టీడీపీ సమావేశంలో రికార్డింగ్‌ డ్యాన్స్‌లు  | Recording dances at TDP meeting in Kondapi | Sakshi
Sakshi News home page

టీడీపీ సమావేశంలో రికార్డింగ్‌ డ్యాన్స్‌లు 

Mar 6 2022 5:11 AM | Updated on Mar 6 2022 8:21 AM

Recording dances at TDP meeting in Kondapi - Sakshi

టీడీపీ సమావేశంలో రికార్డింగ్‌ డ్యాన్స్‌

కొండపి: ప్రకాశం జిల్లా కొండపిలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో శనివారం నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో రికార్డింగ్‌ డ్యాన్స్‌లు ఏర్పాటు చేశారు. టీడీపీ సమావేశంతో పాటు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ సోదరుడు  సత్య పుట్టినరోజు వేడుకలు సైతం జరిపారు.  ప్రధాన నాయకులు వచ్చే వరకు మహిళలతో రికార్డింగ్‌ డ్యాన్స్‌లు వేయించారు. ఐటమ్‌ సాంగ్స్‌కు మహిళా డ్యాన్సర్లు చిందులేశారు. మహిళలతో టీడీపీ నాయకులు ఇలా రికార్డింగ్‌ డ్యాన్స్‌లు వేయించటం చూసి అక్కడి వారు ముక్కున వేలేసుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement