breaking news
hca scam
-
హెచ్‌సీఏ అక్రమాల కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అక్రమాల కేసులో ఐదుగురు నిందితులకు మల్కాజ్గిరి కోర్టు మరో 14 రోజుల పాటు రిమాండ్‌ను పొడిగించింది. నిందితుల్లో నలుగురిని చర్లపల్లి జైలుకు తరలించగా.. కవితను చంచల్‌గూడ మహిళా జైలుకు తరలించారు. ఐదుగురు నిందితులు మల్కాజ్గిరి కోర్టులో మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోగా.. ఈ పిటిషన్‌పై వాదనలు రేపు వింటామని కోర్టు తెలిపింది.కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ (ఐపీఎల్) యాజమాన్యాన్ని బెదిరించి.. అదనపు ప్రయోజనాలు పొందాలని చూసిన కేసులో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు జైలుపాలైన విషయం తెలిసిందే. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐడీ.. అధ్యక్షుడితో పాటు కోశాధికారి శ్రీనివాస్ రావు, సీఈఓ సునీల్ కంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితలను అరెస్టు చేసింది. -
HCA Scam: నిజమైన ఓటర్లకు బదులు ఐఏఎస్, ఐపీఎస్‌లతో..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అక్రమాల కేసులో సీఐడీ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా హెచ్‌సీఏ ఎన్నికలపై దర్యాప్తు చేపట్టిన సీఐడీ.. అధ్యక్షుడిగా జగన్మోహనరావు దొడ్డిదారిన ఎంపికైనట్లు గుర్తించింది. 23 ఇన్స్టిట్యూషన్లకు సంబంధించిన ఓట్లను అతడు అక్రమంగా వేయించుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఓట్ల ద్వారానే అతడు గెలిచినట్లు తేలింది.ఇలా పలు ఇన్స్టిట్యూషన్స్ తరఫున తరఫున ప్రతినిధులను ఓటింగ్‌కు అర్హులుగా చేసి.. నిజమైన ఓటర్లకు బదులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఓట్లు వేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ గత ఎన్నికల్లో ఎవరెవరు ఓట్లు వేశారో.. వారిని విచారించేందుకు సీఐడీ రంగం సిద్ధం చేసింది. ఎవరి ఒత్తిడితో వీరు ఓట్లు వేశారు అనేదానిపై విచారణ చేపట్టింది.కాగా ఐపీఎల్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ యాజమాన్యాన్ని బెదిరించి.. అదనపు ప్రయోజనాలు పొందాలని చూసిన హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు జైలుపాలైన విషయం తెలిసిందే. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీఐడీ అధ్యక్షుడితో పాటు కోశాధికారి శ్రీనివాస్ రావు, సీఈఓ సునీల్ కంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితలను కూడా సీఐడీ అరెస్టు చేసింది. అంతేకాదు.. ఈ అక్రమాల కేసులో రాజకీయ నాయకుల ప్రమేయంపై కూడా విచారణ జరపాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఇటీవల మరోసారి సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత పేర్లను సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో టీసీఏ ప్రస్తావించింది. తాజాగా పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఓట్లు వేసినట్లు గుర్తించడం గమనార్హం. -
HCA Scam: ఉప్పల్ సీఐ ఎలక్షన్‌రెడ్డి సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ సీఐ ఎలక్షన్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) స్కామ్‌లో ప్రమేయం ఉందని తేలడంతో ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హెచ్‌సీఏ జనరల్ సెక్రెటరీ దేవరాజు అరెస్టుకు సీఐడీ రంగం సిద్ధం చేసింది. దేవ్‌రాజ్‌కు సహకరించిన ఎలక్షన్‌రెడ్డి.. సీఐడీ సమాచారాన్ని ముందుగానే లీక్ చేశారు. సీఐడీ సమాచారాన్ని దేవరాజుకు ముందుగా లీక్ చేసినందుకు ఎలక్షన్‌రెడ్డిని సస్పెండ్ అయ్యారు.మరోవైపు, హెచ్‌సీఐ అక్రమాలపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) మరోసారి సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయంపై కూడా విచారణ జరపాలని కోరింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత పేర్లను సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో టీసీఏ ప్రస్తావించింది.తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు సీఐడీ అడిషనల్ డీజీ చారుసిన్హాను కలిశారు. ఈ సందర్భంగా.. హెచ్‌సీఏ అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని టీసీఏ ఆరోపించింది. జగన్మోహన్రావుతో పాటు మరికొందరు అక్రమార్కులు కూడా ఉన్నారని.. వాళ్లపై కూడా దర్యాప్తు చేయాలని కోరింది. జాన్ మనోజ్, విజయానంద్, పురుషోత్తం అగర్వాల్, సురేందర్ అగర్వాల్, వంకా ప్రతాప్‌లపై కూడా టీసీఏ ఫిర్యాదు చేసింది.కాగా.. హెచ్‌సీఏ- ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ వివాదం నేపథ్యంలో అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావును సీఐడీ ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు కోశాధికారి శ్రీనివాస్ రావు, సీఈఓ సునీల్ కంటే, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేందర్ యాదవ్, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవితలను కూడా అరెస్టు చేశారు. ఈ క్రమంలో జగన్మోహన్ రావు అక్రమ పద్ధతిలో హెచ్‌సీఏలోకి ప్రవేశించినట్లు సీఐడీ గుర్తించింది. ఈ నేపథ్యంలో మల్కాజిగిరీ కోర్టు నిందితులకు పన్నెండు రోజుల రిమాండ్ విధించింది. -
అక్కడ అద్భుతం- ఇక్కడ అవినీతిమయం
ఢిల్లీ: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో అక్రమాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. హెచ్‌సీఏలో వివేక్ అవినీతికి పాల్పడుతున్నాడని, ఇప్పటికి రూ.12 కోట్లు దోచుకున్నాడని అన్నారు. ఆర్బిట్రేషన్ పేరుతో రూ.25 కోట్లకు స్కెచ్ వేశారన్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అద్భుతంగా పనిచేస్తుంటే హెచ్ సిఎ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్‌సీఏ అక్రమాలపై దృష్టి పెట్టాలని వీహెచ్ విజ్ఞప్తి చేశారు. -
ఎన్నికలు పెట్టండి.. ఫలితాలు ఇప్పుడే వద్దు
-
ఎన్నికలు పెట్టండి.. ఫలితాలు ఇప్పుడే వద్దు
హైదరాబాద్: హెచ్‌సీఏ ఎన్నికలకు హైకోర్టు పచ్చ జెండా ఊపింది. అయితే ఫలితాలు మాత్రం ఇప్పుడే వెల్లడించొద్దని ఆంక్షలు విధించింది. ఈ నెల 15న ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. హెచ్‌సీఏ కొత్త కమిటీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా అలా చేయకపోవడంతోపాటు, పదవీకాలం ముగిసినా అధ్యక్షుడిగా ఉన్న అర్షద్ అయూబ్ కొనసాగతుండటంపై హైకోర్టు గతంలో తీవ్రంగా మండిపడింది. హెచ్‌సీఏలో కోట్లాది రూపాయల దుర్వినియోగానికి పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న అర్షద్ పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్ 7నే ముగిసింది. అయినప్పటికీ ఆయన పదవిలో కొనసాగారు. దాదాపు రూ.120 కోట్ల కుంభకోణం జరిగినట్లు డిలైట్ సంస్థ దర్యాప్తులో తేలింది. దీంతో హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్ అయుబ్, సెక్రటరీ జాన్ మనోజ్ పై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. మరోపక్క, లోధా కమిటీ సిఫారసు ప్రకారం హెచ్‌సీఏ ఎన్నికలు ఇప్పటికే పూర్తి చేయాల్సి ఉన్నా అలా చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ హెచ్‌సీఏ ఎన్నికల్లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ కూడా పాల్గొంటున్నారు. హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి ఇప్పటికే అజహర్ నామినేషన్ వేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అజహర్‌పై బీసీసీఐ 2000 సంవత్సరంలో జీవితకాలం నిషేధం విధించగా, దాదాపు 12 ఏళ్ల తర్వాత ఏపీ హైకోర్టు బోర్డు నిర్ణయాన్ని తప్పు పడుతూ అజహర్‌ను నిర్దోషిగా తేల్చింది. అయితే ఆ తర్వాత కూడా బీసీసీఐ అధికారికంగా అజహర్‌పై నిషేధాన్ని ఎత్తివేయలేదు. ఆయన పోటీకి బీసీసీఐ అనుమతిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది. -
హెచ్‌సీఏలో భారీ కుంభకోణం!
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో భారీ కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు రూ.120 కోట్ల కుంభకోణం జరిగినట్లు డిలైట్ సంస్థ దర్యాప్తులో వెల్లడి కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్ అయుబ్, సెక్రటరీ జాన్ మనోజ్ పై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. గత శుక్రవారం కూడా హెచ్‌సీఏ సభ్యులపై ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. గత నెల 20వ తేదీన నిర్వహించిన హెచ్‌సీఏ సర్వసభ్య సమావేశంలో రోజూవారీ బాధ్యతల నిర్వహణకై అడ్‌హక్ కమిటీ చైర్మన్‌గా ప్రకాష్‌చంద్ జైన్ (56)ను నియమించారు. ఈ నెల 5వ తేదీన, 16వ మరోసారి విధుల నిమిత్తం స్టేడియంలోకి వెళ్లడానికి ప్రయత్నించగా అక్కడ వుండే సెక్యూరిటీ లోనికి వెళ్లకుండా తనను అడ్డుకున్నారని, కుట్ర జరుగుతుందంటూ ప్రకాష్‌చంద్ ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కుంభకోణం జరిగినట్లు ప్రైవేట్ సంస్థ దర్యాప్తులో వెల్లడికావడం పలు అనుమానాలకు దారితీసింది. -
క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)లో భారీ కుంభకోణం