10 లక్షలు ఔట్‌.. రాఘవ్‌ చద్దాకు భారీ షాక్‌ | Raghav Chad Instagram account sharp decline o one million followers | Sakshi
Sakshi News home page

10 లక్షలు ఔట్‌.. రాఘవ్‌ చద్దాకు భారీ షాక్‌

Apr 25 2026 1:07 PM | Updated on Apr 25 2026 1:16 PM

Raghav Chad Instagram account sharp decline o one million followers

 సాక్షి, న్యూఢిల్లీ:  ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి ఝలక్‌ ఇచ్చి  భారతీయ జనతా పార్టీ (BJP) తీర్థం పుచ్చుకున్న రాఘవ్ చద్దాకు భారీ షాక్‌ తగిలింది. పార్టీకి, పంజాబ్‌ ప్రజలకు ద్రోహం చేశారన్న ఆరోపణల మధ్య చద్దాకు సోషల్‌ మీడియాలో భారీ షాక్‌  తగిలింది.  

అతి తక్కువ కాలంలోనే  రికార్డు స్థాయిలో ఫాలోవర్లను కోల్పోవడం  చర్చనీయాంశంగా మారింది.  ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికలపై చద్దాను తీవ్రంగా ట్రోల్ చేయడం మాత్రమేకాదు లక్షలాది మంది అన్‌ ఫాలో చేయడం గమనార్హం. పార్టీ మారుతున్నట్టు ప్రకటించగానే రాఘవ్‌ చద్దాపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ముఖ్యంగా  ఈ పరిణామం సోషల్ మీడియాపై  బాగా ప్రభావం చూపించింది.

Unfollow Raghav Chadha సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత
రాఘవ్ చద్దా రాజకీయ మార్పు వార్త బయటకు రాగానే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో ఆయనపై విమర్శల వర్షం కురిసింది.ఫాలోవర్ల సంఖ్యగా భారీగా తగ్గిపోయింది. ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య సుమారు 1.46 కోట్ల (14.6 మిలియన్లు) నుండి 1.37 కోట్లకు పడిపోయినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అంతేకాదు ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 80,000 పైగా ప్రతికూల కామెంట్లు రాగా, ఫేస్‌బుక్‌లో వేలమంది యూజర్లు ఆయనను అన్‌ఫాలో చేయాలని ప్రచారం చేపట్టారు.

నెటిజన్లు ఆయనను ఉద్దేశించి “హీరో టు జీరో”, “పంజాబ్ గద్దర్” (పంజాబ్ ద్రోహి), , “అన్‌ఫాలో రాఘవ్ చద్దా”  చద్దా కాదు చడ్డీ అంటూ కామెంట్లతో హోరెత్తించారు. ఫలితంగా  24 గంటల్లోనే దాదాపు 10 లక్షల మంది ఆయన్ను అన్‌ఫాలో చేశారు.

సామాన్యుల సమస్యలపై గళం విప్పే నేతగా, ప్రజల పక్షాన నిలిచే వ్యక్తిగా రాఘవ్ చద్దాకు మంచి గుర్తింపు ఉండేది. అయితే, ఇటివలి  పరిణామాలు, కేజ్రీవాల్‌కి  లిక్కర్‌ స్కాంనుంచి ఊరట లభించగానే చద్దాపై చర్యలు,  పథకం ప్రకారం ఆరుగురి ఎంపీలతో కలిసి చద్దా పార్టీ మారిన నేపథ్యంలో ఆయనను అభిమానించే ఒక వర్గం ప్రజలు తీవ్ర నిరాశకు మరియు ఆగ్రహానికి లోనయ్యారు. ఈ నిర్ణయం ఆయన ప్రజాదరణపై తీవ్ర ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. రాఘవ్ చద్దాతో పాటు సందీప్ పాఠక్ ,అశోక్ మిత్తల్ కూడా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా చద్దా మాట్లాడుతూ.. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆప్ రాజ్యసభ సభ్యులలో మూడింట రెండు వంతుల మంది బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement