అక్కడ అద్భుతం- ఇక్కడ అవినీతిమయం | corruption in HCA: VH | Sakshi
Sakshi News home page

అక్కడ అద్భుతం- ఇక్కడ అవినీతిమయం

Jan 8 2018 6:50 PM | Updated on Sep 4 2018 5:07 PM

ఢిల్లీ: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌(హెచ్‌సీఏ)లో అక్రమాలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. హెచ్‌సీఏలో వివేక్ అవినీతికి పాల్పడుతున్నాడని, ఇప్పటికి రూ.12 కోట్లు దోచుకున్నాడని అన్నారు. ఆర్బిట్రేషన్ పేరుతో రూ.25 కోట్లకు స్కెచ్ వేశారన్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అద్భుతంగా పనిచేస్తుంటే హెచ్ సిఎ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్సీఏ అక్రమాలపై దృష్టి పెట్టాలని వీహెచ్‌ విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement