నర్సాపూర్‌లో మంత్రి వివేక్ పర్యటనలో రచ్చ రచ్చ | Argument Between Minister Vivek And Sunitha Lakshma Reddy In Narsapur | Sakshi
Sakshi News home page

నర్సాపూర్‌లో మంత్రి వివేక్ పర్యటనలో రచ్చ రచ్చ

Apr 25 2026 2:34 PM | Updated on Apr 25 2026 2:50 PM

Argument Between Minister Vivek And Sunitha Lakshma Reddy In Narsapur

సాక్షి, మెదక్ జిల్లా: నర్సాపూర్‌లో మంత్రి వివేక్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నిలదీశారు. మహిళలకు నెలకు రూ. 2500 రూపాయలు ఇస్తామన్న హామీ ఏమైందంటూ ఆమె ప్రశ్నించారు. దీంతో కేసీఆర్ వేల కోట్ల రూపాయలు అప్పు చేశారంటూ వివేక్‌ బదులిచ్చారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు కూడా గత ప్రభుత్వం, కేసీఆర్ చేసిన నిర్వాకమే కారణమని మంత్రి వివేక్ చెప్పడంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం రచ్చరచ్చగా మారింది. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ నచ్చజెప్పినా కూడా మంత్రి, ఎమ్మెల్యే పట్టించుకోలేదు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల నాయకులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఇరు పార్టీల నాయకులను అదుపుచేయలేక పోలీసులు నానా తంటాలు పడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement