన 7000 కోట్లు బకాయిలు వెంటనే విడుదల చేయాలి. డ్వాక్రా మహిళలను ఏ విధంగా చంద్రబాబు మోసం చేశారో నాబార్డ్ నివేదికలు తెలియజేస్తున్నాయి. డ్వాక్రా మహిళలకు నాలుగు విడతల్లో వైఎస్ జగన్ రుణమాఫీ చేశారు. జగన్ హయాంలో సున్నా వడ్డీ రుణాలు మంజూరు అయ్యేవి. మహిళలు సిగ్గుతో తలదించుకునే విధంగా సంక్రాంతికి సంబరాలు జరిగాయి. కూటమి పాలనలో అశ్లీల నృత్యాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఏపీని మార్చారు.కూటమి నేతలు సంక్రాంతి.. సంస్కృతి సాంప్రదాయాలను మంటగలిపారు. మహిళా హోం మంత్రి ఉన్న రాష్ట్రంలో విచ్చలవిడిగా అశ్లీల నృత్యాలు, అర్ధనగ్న ప్రదర్శనలు జరిగాయి. రికార్డింగ్ డ్యాన్సులు, అర్ధనగ్న ప్రదర్శనలపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు?. బట్టలు విప్పి రికార్డింగ్ డ్యాన్సులు చేయాలన్న వారిని ఎందుకు నడి రోడ్డుపై నడిపించలేదు?. క్యాసినోలు, పేకాటలు ఆడిన వారిపై ఎందుకు కేసులు పెట్టలేదు. నడిరోడ్డుపై ఎందుకు నడిపించలేదు?. అసాంఘిక కార్యకలాపాలకు పోలీసులను కాపలాగా పెట్టారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
గలీజు కతలు.. కూటమి పెద్దలది ఎంత తెలివో!
ఆంధ్రప్రదేశ్‌లో జూదాల జాతర! రెండు వేల కోట్ల పందాలు! మందు బాబులకు పండగే! మూడు రోజుల్లో 438 కోట్ల రూపాయల మద్యం తాగేశారు! గోవా నుంచి క్లబ్ డాన్సర్లు! అశ్లీల నృత్యాలు! కాసినోలు, గుండాట! ఇలాంటి శీర్షికలతో మీడియాలో వచ్చిన వార్తలు చూస్తే ఏమనుకోవాలి? రాష్ట్రం ముందుకెళుతోందనా? లేక దిగజారిపోతోందనా?.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం వీటన్నింటినీ చోద్యం చూస్తున్నట్లు వ్యవహరించడం, వినోదమని ప్రచారం చేసుకోవడం, పరోక్షంగా సమర్థిస్తూండటం చూసి ప్రముఖ సామాజికవేత్త సునీత కృష్ణన్ చేసిన వ్యాఖ్యలు.. పరిస్థితి ఎంత నీచంగా ఉందో చెబుతున్నాయి. ‘ఏపీలో పలుచోట్ల రికార్డింగ్ డాన్సుల పేరుతో సాగుతున్న అనాగరిక చర్యలు మనిషికి ఉండవలసిన కనీస హుందాతనాన్ని దెబ్బతీస్తున్నాయి. యువతులతో అర్ధనగ్న నృత్యాలు చేయిస్తుంటే, సమాజం దానిని ఎంజాయ్ చేయడం భయానకం. ఇటువంటి అసహ్యకరమైన సంస్కతిని ఉపేక్షించకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మనవి" అని సునీత కృష్ణన్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు. సంక్రాంతి పండుగ పేరుతో ఏపీలో ఏ స్థాయిలో చట్ట వ్యతిరేక పనులు జరిగాయో, పోలీసు వ్యవస్థ ఎంత అచేతనంగా మిగిలిపోయిందో, భారతీయ సంస్కృతిని ఏ రకంగా పతనావస్తకు తీసుకువెళ్లింది.. అనేది సునీత చేసిన ఈ వ్యాఖ్య అద్దం పడుతుంది. హిందూ ధర్మ పరిరక్షణ అని స్వార్ధ రాజకీయాల కోసం నిత్యం ప్రచారం చేస్తున్న చంద్రబాబు, సనాతని వేషం కట్టి ప్రజలను మభ్య పెట్టే యత్నం చేసే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రెడ్‌బుక్ అంటూ అరాచకాలకు ప్రోత్సాహం ఇచ్చే మంత్రి లోకేశ్‌లకు ఏపీలో సంక్రాంతి పండుగ పూట మూడు రోజులపాటు సాగిన ఈ అకృత్యాలు ఏవీ కనిపించలేదు. కొందరు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, వారి అనుచరులు కొన్ని చోట్ల నిర్వహించిన అశ్లీల నృత్యాల భాగోతాలు, కోట్ల రూపాయల పందాలు, మద్యం పారించిన తీరు.. ఇన్ని జరిగాక కూడా ఏపీలో మంచి పాలన ఉందని ఎవరైనా చెప్పగలరా?.. వైసీపీ కార్యకర్తలు కొందరు కోడిని బహిరంగంగా కోయడం నేరం అంటూ కేసులు పెట్టి, హింసించి, రోడ్డు మీద నడిపించి శాడిజాన్ని ప్రదర్శించిన పోలీసులకు ఈ మూడు రోజులు సాగిన హింసాకాండ, అరాచకాలు, దందాలు కనిపించకపోవడం విశేషం. ఇలాంటి వాటిని అరికట్టవలసిన రక్షక భటులు, వాటికి రక్షణగా నిలబడ్డారు. యూట్యూబ్ జర్నలిస్టు ఒకరు ఈ వికృతాలను వివరిస్తూ ఉయ్యూరు వద్ద ఒక బరి ఏర్పాటు చేసి, గోవా నుంచి డాన్సర్లను అందుబాటులో ఉంచారని ఒకొక్కరి నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేశారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లాంటిచోట్ల కళ్లెదుటే క్యాంపులు కనిపించినా పోలీసులు కిమ్మనలేదు. కోనసీమ జిల్లాలో జనసేన ఎమ్మెల్యే అనుచరుడు ఒకరు క్లబ్ డాన్సర్ల పట్ల ఎంత అనుచితంగా వ్యవహరించింది తెలిపే వీడియో వైరల్ అయింది. కొందరు కోట్లలో పందాలు వేస్తే, ఎల్లో మీడియా నిస్సిగ్గుగా వాటిని పండగ, సంబరమంటూ ప్రొజెక్టు చేసింది. పందాలు అనేవి నిషేధం. ఏపీలో పందాల వార్తలు, ఎవరు ఎంత పందెం కాసిందీ బహిరంగంగా తెలిసినా పోలీసు వ్యవస్థ సంబంధం లేదన్నట్లు ప్రవర్తించిందంటే ఏమనుకోవాలి?.. ఎల్లో మీడియా అంచనా ప్రకారమే ఈ పందాల విలువ రూ.2,000 కోట్లు. తెలంగాణ వాసుల రాకతో జోష్ వచ్చిందని ఓ ఎల్లో పత్రిక సంబరపడింది. గుండాట, పేకాటలలోనే రూ.500 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.800 కోట్ల పందాలు జరిగాయట. బాపట్లలో రూ.200 కోట్ల కోడిపందాలు సాగాయి. తాడేపల్లిగూడెంలో ఒక్క పందంలో రూ.1.53 కోట్లు పెట్టారట. అందులో ఒక వ్యక్తి గెలిస్తే, మరో వ్యక్తి దానిని కోల్పోయారు. ఇలా పందాలలో ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యాయో చెప్పలేం. మొబైల్ వాన్లు తిప్పి మరీ మద్యాన్ని అధిక ధరలకు అమ్మించారట. వీటిలో ఏదీ చట్ట సమ్మతం కాదు. హైకోర్టు సైతం వీటిని అదుపు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయినా ప్రభుత్వానికి, పోలీసు వ్యవస్థకు చీమ కుట్టినట్లు కూడా లేకుండా పోయింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో గుడివాడలో ఒక టెంట్ వేసి కోడిపందాలు జరిపితే తెలుగుదేశం పార్టీ ఎంత గొడవ చేసింది అందరికి తెలుసు. అక్కడ క్యాసినో జరిగిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మాజీ మంత్రి కొడాలి నానిపై ఎల్లో మీడియా పలు ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేసింది. ఈసారి అంతకుమించి సెటప్‌లు పెట్టినా, ఎమ్మెల్యేలు స్వయంగా వీటిని పర్యవేక్షించినా ఈ ఎల్లో మీడియాకు సంబరంగా కనిపించింది. ఈ మొత్తం ప్రక్రియలో పోలీసులకు బాగా గిట్టుబాటైందని వార్తలు వచ్చాయి. జూదం, పందాలు, అశ్లీల నృత్యాలు విచ్చలవిడిగా సాగిపోతుంటే, వాటిని నిలుపుదల చేయడానికి ఆదేశాలు ఇవ్వవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిని డైవర్ట్ చేయడానికి మీడియాకు ఒక లీక్ ఇవ్వడం హైలైట్ గా చెప్పాలి. ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోతే మన జాతికి ఉనికి ఉండదని చంద్రబాబు అన్నారట. అన్ని జిల్లాలలో ఘనమైన ఆటపాటలు, ఉత్సవాలను ప్రభుత్వం ప్రోత్సహించిందట. రాష్ట్రంలోని పల్లెలు కళకళలాడాయట. చూడండి.. ఎంత తెలివో!.. ఒకపక్క అశ్లీల న్యత్యాలతో సంస్కృతిని నాశనం చేస్తుంటే, జూద పందాలతో ప్రజలు ఆర్ధికంగా చితికిపోతుంటే వాటి గురించి మాట మాత్రం వ్యాఖ్యానించకుండా.. ఈనాడు వంటి ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని సుభాషితాలు వల్లించినట్లు లీక్ ఇచ్చుకున్నారన్నమాట. ఇదంతా కేవలం జూద జాతరతో తనకు సంబంధం లేదని జనం అనుకోవాలన్నదే ఆయన ఉద్దేశం అన్నది తెలుస్తూనే ఉంది. ప్రభుత్వ పెద్దలు ఆదేశిస్తేనే పోలీసులు ఇలాంటి వ్యవహారాలను చూసిచూడనట్లు పోతారన్నది బహిరంగ రహస్యం. ఈసారి అది మరీ శృతి మించి ఇలాంటి అకృత్యాలకు పోలీసులే కాపలాగా ఉన్నారన్న అభిప్రాయం ప్రజలలో కలగడం అత్యంత దురదృష్టకరం. ఈ నేపధ్యంలో సునీతా కృష్ణన్ చేసిన ఒక్క వ్యాఖ్యతో రాష్ట్రం పరువు గంగలో కలిసింది. అశ్లీల నృత్యాల హోరులో బ్రాండ్ ఇమేజీ కొట్టుకు పోయింది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
టీడీపీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకల్లో రికార్డింగ్ డ్యాన్సులు
సాక్షి, టాస్క్ ఫోర్స్: చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్నాయుడు జన్మదినానికి చిత్తూరు మండలంలో రికార్డింగ్ డ్యాన్సులు వేసిన వీడియోలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో వీటిని పలువురు ట్రోల్ చేస్తున్నారు.తొలుత పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనని ప్రకటించిన ఎమ్మెల్యే.. రూ.కోట్లు ఖర్చుచేసి రహస్యంగా వేడుకలు చేసుకున్నారు. నరిగపల్లెలోని ఓ టీడీపీ నేత ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జన్మదినాన రికార్డింగ్ డ్యాన్సులు, అశ్లీల నృత్యాలు నిర్వహించినట్లు వీడియోల్లో తెలుస్తోంది. అభివృద్ధి పనులంటే ఇవేనా అంటూ పలువురు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశ్నిస్తున్నారు. -
సంక్రాంతి సంబురాలు.. అడ్డంగా దోచేస్తున్న కూటమి నేతలు
ఏపీలో సంక్రాంతి సంబురాలను కూటమి నేతలు పూర్తి జూదంగా మార్చేశారు. ప్రత్యేకించి.. టీడీపీకి చెందిన నేతలు ప్రజల పండుగను విపరీతంగా క్యాష్ చేసుకుంటున్నారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కోడిపందేలు ఆటలు నిర్వహిస్తున్నారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ అనుచరులతో నడిపిస్తున్నారు. మరోవైపు.. అర్ధరాత్రి దాకా అశ్లీల నృత్యాలను టీడీపీ, జనసేన నేతలు దగ్గరుండి నిర్వహిస్తుండడం చర్చనీయాంశమైంది. కూటమి నేతల ఆ దోపిడీ ఎలా ఉందంటే.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు, జూదంపై కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఆ జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు కట్టడి చేయాలని.. అవసరమైతే సెక్షన్ 144 అమలు చేయాలని సూచించింది. తమ ఆదేశాలు ఉల్లంఘించి కోడి పందేలు, జూదాలు నిర్వహిస్తే దాడులు చేసి డబ్బును సీజ్ చేయాలని కూడా ఆదేశించింది. కానీ.. కూటమి నేతలకు భయపడుతున్న పోలీసులు ఆ పక్కకు కూడా పోవడం లేదు. సీఎం సభ రేంజ్లో..ఒక పక్క.. ఉమ్మడి.. కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలు ఈ సంక్రాంతికి మునుపటిలాగే కోడిపందాలు, పేకాట, జూదానికి ప్రధాన అడ్డాలుగా మారాయి. సీఎం సభలకు వేసే జర్మన్ హ్యాంగర్స్ వేసి మరీ పందేల కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. మీడియాను బరుల చుట్టుపక్కలకూ కూడా రానివ్వడం లేదు. ఆఖరికి.. సెల్ఫోన్లతో వీడియోలు తీయకుండా ప్రైవేట్ సైన్యాన్ని ఏరపాటు చేస్తున్నారు. వీఐపీలు రిఫ్రెష్ కావడానికి కారవాన్లు ఏర్పాటు చేస్తున్నారు. కోడి పందాలతో పాటు పేకాట గుండాటతోపాటు మరికొన్ని ఆటలు నిర్వహిస్తున్నారు. గెలిచిన వారికి కార్లు, బైకులు బహుమతులుగా ఇస్తున్నారు. అలా కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. కేవలం మూడు రోజుల్లోనే రూ.2000 కోట్లకు దాకా జూద క్రీడలు నిర్వహించినట్లు సమాచారం. మరోవైపు.. ఏరులై పారతున్న..మరోవైపు.. కోడి పందేల బరుల దగ్గరే బెల్ట్ షాపులు వెలిశాయి. అవి వైన్ షాపులను తలపిస్తున్నాయి. కూటమి నేతలు, వాళ్ల అనుచరులే వాటిని నడిపిస్తున్నారు. మద్యం ప్రియుల వీక్నెస్ను క్యాష్ చేసుకుంటూ లిక్కర్‌ను ఏరులై పారిస్తున్నారు. లిక్కర్ క్వార్టర్ బాటిల్ మీద అదనంగా రూ.50 , బీర్ బాటిల్ పై రూ.100 వసూలు చేస్తున్నారు. తద్వారా కోట్ల రూపాయల్ని వెనకేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా.. ఎక్సైజ్ పోలీసులు ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు.డాన్స్ బేబీ డాన్స్ఇంకోవైపు.. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట యువతులతో రికార్డింగ్ డ్యాన్సులు చేయిస్తున్నారు. కూటమి నేతలైతే ఆ డ్యాన్సర్లతో కలిసి హుషారుగా గంతులేస్తున్నారు. కొందరైతే.. యువతులను దుస్తులు విప్పమంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో డాన్సర్లతో ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట, రాజోలు, అమలాపురం సహ పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి దాకా ఈ తంతు జరుగుతోంది. రాజోలులో ఎమ్మెల్యే వరప్రసాద్ అనుచరుడు దగ్గురుండి మరీ డ్యాన్సులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ అశ్లీల వ్యవహారాలను అడ్డుకోవాల్సిన పోలీసులు పత్తా లేకుండా పోయారు. నెట్టింట చర్చ.. రచ్చ..ఈ బాగోతాలపై నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. కోడి పందేలు, గుండాట.. ఆ ప్రాంగంలోనే మందు బాబుల వీరంగం తాలుకా వీడియోలు నెట్టింట కనిపిస్తున్నాయి. అశ్లీల నృత్యాలను ప్రస్తావిస్తూ.. తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు నెట్టింట పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. అదే సమయంలో.. వీటి కోసం తెలంగాణ నుంచి భారీగా తరలి వస్తున్నారనే విషయాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. మొత్తంగా కూటమి ప్రభుత్వం సంబురాల పేరిట గబ్బు పట్టిస్తోందని పలువురు మండిపడుతున్నారు. -
రికార్డింగ్ డ్యాన్సర్‌కు ముద్దు.. బూతు పాటతో ఎమ్మెల్యే రచ్చ
అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ యూబ్యూటర్‌పై ఏకంగా ఓ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తే మండిపడ్డారు. అలాంటిది ఒక ప్రజాప్రతినిధే బహిరంగంగా అశ్లీల నృత్యాలను ప్రొత్సహించడం.. అందునా ఆయనే అసభ్యంగా ప్రవర్తించడం.. పైగా వేదిక మీదే బూతు పాట పాడడంతో.. ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అని పలువురు నెట్టింట ప్రశ్నలు గుప్పిస్తున్నారు.బీహార్ జనతా దల్(యునైటెడ్) ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ నీరజ్ అలియాస్ గోపాల్ మండల్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. భగల్పూర్ జిల్లా నౌగాచియాలో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. అక్కడ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది.వేదిక మీద ఉన్న నృత్యకారిణి దగ్గరకు వెళ్లి.. ఆమె పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. కరెన్సీ నోటును ఆమె చెంపకు అతికించాడు. అక్కడితో ఆగకుండా.. నేను డ్యాన్స్ మాత్రమే చేయలేదు.. ఆమెను ముద్దు కూడా పెట్టుకున్నా అంటూ మైకులో ప్రకటించారు. ఇది ఇక్కడితోనే ఆగలేదు. రాత్రి సయమంలో జరిగిన వేడుకల్లోనూ ఆయన పాల్గొన్నారు. రికార్డింగ్ డ్యాన్సర్లతో చిందులేశారు. ఆపై మైక్ అందుకుని బూతు పాటలు పాడి అక్కడున్నవాళ్లను హుషారెత్తించారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో ఆర్జేడీ భగ్గుమంది. ఇలాంటి వాళ్లపై కేసులు నమోదు చేస్తారా? చర్యలు తీసుకుంటారా? అని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి ప్రజాప్రతినిధులపై కూడా న్యాయస్థానాలు తీవ్ర వ్యాఖ్యలు చేయాలని పలువురు కోరుకుంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.होली मिलन समारोह में जदयू विधायक गोपाल मंडल ने महिला डांसर के गाल पर नोट चिपकाया और साथ में मंच पर लगाए ठुमके।#Gopalmandal #Bihar #BiharNews #Bhagalpur #Holi2025 pic.twitter.com/ZBNs32uQz1— FirstBiharJharkhand (@firstbiharnews) March 10, 2025JDU विधायक गोपाल मंडल#gopalmandal @Jduonline @RJDforIndia #BiharNews #bhagalpur pic.twitter.com/1nikGeTmWV— Shri Dhiraj Sharma (Journalist) (@ShriDhiraj) March 11, 2025గోపాల్ మండల్ వార్తల్లోకి ఎక్కడం తొలిసారేం కాదు. గతంలో ఆయన అండర్వేర్పై రైలులో తిరిగి వైరల్ అయ్యారు. కొందరు ప్రయాణికులు ఆ చర్యను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ టైంలోనూ ఆయనపై విమర్శలు రాగా.. కంపార్ట్మెంట్లో మహిళలు లేరని, బాత్రూం వెళ్లాల్సి రావడంతో అలా వెళ్లానని అప్పుడు తన చర్యను సమర్థించుకున్నారాయన. -
హోం మంత్రి ఇలాకాలో.. అశ్లీల నృత్యాలు!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో అశీల్ల నృత్యాలు అంబరాన్నంటాయి. టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న పవిత్రమైన ఉపమాక వెంకన్న కల్యాణ్సోతవం కార్యక్రమంలో వెగటు పుట్టించే పాటలతో అమ్మాయిల డ్యాన్స్‌లతో అపచారానికి ఒడిగట్టారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా డీజే పేరుతో రికార్డింగ్ డ్యాన్సులను యథేచ్ఛగా నిర్వహించారు. సాక్షాత్తూ హోం మంత్రి నియోజకవర్గంలోనే ఈ కార్యక్రమం జరుగుతుండడంతో.. టీటీడీ అధికారులు గానీ, పోలీసులు గానీ ఈ రికార్డింగ్ డ్యాన్సులకు అడ్డుచెప్పే ధైర్యం చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ పెత్తనంతో.. నక్కపల్లి మండలం ఉపమాపకలో ఆరో శతాబ్ధానికి చెందిన వెంకన్న ఆలయానికి ఘన చరిత్ర ఉంది. 2017 సంవత్సరం వరకు దేవదాయ శాఖ ఆధీనంలో ఉండే ఈ ఆలయాన్ని తెలుగుదేశం ప్రభుత్వమే టీటీడీకి అప్పగించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలు, ధనుర్మాసోత్సవాలు, కల్యాణోత్సవాలు తిరుపతిలో మాదిరిగానే నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక పర్వదినాల్లో కేవలం ఆధ్యాత్మికమైన సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే ఇప్పటి వరకు టీటీడీ అధికారులు నిర్వహిస్తూ వచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తరువాత జరుగుతున్న ఈ ఉపమాక వెంకన్న కల్యాణోత్సవంలో టీడీపీ నేతల పెత్తనం పెచ్చుమీరింది. హోం మంత్రిగా అనిత బాధ్యతలు చేపట్టిన తరువాత ఉపమాక దేవస్థానంలో తెలుగుదేశం నేతల జోక్యం ఎక్కువైందన్న ఆరోపణలున్నాయి. టీటీడీ సంప్రదాయానికి తూట్లు.. వెంకన్న కల్యాణోత్సవ కార్యక్రమాన్ని అపవిత్రం చేసేలా టీడీపీ నేతలు రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించడంపై భక్తులు మండిపడుతున్నారు. కల్యాణోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి డీజే పేరుతో రికార్డింగ్ డ్యాన్స్‌ను ఏర్పాటు చేశారు. ఒకవైపు స్వామి వారి కల్యాణోత్సవం జరుగుతుండగా మరోవైపు ఆలయానికి ఆనుకుని వెనుక ప్రాంతంలో డీజే స్టేజ్ ఏర్పాటు చేసి అమ్మాయిలు, అబ్బాయిలతో అశ్లీల నృత్యాలు చేయించడం గమనార్హం. పైగా ఈ డ్యాన్స్ ప్రోగ్రాం కారణంగానే రాత్రి 9 గంటలకు పూర్తి కావాల్సిన ఎదురు సన్నాహక మహోత్సవంతో పాటు రథోత్సవం అర్థరాత్రి 12 వరకు ప్రారంభం కాలేదు. ఇక స్వామి వారి కల్యాణం అర్థరాత్రి 2 గంటల తర్వాత హోం మంత్రి అనిత వచ్చాక ప్రారంభించారు. ఇటువంటి రికార్డింగ్ డ్యాన్సుల కార్యక్రమానికి టీటీడీ అధికారులు ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. కానీ ఈసారి మాత్రం కల్యాణోత్సవం సందర్భంగా హోం మంత్రి అనిత సోమవారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు ఉపమాకలోనే తిష్టవేశారు. కల్యాణం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు, కల్పించిన సదుపాయాలు, ఇలా అన్నింటినీ ఆమె స్వయంగా పర్యవేక్షించారు. హోం మంత్రిగా అనిత బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా ప్రాచీన పుణ్య క్షేత్రంలో రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించడంపై భక్తులు దుమ్మెత్తి పోస్తున్నారు. -
కూటమి నేతల హల్చల్.. కోడి పందెం, రికార్డింగ్ డ్యాన్స్..
సాక్షి, కాకినాడ: ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మూడో రోజు యథేచ్ఛగా కోడి పందేలు(Kodi Pandem) కొనసాగుతున్నాయి. సంక్రాంతి సంబరాల పేరిట కూటమి నేతలు నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇదే సమయంలో పాఠశాలలను సైతం టీడీపీ నేతలు వదలడం లేదు. స్కూల్స్‌లో కూడా కోడి పందేలు నిర్వహిస్తున్నారు. దీంతో, స్థానికులు మండిపడుతున్నారు.ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడి పందేలు జోరుగా జరుగుతున్నాయి. కూటమి నేతలే దగ్గరుండి అన్ని కార్యక్రమాలను చూసుకుంటున్నారు. అలాగే, కోడి పందేల బరుల దగ్గర జూదం కోసం స్పెషల్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. అడ్డు అదుపు లేకుండా గుండాట, పేకాట, గ్యాంబ్లింగ్, లోనాబయటా ఆడిపిస్తున్నారు. ఇక, జూద క్రీడలు కూటమి నేతలకు కాసులు కురిపిస్తున్నాయి. పేకాట ఆడేవాళ్లకు దగ్గరుండి మద్యం సరఫరా చేయిస్తున్నారు కూటమి నేతలు.ఇదే సమయంలో కోడి పందేలా కోసం ప్రభుత్వ పాఠశాలలను సైతం కూటమి నేతలు వదిలిపెట్టడం లేదు. తుని రూరల్ వి.కొత్తూరులోని ప్రభుత్వ పాఠశాలలో కోడి పందేలు, జూదాలు నిర్వహించారు. ఇక, కూటమి నేతల ఒత్తిళ్ళతో కోడి పందేల వైపు పోలీసులు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఎక్కడ చూసినా జూదం ఆడుతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి టీడీపీ, జనసేన నేతలు కోడి పందేలు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. కోడి పందేల బరుల వద్ద బెట్టింగ్‌ల ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. జూద క్రీడలు, కోడి పందేల కోసం లక్షల్లో బెట్టింగ్ కాస్తున్నారు.ఇదిలా ఉండగా.. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు జనసేనలో కోడి పందేలు చిచ్చురేపాయి. రాజోలులో నడి రోడ్డుపై కోడి పందెం బరుల కోసం జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్‌పై టీడీపీ, జనసేన నాయకులు ఒత్తిడి తెచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే మాటలను బేఖాతరు చేస్తూ ఇష్టారీతిన బరులు ఏర్పాటు చేసుకున్నారు జనసేన, టీడీపీ నాయకులు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజోలులో విచ్చలవిడిగా కోడి పందేలు, గుండాట, రికార్డింగ్ డ్యాన్స్‌లు జరిగాయి. పలుచోట్ల రాత్రి సమయంలో కూటమి నేతలే రికార్డింగ్ డ్యాన్స్‌లను ప్రోత్సహించారు. ఇంతటితో ఆగకుండా కూటమి నేతలు మరింత హల్చల్ చేశారు. ఇటీవలి కాలంలో బౌన్సర్లు ఏర్పాటు సాధారణంగా మారిన నేపథ్యంలో కోడి పందేల బరుల వద్ద బౌన్సర్లను ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలో ఓ అడుగు ముందుకేసిన నిర్వాహకులు మహిళా బౌన్సర్లను రంగంలోకి దింపారు. -
టీడీపీ కార్యాలయంలో రికార్డింగ్ డ్యాన్స్‌లు.. ఐటమ్ సాంగ్‌లతో రెచ్చిపోయారు
మదనపల్లె(అన్నమయ్య జిల్లా): మదనపల్లె నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో రికార్డింగ్ డ్యాన్సులు, అమ్మాయిల నృత్యాలు హోరెత్తాయి. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మత్తెక్కించే, హుషారైన ఐటమ్ సాంగ్‌లతో రెచ్చిపోయారు. చదవండి: World Stroke Day: సమయం లేదు మిత్రమా! నిమ్మనపల్లె సర్కిల్, చిత్తూరు బస్టాండ్, బెంగళూరు బస్టాండ్, ఎన్టీఆర్ సర్కిల్లో జరిపిన వేడుకల్లో నడిరోడ్డుపైనే కార్యక్రమాలు ఏర్పాటుచేసి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించారు. శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే నాయకులు, అభిమానులు, కార్యకర్తల కోసం మాజీ ఎమ్మెల్యే రమేష్ ఏర్పాటు చేసిన రికార్డింగ్ డ్యాన్సులు పట్టణంలో చర్చనీయాంశమయ్యాయి. -
ఆదిలాబాద్: ఆఫీసర్స్ క్లబ్లో రికార్డింగ్ డ్యాన్సులు
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లోని ఆఫీసర్స్ క్లబ్లో రికార్డింగ్ డ్యాన్సుల తతంగం ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది. గత మూడు రోజుల క్రితం అధికార పార్టీకి చెందిన ఓ మాజీ కౌన్సిలర్ జన్మదిన వేడుకలను ఆఫీసర్స్ క్లబ్లో నిర్వహించారు. వేడుకల్లో రికార్డింగ్ డ్యాన్సు చేసేందుకు కొందరు మహిళలు మహారాష్ట్ర నుంచి వచ్చారు. బర్త్ డే వేడుకల్లో భాగంగా చిందులు వేస్తూ ఆనందంగా గడిపారు. ఆ నృత్యాలకు సంబంధించి వీడియో క్లిప్పింగ్‌లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ వేడుకలకు టీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీ నాయకులూ హాజరయ్యారు. రికార్డింగ్ డ్యాన్సులను తిలకించారు. కాగా, ఆఫీసర్స్ క్లబ్‌కు కలెక్టర్ చైర్‌పర్సన్‌గా, జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు. పుట్టినరోజు వేడుకలు, ఇతర శుభకార్యాలు మినహా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించరాదు. జిల్లా కేంద్రం మధ్యలోని ఈ క్లబ్లో రికార్డింగ్ డ్యా న్స్లతో వేడుకలు జరగడంపై పలువురు ఆశ్చర్యపోతున్నారు. క్లబ్ బీజేపీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకుడి పేరున బుకైనట్లు తెలిసింది. ఈ విషయమై కలెక్టర్ సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. -
టీడీపీ సమావేశంలో రికార్డింగ్ డ్యాన్స్‌లు
కొండపి: ప్రకాశం జిల్లా కొండపిలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో శనివారం నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో రికార్డింగ్ డ్యాన్స్‌లు ఏర్పాటు చేశారు. టీడీపీ సమావేశంతో పాటు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ సోదరుడు సత్య పుట్టినరోజు వేడుకలు సైతం జరిపారు. ప్రధాన నాయకులు వచ్చే వరకు మహిళలతో రికార్డింగ్ డ్యాన్స్‌లు వేయించారు. ఐటమ్ సాంగ్స్‌కు మహిళా డ్యాన్సర్లు చిందులేశారు. మహిళలతో టీడీపీ నాయకులు ఇలా రికార్డింగ్ డ్యాన్స్‌లు వేయించటం చూసి అక్కడి వారు ముక్కున వేలేసుకున్నారు. -
అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు.. రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాకం
హైదరాబాద్: నాగోల్‌లో రికార్డు డ్యాన్సులు కలకలం సృష్టించాయి. పీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ వార్సికోత్సవంలో అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించింది. అమ్మాయిలు మద్యం మత్తులో చిందులు వేశారు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు కంపెనీ యాజమాన్యం, ఈవెంట్ ఆర్గనైజర్లను అదుపులోకి తీసుకున్నారు. డాన్సర్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: బలవంతంగా విషం తాగించి హత్య.. కోర్టులో డీఎంకే ఎంపీ లొంగుబాటు -
టీఆర్ఎస్ నాయకుడి ఇంట్లో అర్థరాత్రి రికార్డింగ్ డ్యాన్స్‌లు
-
కొల్లేరు లంక గ్రామాల్లో అశ్లీల నృత్యాలు
సాక్షి, ఏలూరు : పవిత్రమైన పండుగ రోజున... కొల్లేరు లంక గ్రామాల్లో అశ్లీల నృత్యాలు కలకలం సృష్టించాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో శ్రీరామ నవమి రోజున రికార్డింగ్ డాన్సులు హోరెత్తించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... ఏలూరు మండలం గుడివాడ లంక గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో స్టేజ్‌పై అశ్లీల నృత్యాలు కొనసాగాయి.శ్రీరామ నవమి ఉత్సవాల పేరుతో..గ్రామ పెద్దలు రికార్డింగ్ డ్యాన్స్‌లు పెట్టించారు. ఇందుకోసం వేల్పూరు నుంచి కొంతమంది మహిళలను రప్పించారు. వారితో స్టేజ్‌పై రికార్డింగ్ డాన్సుల పేరుతో అశ్లీలంగా నృత్యం చేయించారు. కాగా పండుగ పూట రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేయడంపై స్థానిక మహిళలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేసినా...గ్రామ పెద్దలు పట్టించుకోలేదు. దీనిపై పోలీసులుకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని అయిదుగురు మహిళలు సహా 11మందిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమెదు చేశారు. -
మాయమాటలు... క్యాటరింగ్ పేరుతో అశ్లీల నృత్యాలు
సాక్షి, విజయవాడ : క్యాటరింగ్ పనుల పేరుతో ఓ మైనర్ బాలికతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నఇద్దరు వ్యక్తులను సింగ్ నగర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వివరాలు.. నగరంలోని సింగ్ నగర్ కు చెందిన దుర్గేశ్వరి కుమార్తె ఏడో తరగతి వరకు చదివింది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో చదువు మానేసి ఇంట్లోనే ఉంటోంది. దీంతో అదే ప్రాంతానికి చెందిన ఓ కేటరింగ్ సంస్థ నిర్వాహకుడు మోనీ తన వద్ద పని చేసేందుకు కూతురును పంపాల్సిందిగా దుర్గేశ్వరిని కోరాడు. కేటరింగ్ పనుల కోసం బాలికను 20 రోజుల కిందట విజయవాడ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు తీసుకెళ్ళాడు. మాయమాటలు చెప్పి అనకాపల్లికి చెందిన రికార్డింగ్ డ్యాన్స్ నిర్వాహకులు మైనర్ బాబు, సంధ్యలకు బాలికను అప్పగించాడు. అప్పటి నుంచి బాలికను తమ ట్రూప్‌లోని ఇతర యువతులతో కలిపి బలవంతంగా అశ్లీల నృత్యాలు చేయించడం మొదలు పెట్టారని పోలీసులు తెలిపారు. 20 రోజుల పాటు నరకం అనుభవించిన బాలిక ఆ గ్యాంగ్ నుండి తప్పించుకుని విజయవాడకు చేరుకుందనీ, అదేక్రమంలో బాలిక తల్లి కూడా తన కుమార్తె ఆచూకీ లభించడం లేదని ఫిర్యాదు చేసిందని సింగ్ నగర్ పోలీసులు వెల్లడించారు. ఈలోగా బాలిక కూడా ఇంటికి చేరడంతో.. విషయం తెలుసుకున్న పోలీసులు డాన్స్ ట్రూప్‌పై దాడి చేసి నిర్వాహకులు మైనర్ బాబు, సంధ్యలను అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో ప్రమేయమున్న మిగతావారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
క్యాటరింగ్ పేరుతో అశ్లీల నృత్యాలు
-
పశ్చిమగొదావరి జిల్లాలో అశ్లీల నృత్యాలు
-
నవమి వేడుకల్లో అశ్లీల నృత్యాలు
సాక్షి, కాకినాడ : భక్తి ముసుగులో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు అసాంఘీక కార్యాకలాపాలను ప్రోత్సహించారు. ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇలాకలో అశ్లీల నృత్యాలను నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం రావికంపాడు గ్రామంలోలో శ్రీరామ నవమి సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. అశ్లీల నృత్యాలు, గుండాటలు నిర్వహించినప్పటికీ తెలుగు తమ్ముళ్లపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. -
‘నా అనుభవం అంతలేదు ఆమె వయస్సు’
సాక్షి, గుంటూరు : పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అశ్లీల నృత్యాల ఘటనను ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై నన్నపనేని మాట్లాడుతూ.. ‘భీమవరం ఘటన జుగుప్సాకరంగా ఉంది. ఎక్కడా అలాంటి డాన్సులకు అనుమతించం’ అని స్పష్టం చేశారు. కాగా భీమవరం యూత్ క్లబ్ వార్షికోత్సవ కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సుల నిర్వహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొనటంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు ఏపీ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీపై నన్నపనేని రాజకుమారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను సురభి నాటకాల కంపెనీ ఆర్టిస్టులతో పోల్చడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. నా అనుభవం అంతలేదు ఆమె వయస్సు. అన్ని పార్టీలవారు మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నా పనితీరును అభినందిస్తున్నారు. పద్మశ్రీకి దమ్ము, ధైర్యం ఉంటే తనతో బహిరంగ చర్చకు రావాలి. విశాఖ జిల్లా పెందుర్తిలో దళిత మహిళపై జరిగిన దాడిని ఖండిస్తున్నా. ఆమెను పరామర్శించి, ప్రభుత్వ హామీ అమలు జరిగేలా చర్యలు తీసుకుంటా’ అని తెలిపారు. -
రికార్డింగ్ డ్యాన్సుల కోసం రోడ్డెక్కారు
-
రికార్డింగ్ డ్యాన్సుల కోసం రోడ్డెక్కారు
మేళ్లచెరువు: సంప్రదాయ ఉత్పవాల్లో అశ్లీల నృత్యాలు ఉండకూడదని అందరూ అనుకుంటారు. కానీ మహాశివరాత్రి ఉత్సవాల్లో రికార్డింగ్ డ్యాన్సులకు అనుమతి ఇవ్వాలని కొందరు రాస్తారోకో నిర్వహించడం విడ్డూరంగా ఉంది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా గ్రామంలోని దేవాలయంలో పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించటం ఇక్కడి ఆనవాయితీ. అయితే, ఈ ఉత్సవాల్లో అశ్లీల రికార్డింగ్ డాన్సులకు అనుమతిలేదు. దీంతో కొందరు గ్రామస్తులు గురువారం మధ్యాహ్నం కోదాడ-మేళ్లచెరువు రహదారి పై రాస్తారోకో చేపట్టారు. రికార్డింగ్ డాన్స్‌లకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరసన కారణంగా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడుతున్నారు. -
గణేష్ నిమజ్జనంలో అశ్లీల నృత్యాలు
- 9 మంది అరెస్ట్ తణుకు: గణేష్ నిమజ్జనంలో అశ్లీల నృత్యాలు జోరుగా సాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం కోనాల గ్రామంలో వినాయక నిమజ్జనోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అసభ్యకర నృత్యాలను మంగళవారం పోలీసులు అడ్డుకున్నారు. అశ్లీల నృత్యాలు చేస్తున్న నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరి తీసుకు వచ్చి నృత్యాలు చేయిస్తున్న ఐదుగురు నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సొమ్ములతో సరి.. చిందేసుకో మరి..!
యథేచ్ఛగా రికార్డింగ్ డ్యాన్సులు ఆర్కెస్ట్రాల ముసుగులో కార్యక్రమాలు పట్టించుకోని అధికారులు భీమవరం : డెల్టా ప్రాంతంలోని గ్రామాల్లో జాతరల సందర్భంగా రికార్డింగ్ డ్యాన్సు కార్యక్రమాలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల వీరవాసరం మండలంలోని ఓ గ్రామంలో జాతర సందర్భంగా రికార్డింగ్ డ్యాన్స్‌లు నిర్వహిస్తుండగా స్థానికులు పోలీసులకు ఫోన్ చేసినా పట్టించుకోలేదని, జాతర నిర్వాహకులు పోలీసులకు ముడుపులు అందజేయడమే కారణమనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కొద్దిరోజులుగా పెళ్లిళ్లు, జాతరలు, వేడుకల సమయంలో ఆర్కెస్ట్రాలు ఏర్పాటుచేస్తున్నారు. వీటిలో పాటలకు అనుగుణంగా యువతులతో నృత్యాలు చేయించి కుర్రకారును ఆకట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే కురచ దుస్తులతో యువతను పెడదారి పట్టించేలా డ్యాన్స్‌లు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇందుకు అధికార పార్టీ నాయకుల నుంచి ఒత్తిళ్లతో పాటు భారీగా ముడుపులు కారణంగా కొందరు చెబుతున్నారు. పాలకొల్లు సర్కిల్ పరిధిలో.. పాలకొల్లు పోలీసు సర్కిల్ పరిధిలోని ఒక గ్రామంలో కొద్దిరోజుల క్రితం జాతర నిర్వహించారు. గరగ నృత్యాలు, బాణసంచా కాల్పులతో పాటు రికార్డింగ్ డాన్సులు హోరెత్తాయి. అసభ్యకర నృత్యాలు చేయగా ఓ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీనిపై పోలీసు సిబ్బందిని ఆరా తీస్తే దీనిని ఆకతాయి పనిగా కొట్టిపారేసినట్టు చెబుతున్నారు. అదేరోజు రాత్రి 11 గంటల నుంచి వేకువజాము 3 గంటల వరకు రికార్డింగ్ డ్యాన్స్‌లు జరిగినట్టు ఆ గ్రామస్తులు చెబుతున్నారు. అయితే గ్రామంలోని కట్టుబాట్ల కారణంగా వారంతా మిన్నకుండిపోయారట. ఇక్కడ దీనిపై పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేయించాలని ఉన్న కట్టుబాట్లు కారణంగా విషయం బయటపడితే తమకు ఇబ్బందులు తప్పవని రికార్డింగ్ డ్యాన్స్‌లను వ్యతిరేకించే కొంతమంది యువకులు కిమ్మనకుండా మిన్నకుండి పోయినట్టు తెలిసింది. -
సత్యదేవుని ఆలయంలో రికార్డింగ్ డ్యాన్సులు
అన్నవరం కొండ మీద అపచారం అన్నవరం: తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో సత్యగిరి కొండపై ఉన్న హరిహరసదన్ సత్రంలో శనివారం తెల్లవారుజామున జరిగిన వివాహ వేడుకల్లో నిర్వాహకులు అపచారానికి పాల్పడ్డారు. సత్యదేవుని సన్నిధిలో డ్యాన్సర్లతో అశ్లీల నృత్యాలు చేయించారు. జిల్లాలోని తొండంగి మండలం దానవాయిపేట గ్రామానికి చెందిన టీడీపీ నేతకు చెందిన పెళ్లి వేడుక కావడంతో వారిని ఎవరూ నిలువరించలేకపోయారు. శనివారం తెల్లవారుజామున జరిగే గొల్లపల్లి సతీష్, దివ్యల వివాహం కో సం గత నెల 11న తొండంగి మండలం అద్దరిపేటకు చెందిన కోడె శేఖర్ ఈ స్థలాన్ని రిజర్వ్ చేసుకున్నారు. శుక్రవారం రాత్రి నుంచే వివాహ వేడుకలు ప్రారంభమయ్యా యి. ఒకవైపు పెళ్లి విందు జరుగుతుండగానే మరోవైపు స్టేజీ మీద సినిమా పాటలకు డ్యాన్సర్ల చేత అశ్లీల నృత్యాలు చేయించారు. దీనిపై దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు, కమిషనర్ వైవీ అనూరాధ ఈ విషయమై దేవస్థానం ఈవో నాగేశ్వరరావుకు ఫోన్ చేసి వివరాలడిగారు. చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్వాహకులపై తొండంగి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఈవో తెలిపారు. నృత్యాలను నిరోధించలే కపోయారన్న కారణంగా హరిహరసదన్ గుమస్తా ఎన్.గోవింద్, సెక్యూరిటీ గార్డ్ బహదూర్‌లను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. అదే విధంగా సూపరిం టెండ్ంట్ కృష్ణప్రసాద్‌తో పాటు మరో ఇద్దరికి మెమోలు ఇచ్చినట్లు తెలిపారు. -
అశ్లీలానికి అడ్డుకట్ట
చెన్నై: ఆలయ ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలకు అడ్డుకట్ట వేయాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. వివాదాలకు ఆస్కారం లేని రీతిలో భద్రత కల్పించడం, సంప్రదాయ, భక్తితో కూడిన నృత్యాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని సూచించింది. గ్రామాల్లో జరిగే ఆలయ వేడుకల్లో ఎవరికి వారు దూకుడుగా వ్యవహరించడం, వివాదాలకు దిగడం పరిపాటిగా మారింది. ఇటీవల కాలంగా ఆలయ ఉత్సవాల్లో వివాదం, రగడ అంటూ లేని ప్రదేశాలు లేవు. ప్రధానంగా ఈ వేడుకల్లో కరగాటం, కోలాటంలతో పాటుగా అశ్లీల నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయడం వలన ఆకతాయిల వీరంగాలు వివాదాలకు దారి తీస్తూ వస్తున్నాయి. ఈ వివాదాలకు తోడుగా సామాజిక వర్గాల మధ్య భగ్గుమనే ఆగ్రహం పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. భద్రతను ఎంత కట్టుదిట్టం చేసినా ఈ నృత్యాల రూపంలో వివాదాలు రాజు కుంటుండటంతో వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. ఈ క్రమంలో ఆలయ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ తిరుచంగోడుకు చెందిన దివాకర్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ మంగళవారం న్యాయమూర్తి సుందరేషన్ నేతృత్వంలోని బెంచ్ చేపట్టింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించాలే గానీ, వేడుకల పేరుతో అశ్లీల నృత్య ప్రదర్శనలు ఏర్పాట్లు చేస్తే కఠినంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. అశ్లీల నృత్యాలకు అడ్డుకట్ట వేస్తూ ఆదేశాలు ఇచ్చారు. అశ్లీల నృత్యాలు, ప్రదర్శనలకు ఏర్పాటు చేస్తే నిర్వాహకుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. -
పండగ సంబరాల్లో.. ఎమ్మెల్యే డాన్సులు
పెద్ద పండగ అంటే చాలు.. కోనసీమలో సంబరాలు మిన్నంటుతాయి. ఆ సంబరాలకు చిన్నా పెద్దా తేడా ఉండదు. అందుకే ఓ ఎమ్మెల్యే గారు చిందేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి... పండుగ సందర్భంగా నిర్వహించిన రికార్డింగు డ్యాన్సులో డాన్సర్లతో కలిసి బ్రహ్మాండంగా స్టెప్పులేశారు. 'నీ ఇల్లు బంగారం కాను.. నా ఒళ్లు సింగారం కాను' అనే పాటకు డాన్సులు చేసి తన ప్రతిభను నిరూపించుకున్నారు. పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లిలో జరిగిన రికార్డింగ్ డ్యాన్సులలో ఆయన కూడా పాల్గొని అక్కడున్న అమ్మాయిలతో చేతులు కలిపి డాన్సులు చేశారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోనసీమలో యథేచ్ఛగా కోడిపందాలు, గుండాటలు, రికార్డింగ్ డాన్సులు జరిగాయి. సాధారణంగా రాత్రిపూట నిర్వహించే రికార్డింగ్ డ్యాన్సులు ఈసారి అధికార పార్టీ నేతల అండదండలతో పగలే మొదలు పెట్టేశారు. వాడ్రేవుపల్లి. మగటనల్లి, కేశనపల్లి, శంకరగుప్తంలలో అశ్లీల నృత్యాలు చోటుచేసుకున్నాయి. వాడ్రేవుపల్లిలో జరిగిన రికార్డింగ్ డ్యాన్సులో పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పాల్గొన్నారు. సాక్షాత్తు ఎమ్మెల్యే డ్యాన్స్ చేయడంతో అక్కడున్న వారు విస్తుపోయారు. -
కోనసీమలో జోరుగా అశ్లీల నృత్యాలు
ఎప్పుడూ పచ్చదనంతో కళకళ్లాడే కోనసీమ అశ్లీల నృత్యాల అడ్డాగా మారిపోయింది. తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలోని మగటపల్లి, కేశనపల్లి, శంకరగుప్తంలలో యథేచ్ఛగా రికార్డింగ్ డాన్సులు జరుగుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలావుంటే ఇక రాష్ట్ర పరిస్థితేంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ కొంత మంది రాజకీయ నాయకులకు తెలిసి జరుగుతున్న వ్యవహారాలేననేది ఇక్కడ బహిరంగ రహస్యమే. అశ్లీల నృత్యాలు పతాక స్థాయికి చేరినప్పటికీ పోలీసులు తమకు పట్టనట్టు వ్యవహరించడం కొసమెరుపు. -
రికార్డింగ్ డాన్సులు అడ్డుకున్న పోలీసులు
విశాఖ : విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం హరిపురంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గ్రామ దేవత సంబరాల్లో భాగంగా గ్రామస్తులు రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేశారు. అయితే అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవటంతో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. రికార్డింగ్ డాన్సులకు అనుమతి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. -
చిందేసిన తెలుగు తమ్ముళ్లు
-
చిందేసిన తెలుగు తమ్ముళ్లు
ఒంగోలు : ప్రకాశం జిల్లా కనిగిరిలో టీడీపీ కార్యకర్తలు తమదైన శైలిలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేసి రికార్డింగ్ డ్యాన్స్‌ల్లో మునిగి తేలారు. చాలాసేపు అమ్మాయిలు చిందులేస్తుంటే... నేతలు, కార్యకర్తలు నేత్రానందం పొందారు. అయితే మండల అధ్యక్షుడు బేరి పుల్లారెడ్డి, పామూరు సర్పంచ్ మనోహర్ ఓ అడుగు ముందుకు వేసి వేదిక పైకి ఎక్కి అమ్మాయిలతో కలిసి చిందులేశారు. మమ్మల్ని చూడండి....మా పార్టీ తీరు చూడండంటూ చిందులేశారు. అమ్మాయిల చేతులు పట్టుకుని ఊగిపోయారు. ఓ నేత అయితే ఏకంగా నృత్యం చేస్తున్న అమ్మాయి మెడలో పూలమాల వేసి మరీ ఆనందపడ్డాడు. కాగా ఈ ఘటనపై పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నా బయటకు మాత్రం ఏమీ మాట్లాడటం లేదు. ఓ వైపు పార్టీ నేత నీతులు చెబుతుంటే...మరోవైపు తెలుగు తమ్ముళ్ల తీరును చూసి ముక్కన వేలేసుకుంటున్నారు.


