న్యూయార్క్‌లో జరిగిన టైమ్100 సమ్మిట్‌లో నీతా అంబానీ, సెలబ్రిటీ చెఫ్ వికాస్ ఖన్నాకు ఇచ్చిన బహుమతి అందరి దృష్టిని ఆకర్షించింది. 2026 సంవత్సరానికి గాను టైమ్100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా గౌరవాన్ని అందుకున్న వికాస్ ఖన్నాకు మరో అరుదైన సత్కారం అందుకోవడం విశేషంగా నిలిచింది.
వికాస్ ఖన్నాకు అరుదైన గౌరవం
ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా 2026 సంవత్సరానికి గాను TIME మ్యాగజైన్ 'ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల' జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా న్యూయార్క్‌లో జరిగిన కార్యక్రమంలో నీతా అంబానీ ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా'స్వదేశ్' (Swadesh) సంస్థ తరపున రూపొందించిన ఒక అద్భుతమైన నెమలి ఆకారపు బ్రోచ్‌ను వికాస్ ఖన్నాకు బహుమతిగా ఇచ్చారు. భారతదేశపు గొప్ప కళా వారసత్వానికి ప్రతీకగా, భారత జాతీయ పక్షి అయిన నెమలి ఆకారంలో ఉన్న బ్రోచ్‌ను అందించడం విశేషం.
ఇదీ చదవండి: రూ. 130 కోట్ల మాజీ క్రికెటర్ లగ్జరీ బంగ్లా : అదుర్స్
నీతా అంబానీ స్వయంగా ఆ బ్రోచ్‌ను వికాస్ ఖన్నా కోటుకు తగిలించారు. ఈ సమయంలో వికాస్ ఖన్నా ఆమె పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పంచుకుంటూ తన సంతోషాన్ని వెలుబుచ్చారు వికాస్‌ఖన్నా. "రేపు నేను TIME100 వేడుకకు వెళ్తున్నప్పుడు, నా వెంట తరతరాల కళాకారుల నైపుణ్యాన్ని, వంటగది కథలను తీసుకెళ్తున్నాను. నీతా అంబానీ బహుకరించిన 'స్వదేశ్' నెమలి బ్రోచ్‌ను ధరించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఇది మన గ్రామాల్లోని కళాకారుల ప్రతిభకు, భారతీయ సంప్రదాయాలకు దక్కిన గుర్తింపు." అంటూ భారతీయ కళాకారులకు సాధికారత కల్పిస్తున్న స్వదేశ్ కార్యక్రమాన్ని ప్రశంసించారు. భారతీయ కళలను ప్రపంచ వేదికపై ప్రోత్సహిస్తున్న నీతా అంబానీ చొరవను , వికాస్ ఖన్నా సాధించిన విజయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
కాగా TIME100 2026 జాబితాలో వికాస్ ఖన్నాతో పాటు మరికొందరు ప్రముఖులు చోటు దక్కించుకున్నారు. రాల్ఫ్ లారెన్ మరియు విక్టోరియా బెక్హాం వంటి ప్రపంచ స్థాయి వ్యక్తులతో పాటు వికాస్ ఖన్నా నిలిచారు. ఈ విస్తృతమైన టైమ్100 జాబితాలో నటుడు రణబీర్ కపూర్, సుందర్ పిచాయ్, న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బిలియనీర్ ఎలాన్ మస్క్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ఉన్నారు.
ఇదీ చదవండి: అంత్యక్రియల్లో బార్ గర్ల్స్ డ్యాన్స్.. అసలు విషయం ఇదీ!


