‘మీరు కొడితే కేసుండదు, వారు కొడితే కేసులే ’ | TDP MLA Ugra Narasimha Reddy comments go viral on social media | Sakshi
Sakshi News home page

‘మీరు కొడితే కేసుండదు, వారు కొడితే కేసులే ’

Nov 25 2026 4:49 AM | Updated on Nov 25 2026 4:49 AM

TDP MLA Ugra Narasimha Reddy comments go viral on social media

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన టీడీపీ ఎమ్మెల్యే ఉగ్ర వ్యాఖ్యలు 

సాక్షి టాస్క్‌ఫోర్స్:  ‘మీరు కొడితే కేసుండదు. వాళ్లు కొడితే మాత్రం కేసులే’ అంటూ మార్కాపురం జిల్లా కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. టీడీపీవారు వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు చేస్తే కేసులు ఉండవు ..అదే వైఎస్సార్‌సీపీ నాయకులు టీడీపీ వారిపై దాడి చేస్తే కేసులు ఉంటాయి.. అని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై ప్రజలు భగ్గుమంటున్నారు. పంచాయతీ ఎన్నికల వేళ రెచ్చగొట్టే ధోరణితో వ్యాఖ్యలు చేయడమేంటని మండిపడుతున్నారు. 

పామూరు మండలం దూబగుంట్ల పంచాయతీ వెంకటాపురంలో సోమవారం రాత్రి  ఆత్మీయ సమావేశం పేరిట టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచార సమావేశం నిర్వహించారు. ‘ సీఎం రిలీఫ్‌ ఫండ్‌ గానీ, ఏ పనైనా, ఏది కావాలన్నా..పనవుతుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మీరు కొడితే కేసుండదు, వాళ్లు కొడితే కేసుంటుంది. మీరు, వాళ్లు భయపెడుతున్నారు, వీళ్లు భయపెడుతున్నారు అనవద్దు. 

ఆల్రెడీ నేను చెప్పాశా..ఎవరూ కంగారుపడవద్దు. అంతగా అవసరమైతే మీ అధ్యక్షుడు మీ బూత్‌ దగ్గర కూర్చుంటాడు’ అంటూ సమావేశానికి హాజరైన టీడీపీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి ఎమ్మెల్యే మాట్లా­డారు. ఇటీవల జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను కనీసం నామినేషన్లు వేయనీయకుండా టీడీపీ, బీజేపీ, జనసేన, పోలీసులు అడ్డుకోవడంతో పాటు జెడ్పీటీసీ ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement