ఎప్పుడూ వేసవే..! | Yuma The Hottest City On Earth Where It’s Summer Almost All Year Round, Read Story For More Details | Sakshi
Sakshi News home page

ఎప్పుడూ వేసవే..! గిన్నిస్‌ బుక్‌లో సైతం..

Apr 25 2026 5:08 PM | Updated on Apr 26 2026 9:51 AM

Understanding the heat in Yuma How It Really

పిల్లలూ... మనం మూడు నెలలు ఉండే వేసవికే అష్షో బుష్షో అంటున్నాం కదా. అసలు ఎప్పుడూ వేసవే ఉండే ఊరు ఉందంటే నమ్ముతారా? అలాంటి ఊరు ఉంది. లక్కీగా ఇండియాలో కాదు. అమెరికాలో. అరిజోనా రాష్ట్రంలో. ఆ ఊరి పేరు యుమా.

యుమాకి చుట్టూ ఎడారి, ఇసుక, కొండలు. మ్యాప్‌లో చూస్తే మెక్సికో దేశానికి దగ్గరగా కనిపిస్తుంది. దీనిని ‘ఎండల రాజధాని’ అంటారు. ఎందుకంటే ఏడాదికి 4000 గంటలు ఇక్కడ ఎండ కాస్తూనే ఉంటుంది. ఇక్కడ ఏడాదిలో 330 రోజులు ఆకాశంలో ఒక్క మబ్బు ముక్క కూడా ఉండదు. నీలం రంగు అద్దంలా మెరిసిపోతుంటుంది. చుట్టూ సోనోరాన్‌ ఎడారి. 

ఇసుక తొందరగా వేడెక్కిపోతుంది.పర్వతాలు అడ్డు: పెద్ద పర్వతాలు వాన మబ్బులను రానివ్వవు. దగ్గరలో సముద్రం లేదు. అందుకే తేమ, చల్లని గాలి రాదు.  పంటల ఏడాదికి కేవలం 8 సెం.మీ. వాన పడుతుంది. మన హైదరాబాద్‌లో ఒక పెద్ద వానకు 5 సెం.మీ.  పడుతుంది. యుమాకు అది ఏడాది వాన!

గిన్నిస్‌ రికార్డ్‌: 
‘ప్రపంచంలో అత్యంత ఎండ కాసే నగరం’ అని గిన్నిస్‌ బుక్‌లో ఈ ఊరుకి పేరుంది.   యుమాలో గొడుగులు అమ్మే షాపులు చాలా తక్కువ. ఎందుకంటే అవసరమే ఉండదు. పిల్లలు ‘వాన పాట’ పాడాలంటే యూట్యూబ్‌ పెట్టుకోవాలి. బయటికి వెళ్లాలంటే మొహం, చేతులకు సన్‌క్రీమ్‌ రాయడం మర్చిపోరు. లేదంటే 10 నిమిషాల్లో టమాటో అయిపోతారు. ప్రతి ఇంట్లో, స్కూల్‌లో స్విమ్మింగ్‌ పూల్‌ ఉంటుంది.  

మనకు వాన సెలవు ఇస్తారు కదా? యుమాలో ‘చాలా ఎక్కువ వేడి’ అని ఎండకు బడికి సెలవు ఇస్తారు. 48 సెంటిగ్రెడ్‌లు దాటితే బయట ఆడుకోవడం బ్యాన్‌! ఇంత ఎండలో కూడా యుమాలో పాలకూర’ పండిస్తారు. అమెరికాకి కావాల్సిన లకూరలో 90% ఇక్కడి నుంచే వెళ్తుంది. చలికాలంలో పండిస్తారులే!  

Advertisement
 
Advertisement
Advertisement