రికార్డింగ్‌ డ్యాన్సుల కోసం రోడ్డెక్కారు | villagers rasta roko for recording dances in mahashivaratri celebrations | Sakshi
Sakshi News home page

రికార్డింగ్‌ డ్యాన్సుల కోసం రోడ్డెక్కారు

Feb 23 2017 4:40 PM | Updated on Oct 8 2018 7:04 PM

రికార్డింగ్‌ డ్యాన్సుల కోసం రోడ్డెక్కారు - Sakshi

రికార్డింగ్‌ డ్యాన్సుల కోసం రోడ్డెక్కారు

సంప్రదాయ ఉత్పవాల్లో అశ్లీల నృత్యాలు ఉండకూడదని అందరూ అనుకుంటారు.

మేళ్లచెరువు: సంప్రదాయ ఉత్పవాల్లో అశ్లీల నృత్యాలు ఉండకూడదని అందరూ అనుకుంటారు. కానీ మహాశివరాత్రి ఉత్సవాల్లో రికార్డింగ్‌ డ్యాన్సులకు అనుమతి ఇవ్వాలని  కొందరు రాస్తారోకో నిర్వహించడం విడ్డూరంగా ఉంది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మహాశివరాత్రి సందర్భంగా గ్రామంలోని దేవాలయంలో పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించటం ఇక్కడి ఆనవాయితీ.
 
అయితే, ఈ ఉత్సవాల్లో అశ్లీల రికార్డింగ్ డాన్సులకు అనుమతిలేదు. దీంతో కొందరు గ్రామస్తులు గురువారం మధ్యాహ్నం  కోదాడ-మేళ్లచెరువు రహదారి పై రాస్తారోకో చేపట్టారు. రికార్డింగ్‌ డాన్స్‌లకు అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నిరసన కారణంగా భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement